Satyabhama Today Episode November 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. భైరవి తన ఫ్రెండ్స్ వస్తున్నారని ఇల్లంతా తల తల మెరిసిపోవాలని సత్యతో చెప్తుంది. పనిమనిషితో నాకు పని ఉంది కాబట్టి నువ్వే దగ్గరుండి ఫినాయిల్ తో మెరిసేలా చేయాలని చెప్పి పైకి వెళ్ళిపోతుంది. దానికి పంకజం బాగా బుద్ధి చెప్పారు అమ్మ అని సంబరపడిపోతుంది. ఇక భైరవి అందంగా రెడీ అవుతూ ఉంటుంది. ఇంటికొచ్చిన భైరవి ఫ్రెండ్స్ తో జయమ్మ కౌంటర్ వేస్తూ ఉంటుంది. ఇక సత్య టీ పెట్టుకుని వస్తానని లోపలికి వెళ్తుంది. బైరవి స్టైల్ గా రెడీ అయ్యి కిందకొస్తుంది. మెట్ట దగ్గర సత్య ఫినాయిల్ వేసి ఉంటుంది. అది చూసుకోకుండా సత్య ఒకవైపు చెప్తున్న వినకుండా కాలు పెట్టి కింద పడుతుంది. ఆమె పడడానికి చూసి అందరూ నవుతారు. నవ్వడం ఆపి నన్ను లేపండి అని భైరవి అంటుంది. ఇక సత్య కావాలనే కింద పోసిందని నన్ను కింద పడేయాలి చూసిందని భైరవి సత్య పై కోపంతో రగిలిపోతుంది. ఇక భైరవి అలా ఫ్రెండ్స్ కిట్టి పార్టీ క్యాన్సిల్ అయిందని చెబుతుంది. ఇక భైరవి ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు. ఇక నొప్పితో భైరవి మంచం ఎక్కుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే… రాత్రి అందరు కూర్చొని భోజనం చేస్తుంటారు. సత్య పిలవడంతో భైరవి కిందకు వస్తుంది.. అక్కడ అందరు భైరవిని చూసి నవ్వుతారు.. అందరిని సీరియస్ చూస్తుంది. ఇక సోకులకు పోయి నడ్డి విరగొట్టుకుందని భైరవిని మహదేవయ్యని నవ్వుతాడు. అందరూ నవ్వుతారు. నా వైపు చూసి నవ్వుతారా అని భైరవి తినకుండా మిరే తినండి అని లేచి వెళ్లిపోతుంది.. నన్ను చూసి భయపడే వాళ్లు సత్య వల్ల నవ్వారు సత్యని వదలను అని భైరవి పంకజంతో చెప్తుంది. ఇక భోజనం వద్దని వచ్చేశారు ఆకలికి తట్టుకోలేరు కదా ఏం చేస్తారని పంకజం అడిగుతుంది. దాంతో భైరవి పక్కనున్న కబోర్డ్ ఓపెన్ చేయమని చెబుతుంది. దాన్ని చూసిన పంకజం కిచెన్ లో చేసిన లడ్డులు ఎలా మాయం అవుతున్నాయని అనుకున్న మీరు తెచ్చుకున్నారా అనగానే.. భైరవి నా తిండే కదా నీకేమైంది అంటూ తింటుంది.. ఇక పోయి భోజనం తీసుకు రా అంటుంది. దానికి పంకజం సత్యమ్మ చేసింది మీకు పర్లేదా అంటుంది.. నా ఆస్తి నుంచి చేసినవే కదా తీసుకురా అని అంటుంది.
ఇక సత్య బెడ్ సర్దుతుంటే క్రిష్ వచ్చి చూసి రొటీన్ ముద్దు ముచ్చట కాకుండా నా మనసు వెరైటీ కోరుకుంటుంది సంపంగి ఏం చేస్తే బాగుంటుంది అని తనలో తాను అనుకొని సరదాగా సత్యతో సేవలు చేయించు కుంటే ఎలా ఉంటుంది. మా అమ్మ కింద పడి నడుం విరగ్గొట్టుకుంటేనే మసాజ్లు అని సేవలు చేసింది నాకు అయితే పడి పడి ప్రేమతో సేవలు చేస్తుంది. అని కిందపడ్డట్లు యాక్ట్ చేస్తాడు.. నిజంగానే పడ్డాడని మొదట భయపడిన సత్య క్రిష్ కావాలనే చేస్తున్నాడని తెలుసుకొని వేడి వేడి నీళ్లతో కాపాడం పెడుతుంది. ఇక అంతే కెవ్వు మని క్రిష్ అరుస్తాడు. వీరిద్దరి రొమాన్స్ తో తెల్లారిపోతుంది..
ఉదయం పంకజం ఉడుస్తూ ఉంటుంది. అప్పుడే భైరవి అక్కడకు వస్తుంది. అది చూసిన పంకజం రెస్ట్ తీసుకోండి ఎందుకు వచ్చారని అంటుంది. సత్య మీద రివేంజ్ తీర్చుకోవాలని అంటుంది భైరవి. ఇక మోటర్ దగ్గరకు వెళ్లి సత్యకి షాక్ కొట్టేలా చేస్తుంది. సత్య వచ్చి మోటర్ వేసేలా చేయాలని అనుకుంటున్నానని అంటుంది. సత్య లోపల జయమ్మకు కాఫీ ఇస్తుంటే భైరవి సత్య దగ్గరకు వెళ్లి నీరు రావడం లేదు మోటర్ వేయమని చెప్తుంది.. ఇక లోపలికి వెళ్ళబోతుంది సత్య ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతుంది క్రిష్కి కాఫీ ఇచ్చి వెళ్తానని సత్య అంటుంది. సత్య క్రిష్ని నిద్ర లేపితే ముద్దు పెడితేనే లేస్తానని క్రిష్ అంటాడు. బాగా చెడిపోయావ్ అని క్రిష్ని అని సత్య మోటర్ వేయడానికి వెళ్తుంది. అయితే అప్పుడే కరెంట్ పోతుంది. భైరవి, పంకజం నవ్వుకుంటారు. కరెంట్ లేకపోవడంతో సత్య మోటర్ వేసినా షాక్ కొట్టదు.. అదేంటి అరుపులు వినపడలే అని అనుకుంటారు. సత్య లోపలికి వస్తుంది. పొంతన లేకుండా ప్రశ్నలు వేస్తుంది భైరవి.. మళ్లీ కవర్ చేస్తుంది. ఇక క్రిష్ ఏమైందని చూస్తే చూస్తే వంటింట్లో కరెంట్ ఉంటుంది తన గదిలో ఉండదు. ఏమైందని అనుకుంటాడు దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది..
ఇక రేపటి ఎపిసోడ్ లో సత్య నేను మోటార్ వేసాను కానీ ఆన్ అవ్వలేదు అని అంటుంది. ప్యూజ్ ను క్రిష్ పెడతాడు.. ఇక ఎలాగో కరెంట్ రాలేదు నేను ఆన్ చేస్తాను అని చేస్తోంది.. షాక్ కొడుతుంది.. జయమ్మ సత్యను కర్రతో కొట్టమని చెబితే కొడుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..