BigTV English

Brahmamudi Serial Today October 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  మరో కొత్త ప్లాన్‌ వేసిన అపర్ణ, ఇందిర – రుద్రాణిని ఇంట్లోంచి వెళ్లగొడతారన్న స్వప్న

Brahmamudi Serial Today October 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  మరో కొత్త ప్లాన్‌ వేసిన అపర్ణ, ఇందిర – రుద్రాణిని ఇంట్లోంచి వెళ్లగొడతారన్న స్వప్న

Brahmamudi serial today Episode:   మొదటి రోజు ఆఫీసు నుంచి ఇంటికి  వచ్చిన కావ్యకు కనకం ఎదురెళ్లి ఆఫీసులో జరిగిన వివరాలు అడుగుతుంది. అల్లుడుగారు ఏమైనా అన్నారా… నువ్వు ఆయనతో బాగానే మాట్లాడావా? అని అడుగుతుది. దీంతో చిర్రెత్తుకొచ్చిన కావ్య.. మీ అల్లుడు గారు ఆఫీసును వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లి తాతయ్యగారి మీద దండయాత్ర చేశారట కాన్సర్‌ కనకం అంటుంది. ఇంకా నీకేమైనా వివరాలు కావాలంటే మ అల్లుడుగారికే ఫోన్‌ చేసి కనుక్కో అంటూ లోపలికి వెళ్లిపోతుంది కావ్య.  ఇప్పటికే నా మీద కోపంతో ఉన్నారు అల్లుడు గారు. ఇలాంటి సమయంలో ఫోన్‌ చేస్తే ఇంకేమైనా ఉంటుందా? అని ఎవరికి చేయాలో వారికే చేస్తానని ఇందిరాదేవికి చేస్తుంది.


ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన ఇందిరాదేవి హలో కనకం చెప్పు అని అడుగుతుంది. దీంతో చెప్పాల్సింది నేను కాదండి.. మీరే చెప్పాలి. అల్లుడుగారు ఆఫీసు నుంచి వచ్చాడంట కదా? ఇప్పుడు ఆఫీసుకు వెళ్తాడా లేదా? అది ముందు చెప్పండి. అని కంగారుగా అడుతుంది. దీంతో  మేము ఉండగ ఎందుకు అంత కంగారుపడతావు. వాడు ఆఫీసుకు వెళ్లను అంటే వదిలేస్తామా..? మనం ఇంత కష్టపడింది వాళ్లను ఒకచోట ఉంచడానికే కదా? అని చెప్తుంది అపర్ణ. దీంతో కనకం అంటే ఇప్పుడు మీరు వెళ్లి బతిమాలుతారా? అని అడగ్గానే  బతిమాలడానికి, బుజ్జగించడానికి వాడేమీ పాలు తాగే చంటి పిల్లాడు కాదు. అడ్డగాడిదలా ఆరడుగులు పెరిగాడు అంటూ తిడుతుంది ఇందిరాదేవి.

దీంతో కనకం గాడిద ఎక్కడా ఆరు అడుగులు ఉండదు కదండి అనడంతో ఇందిరాదేవి కోపంగా కనకాన్ని తిడుతూ ముఖ్యమైన విషయాలు వదిలేసి గాడిద విషయాలు గుర్తు పెట్టుకుంటావేంటే గాడిద అనగానే  గాడిద కాకపోతే నన్ను అడ్డగాడిద అని తిట్టండి. ముందు అల్లుడి గారిని ఎలా ఆఫీసుకు పంపిస్తున్నారో చెప్పండి. అని కుతూహాలంగా కనకం అడగ్గానే అందకోసం మేము ఇగో అనే ఆపరేషన్‌ స్టార్ట్‌ చేస్తున్నామని చెప్తారు అపర్ణ, ఇందిరాదేవి. ఈ ఆపరేషన్‌ కు నీ కో ఆపరేషన్‌ కూడా కావాలని అడుగుతారు. మీరేం చేయమన్నా చేస్తాను అంటూ కనకం ఫోన్‌ కట్‌ చేస్తుంది.


దూరం నుంచి అంతా గమనిస్తున్న దగ్గరకు వచ్చి ఏంటి ఏదో ఇగో.. ఆపరేషన్‌ అంటూ మాట్లాడుకుంటున్నారు అని అడుగుతూ దగ్గరకు వస్తుంది రుద్రాణి. దీంతో అత్తాకోడళ్లిద్దరూ రుద్రాణిని పిచ్చతిట్టుడు తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతారు.  వీళ్లిద్దరూ ఏదో గూడుపుఠాణీ చేస్తున్నారు అదేంటో తెలుసుకోవాలి అని రుద్రాణి అనుకుంటుండగా నాకు తెలుసు అత్తయ్యా నేను చెప్తాను కదా అంటూ స్వప్న వస్తుంది. వాళ్లు నిన్ను ఇంట్లోంచి గెంటివేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు అని వెళ్లిపోతుంది.

కళ్యాణ్‌ తన ఆటో నడిపేటప్పుడు వేసుకునే డ్రెస్‌ వైపు చూస్తూ బాధపడుతుంటాడు. ఇంతలో అక్కడికి కాఫీ తీసుకుని అప్పు వచ్చి ఏంటి మాస్టారు అలా డల్లుగా ఉన్నారు అని అడుగుతుంది. కళ్యాన్‌ బాధగా నేను ఆటో నడపడం అవమానమా..? అదేమన్నా చిన్నతనమా..? అని అడుగుతాడు. దీంతో ఆటో నడపడం తప్పెలా అవుతుంది అని అప్పు చెప్పగానే మరి  నేనేమైనా ఇల్లీగల్‌ బిజినెస్‌ చేస్తున్నానా..? లేకపోతే ఎవరినైనా మోసం చేస్తున్నానా..? అని మళ్లీ అడుగుతాడు.

దీంతో విషయం అర్థమైన అప్పు ఆ రైటర్‌ ని కలిశావు కదా? అని అడుగుతుంది. దీంతో కళ్యాణ్‌ అవునని కలిశానని.. కనీసం ఆయన అసిస్టెంట్‌ గా కూడా పని చేసే అర్హత లేదని తెలుసుకుని వచ్చేశాను అంటాడు. దీంతో అర్హత లేదని నువ్వు అనుకున్నావా? ఆయన అన్నాడా? అని అప్పు అడుగుతుంది. దీంతో ఆయనే అన్నాడని కళ్యాణ్‌ చెప్పగానే  అరే భాయ్‌ అర్హత అనేది ఒకరు ఇస్తే వచ్చేది కాదు. అయినా నీకు అర్హత లేకపోతే నువ్వు రాసిన పాటను ఎందుకు తీసుకుంటాడు.  అంటూ కళ్యాణ్‌కు మోటివేట్‌ చేస్తుంది అప్పు.

ఆఫీసుల విషయాలు తెలుసుకోవాలని లాప్టాప్‌ ఓపెన్‌ చేసిన రాజ్‌  షాక్‌ అవుతాడు. తాను ఎంటర్‌ చేసిన పాస్వర్డ్‌ రాంగ్‌ అని రావడంతో కంగుతింటాడు. ఆ శంకిణి పాస్వర్డ్‌ మార్చివేసిందని కావ్యను తిట్టుకుంటాడు. పాస్వర్డ్‌ కోసం కావ్యకు ఫోన్‌ చేయబోయి దాంతో నేను ఎందుకు మాట్లాడాలి అనుకుని  పాస్‌వర్డ్‌ పంపించు అని కావ్యకు మెసేజ్‌ చేస్తాడు. మెసేజ్‌ చూసుకుని కావ్య  నవ్వుకుని.. ఎవరు మీరు అని రిప్లై ఇస్తుంది. నా నెంబర్‌ నే డిలీట్‌ చేశావా అని రాజ్‌ మెసెజ్‌ పెట్టగానే మీరు నా నెంబర్‌ డిలీట్‌ చేసినప్పుడు డిలీట్‌ చేయడం మాకు రాదా? అంటూ రిప్లై ఇస్తుంది.

దీంతో రాజ్‌ కోపంగా ఎంత ధైర్యమే నీకు నోరు మూసుకుని పాస్‌వర్డ్‌ పంపించు అని మెసేజ్‌ చేయగానే నీకు కంపెనీకి ఏంటి సంబంధం. బిజినెస్‌ లో ఎవ్వరినీ నమ్మకూడదు. కంపెనీ నుంచి బయటకు వెళ్లిన వాళ్లకు పాస్వర్డ్‌ చెప్పకూడదు. మిమ్మల్ని అడిగితే పాస్వర్డ్‌ చెప్పారా? చేతనైతే మీరే కనుక్కోండి గుడ్‌ నైట్‌ అని కావ్య రిప్లై ఇవ్వగానే రాజ్‌ కోపంగా ఆ కోడి మెదడు ఉన్నదే పాస్వర్డ్‌ కనుక్కోగా లేనిది నా లాంటి మేధావి కనుక్కోలేడా? అని ఏవేవో పాస్వర్డులు ఎంటర్‌ చేసినా ఓపెన్‌ కాదు. ఇంతలో రాజ్‌ అంతరాత్మ వచ్చి రాజ్‌ ను తిడుతుంది. నిన్న కంపెనీ సీటు పోయింది. ఇవాళ పాస్వర్డ్‌ పోయింది రేపు ఏం పోతుందో చూసుకో అనగానే రాజ్‌ కోపంగా చూస్తుంటే అంతరాత్మ వెళ్లిపోతుంది.

రైటర్‌ లక్ష్మీకాంత్‌, కళ్యాణ్‌కు ఫోన్‌ చేసి ఏంటి తమ్ముడు ఇందాక నేను అన్న మాటలకు కోపం వచ్చిందా? ఇంత చిన్న మాటలకే కోపం తెచ్చుకుంటే రేపు గొప్ప రైటర్‌ వి ఎలా అవుతావయ్యా..?  అంటూ  రేపు నువ్వు నిజంగా రైటర్‌ అయితే నిర్మాత ఒకలా మాట్లాడతాడు. డైరెక్టర్‌ ఒకలా మాట్లాడతాడు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇంకోలా మాట్లాడతాడు. పాట నచ్చకపోతే జనాలు బండబూతులు తిట్టుకుంటారు. అవమానాలు అనేవి మన జీన్స్‌ లో కలిసిపోవాలయ్యా.. నీలో ఎక్కడో కొంచెం  విషయం ఉందయ్యా.. ఇందాక నువ్వు బతిమాలితే నా మనసు కరిగింది. అందుకే నీకో చాన్స్‌ ఇద్దామనుకుంటున్నాను. నేను స్విచ్చియేషన్‌ చెప్తాను దాని మీద మంచి పాట రాయి. అని లక్ష్మీకాంత్ చెప్పగానే కళ్యాణ్‌ హ్యాపీగా ఫీలవుతాడు. సరే రాస్తాను అని ఫోన్‌ కట్‌ చేస్తాడు.

నిద్రలేచి కిందకు వచ్చిన రాజ్..  అందరూ హాల్లో కూర్చోవడం చూసి నన్ను బతిమాలి ఆఫీసుకు పంపాలని అందరూ మీటింగ్‌ పెట్టుకున్నట్టు ఉన్నారు అని బిల్డప్‌గా కిందకు వస్తాడు. ఎవ్వరూ కూడా రాజ్‌ను పట్టించుకోరు. కనీసం చూడను కూడా చూడరు. దీంతో రాజ్‌ ఏంటి సీన్‌ రివర్స్‌ అయినట్ల ఉంది అనుకుని రాజ్‌ వెళ్లి ఒక్కోక్కరిని పలకరిస్తుంటాడు. ఎవ్వరూ సరిగ్గా మాట్లాడరు. దీంతో రాజ్‌ షాక్‌ అవుతాడు.  ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Tags

Related News

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big tv Kissik Talks: రంగమ్మత్త పాత్ర పై రాశి కామెంట్స్..అందుకే వద్దనుకున్నా అంటూ!

Big tv Kissik Talks: కళ్ళను డొనేట్ చేసిన నటి రాశి…ఆ సినిమా ప్రభావమేనా?

Big Stories

×