BigTV English

Mother In Law Murder: ‘దొంగలు పడ్డ ఇంట్లో హత్య’.. మృతిరాలి కోడలు ఎంత డ్రామా చేసిందంటే..

Mother In Law Murder:  ‘దొంగలు పడ్డ ఇంట్లో హత్య’.. మృతిరాలి కోడలు ఎంత డ్రామా చేసిందంటే..

Mother In Law Murder| ఇంట్లో అత్తా కోడళ్ల మధ్య గొడవలు ప్రతీ ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఇలాంటి గొడవలు తీవ్రం కావడంతో హింసాత్మకంగా కూడా మారుతాయి. ఇలాంటిదే ఒక ఘటన దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని రేవాడీ జిల్లాలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. హర్యాణా రాష్ట్రంలోని రేవాడీ జిల్లా విజయ్ నగర్ కు చెందిన ఓంప్రకాశ్ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం పోలీసులకు ఫోన్ చేసి తన సోదరి ఇంట్లో దొంగలు పడ్డారని.. తను వెళ్లి అక్కడికి వెళ్లి చూస్తే.. తన సోదరి చనిపోయి ఉందని చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే విజయ్ నగర్ కు చేరుకొని విచారణ ప్రారంభించారు. ఇంట్లో మాయ దేవి అనే 46 ఏళ్ల మహిళ మృతదేహం లభించింది. అయితే అదే ఇంట్లో మరో గదిలో మాయ దేవి కోడలు చంచల (21) లోపలి నుంచి లాక్ చేసుకొని ఉంది.

Also Read: సహజీవనం చేసిన వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన యువతి.. ఈజీగా బెయిల్ తెచ్చుకున్న నిందితుడు.. ఎలాగంటే?


పోలీసులు మాయదేవి మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు. పోలీసులు ముందుగా ఫోన్ చేసి సమాచారం అందించిన ఓంప్రకాశ్ ను ప్రశ్నించారు. ఓం ప్రకాశ్ చెప్పిన కథనం ప్రకారం.. తన సోదరి మాయ దేవి ఇంట్లో ఆమెతోపాటు ఆమె కోడలు చంచలా, కొడుకు శంకర్ మాత్రమే ఉంటారు. మాయాదేవి భర్త నరేశ్ కుమార్ మిలిటరీ ఉద్యోగం రీత్యా ఇంటికి అరుదుగా సెలవు ఉన్నప్పుడు మాత్రమే వస్తాడు. కానీ ఘటన జరిగిన రోజు మయా దేవి కొడుకు శంకర్ పని మీద ఢిల్లీ వెళ్లాడు. అదే సమయంలో రాత్రి ఇంట్లో దొంగలు పడడంతో మాయా దేవి కోడలు చంచలా తన భర్త శంకర్‌కు ఫోన్ చేసింది. శంకర్ ఢిల్లీలో ఉండడంతో అతను తన మేనమామ ఓంప్రకాశ్ కు ఫోన్ చేసి వెంటనే తన ఇంటికి వెళ్లి చూడమని అడిగాడు. దీంతో ఓంప్రకాశ్ పరుగు పరుగున తన సోదరి ఇంటికి వెళ్లి చూడగా.. ఇంటికి బయటి నుంచి తాళం వేసి ఉంది.

అయితే లోపల చంచల దేవి అరుపులు వేయడంతో ఓంప్రకాశ్ గోడ దూకి ఇంట్లో ప్రవేశించాడు. ఇంటి లోపల వెళ్లి చూడగా.. తన సోదరి మాయా దేవి ఒక గదిలో రక్తపు మడుగులో పడి ఉంది. మరో గదిలో చంచలా లోపలి నుంచి లాక్ చేసుకొని ఉంది. ఆమె బయటికి రావాలని ఎంత పిలిచినా రాలేదు. దొంగలు ఇంట్లో పడి దోచుకుంటుంటే అడ్డుపడిన తన అత్త మాయాదేవిని హత్య చేసి.. తనను కూడా హత్య చేయడానికి ప్రయత్నించారని.. అందుకే తనను తాను కాపాడుకోవడానికి ఒక గదిలోపల లాక్ చేసుకున్నానని చెప్పింది. ఇదంతా విన్న పోలీసులు.. చంచల స్టేట్ మెంట్ తీసుకున్నారు.

చంచలా కూడా ఓం ప్రకాశ్ చెప్పిన కథనమే చెప్పింది. కానీ పైగా దొంగలు తనపై దాడి చేసినట్లు తన చేతిపై కత్తి గాయాలు కూడా చేసింది. కానీ చంచల పోలీసులకు తన వాంగ్మూలం ఇచ్చే సమయంలో ఒకసారి ముగ్గురు దొంగలని.. మరోసారి నలుగురు దొంగలని చెప్పింది. పైగా ఒకసారి తాను ఇంటికి బయటి నుంచి తాళం వేశానని.. మరోసారి దొంగలు తమను ఇంట్లో బంధించి వెళ్లిపోయారని వాంగ్మూలం ఇచ్చే సమయంలో తడబడింది. దీంతో పోలీసులకు ఆమెపై అనుమానం కలిగింది.

Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

పోలీసులు విజయ్ నగర్ ప్రాంతంలోని అన్ని సిసిటీవి వీడియోలు గాలించారు. కానీ ఆ ప్రాంతంలో దొంగలు పడినట్లు ఎక్కడా కనిపించలేదు. దీంతో విచారణ మళ్లీ ప్రారంభించారు. ఈసారి చంచలను గట్టిగా ప్రశ్నించారు. ఆమె ఎందుకు అబద్ధం చెప్పిందని.. అసలు దొంగలు ఎక్కడున్నారని.. ఆ దొంగలతోపాటు ఆమె కూడా కలిసి ఇదంతా చేసిందని అనుమానించారు. దీంతో చంచలా ఒక షాకింగ్ విషయం చెప్పింది.

తన వివాహం జరిగి ఆరునెలల అవుతోందని.. కానీ అప్పటి నుంచి తన అత్త మాయా దేవి తనను హింసిస్తోందని.. ప్రతి రోజు మాటలతో చిత్రహింసలు పెడుతోందని.. ఈ క్రమంలోనే హత్య జరిగిన రోజు రాత్రి భోజనం చేస్తుండగా.. తమ ఇద్దరికీ గొడవ జరిగిందని చెప్పింది. ఈ క్రమంలో తనపై అత్త చేయిచేసుకోవడంతో ఆమెను తన సమీపంలో ఉన్న కత్తితో పొడిచేశానని చెప్పింది. ఈ కారణంగా తన అత్త అక్కడికక్కడే చనిపోవడంతో.. ఏం చేయాలో తెలియక… ఇంట్లో దొంగలు పడినట్లు నాటకం ఆడానని వెల్లడించింది. పోలీసులు మాయా దేవి హత్య కేసులో ఆమె కోడలు చంచలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కోర్టులో సాగుతోంది.

Related News

MP Tractor Accident: దుర్గమ్మ నిమజ్జనంలో అపశ్రుతి.. చెరువులో ట్రాక్టర్ బోల్తా.. 10 మంది మృతి

MP Couple Buries Child: కన్నబిడ్డను సజీవ సమాధి.. ఉద్యోగం కోసం తల్లిదండ్రులు దారుణం

Tamilnadu Accident: పండుగ పూట ఘోరం.. ట్రిప్‌కి వెళ్తూ కారులోనే సజీవంగా

Kakinada Crime News: యువతి గొంతు కోసిన యువకుడు, నిన్ను వదిలి వెళ్లిపోతున్నా, కాకినాడ జిల్లాలో దారుణం

Khammam News: ఖమ్మంలో ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న వాహనం, షాకింగ్ దృశ్యాలు

Guntur Crime: లవర్‌తో కలిసి భర్తను చంపేసిన భార్య.. గుంటూరు జిల్లాలో దారుణ ఘటన

Vishal Brahma Arrest: డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ హీరో.. రూ.40 కోట్ల మత్తు పదార్థాలు స్వాధీనం

Tandoor Crime: రైలు ఎక్కుతూ జారిపడి ASI మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన

Big Stories

×