E-Paper
Advertisement

Deepika Rangaraju: రూ.20తోనే నా జీవితం మొదలు.. నవ్వించే దీపికలో ఇంత దుఃఖమా?

Deepika Rangaraju: రూ.20తోనే నా జీవితం మొదలు.. నవ్వించే దీపికలో ఇంత దుఃఖమా?
Advertisement

Deepika Rangaraju:దీపికా రంగరాజు (Deepika Rangaraju) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం వెళ్లి విరుస్తుంది అనడంలో సందేహం లేదు. ఆమె ఎక్కడ కనిపించినా సరే ఆ వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారుతుందని.. ఆమెతో గడిపిన వారే కాదు ఆమె కనిపించే విజువల్స్ కూడా మనకు అనిపిస్తాయి. అంతలా నవ్వుతూ అల్లరిగా కనిపించే కావ్య ఇండస్ట్రీలోకి రాకముందు పడ్డ బాధలు అభిమానులను కూడా కలిచివేస్తున్నాయి. ‘బ్రహ్మముడి’ సీరియల్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న దీపికా రంగరాజు ప్రస్తుతం వరుస టీవీ షోలలో కూడా హడావిడి చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి శ్రీదేవి డ్రామా కంపెనీ (Sridevi drama company).

దీపికా రంగరాజు ఫస్ట్ సాలరీ..

ఇందులో వచ్చీరాని తెలుగులో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ.. వామ్మో ఈమె ఏంట్రా ఇంత ఓవరాక్షన్ చేస్తోంది అని అందరూ తలలు పట్టుకునేట్టు చేస్తున్న దీపిక శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మాట్లాడుతూ.. తన ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. తాజాగా లేటెస్ట్ ప్రోమోని విడుదల చేయగా ఈ ప్రోమోలో దీపికా మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యపరిచింది. షోలో భాగంగా కెరియర్ స్టార్ట్ అవ్వాలి అంటే ముందు మనలో ఫైనాన్షియల్ స్టార్ట్ అవ్వాలి. ఫైనాన్స్ రావాలి అంటే మనం ఏదో ఒక పని చేయాలి. ఎవరు తమ తమ జీవితాలలో ఎలాంటి పని చేసి మొదటి రెమ్యునరేషన్ అందుకున్నారు అని యాంకర్ రష్మీ ప్రశ్నించగా.. జబర్దస్త్ పొట్టి నరేష్ మాట్లాడుతూ..” రాకింగ్ రాకేష్ నాకు 500 రూపాయలు ఇచ్చారు” అని చెప్పగా.. దీపికా రంగరాజు మాట్లాడుతూ.. “నా మొదటి శాలరీ 20 రూపాయలు మాత్రమే” అంటూ తాను చేసిన పని గురించి చెప్పుకొచ్చింది. అయితే ఆమె ఏం చేసింది అనే విషయాలపై క్లారిటీ ఇవ్వలేదు.. ఇక పూర్తి ఎపిసోడ్ మార్చి 15న ప్రసారం కానుంది. మరి ఆమె ఏం చెప్పింది అనే పూర్తి వివరాలు తెలియాలి అంటే ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ప్రస్తుతం దీపిక షేర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..

Advertisement

ALSO READ:Seerath kapoor: నిర్మాతలకు సీరత్ మాస్ వార్నింగ్.. చర్యలు తప్పవంటూ హెచ్చరిక!

దీపికా రంగరాజు కెరియర్..

దీపికా రంగరాజు కెరియర్ విషయానికి వస్తే..’చిత్రం పేసుతాడి’ అని తమిళ సీరియల్ తో హీరోయిన్గా తన కెరియర్ ను మొదలుపెట్టింది. అది పూర్తయ్యే సమయానికి బ్రహ్మముడిలో అవకాశం అందుకుంది. ఇక ఈ సీరియల్ ప్రారంభం కాకముందే దీని గురించి విపరీతమైన ప్రమోషన్స్ జరగడంతో బ్రహ్మముడికి చాలా రేటింగ్ వచ్చి పడుతోంది. అలా ముందుగా కావ్య పాత్రతో అందరినీ మెప్పించిన ఈమె.. మానస్ సరసన తన నటనతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఒకవైపు బుల్లితెర నటిగా మరొకవైపు ఎంటర్టైనర్ గా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంటుంది దీపికా రంగరాజు.

Advertisement

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×