OTT Movie : సైన్స్ ఫిక్షన్ ఫ్యాన్స్ కు ఒక ఎంటర్‌టైనింగ్ రైడ్ ను ఇచ్చే సినిమా ఓటీటీలో ఉంది. ఈ సినిమా అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకుంటోంది. చంద్రుడు భూమిని ఢీకొనే ఒక ఊహా జనిత స్టోరీ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ స్టోరీ మొదటి నుంచి చివరిదాకా ఉత్కంఠంగా నడుస్తుంది. సైన్స్ ఫిక్షన్ అభిమానులకు ఈ మూవీ బెస్ట్ సజెషన్. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతింది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
‘మూన్‌ఫాల్’ (Moonfall) 2022లో విడుదలైన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. దీన్ని రోలాండ్ ఎమ్మెరిచ్ డైరెక్ట్ చేశాడు. అతను ‘ఇండిపెండెన్స్ డే’ ‘2012’ వంటి డిజాస్టర్ సినిమాలకు పని చేసాడు. ఈ సినిమా 2 గంటల 10 నిమిషాల నిడివి ఉంటుంది. ఇందులో హాలీవుడ్ స్టార్స్ హాలీ బెర్రీ, పాట్రిక్ విల్సన్, జాన్ బ్రాడ్లీ నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
ఒక స్పేస్ మిషన్‌లో బ్రియాన్, జో ఫౌలర్ చంద్రుడి దగ్గర పని చేస్తుండగా, ఒక మిస్టీరియస్ శక్తి వాళ్లపై దాడి చేస్తుంది. ఈ దాడిలో ఒక యాస్ట్రనాట్ చనిపోతాడు. దీనికి బ్రియాన్ ను అందరూ బ్లేమ్ చేస్తారు. అతని కెరీర్ కూడా నాశనమవుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత కేసీ హౌస్‌మన్ అనే ఒక సైన్టిస్ట్ చంద్రుడు తన కక్ష్య నుండి బయటకు వస్తున్నాడని, భూమితో ఢీకొనబోతున్నాడని కనుగొంటాడు. అయితే ఎవరూ అతని మాట నమ్మరు. కానీ చంద్రుడు నిజంగానే భూమి వైపు కదులుతుంటాడు. ఇది భయంకరమైన డిజాస్టర్‌కు దారితీస్తుంది. చంద్రుడు దగ్గరకు రావడంతో భూమిపై భారీ విపత్తులు మొదలవుతాయి.
Read Also : 8000 లీటర్ల బ్లడీ బ్లడ్ బాత్… బ్రూటల్ క్లైమాక్స్ మావా… గుండె ధైర్యం ఉంటేనే ఈ హర్రర్ మూవీని చూడండి