E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు చుక్కలు చూపించిన బాలు.. ఇదేం కర్మ రా అయ్యా.. మనోజ్ కు చూపుపోయిందా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు చుక్కలు చూపించిన బాలు.. ఇదేం కర్మ రా అయ్యా.. మనోజ్ కు చూపుపోయిందా..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode 13th: రవి రెస్టారెంట్ కు శోభా వెళ్తుంది.. శోభ అక్కడ కూర్చుని ఉంటుంది.. శృతి అక్కడికి వెళ్లి ఆర్డర్ అని అడగగానే శోభాను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అదేవిధంగా శృతిని అలా చూసి శోభ కూడా షాక్ అవుతుంది.. నువ్వేంటి ఇక్కడ వెయిటర్ గా పని చేస్తున్నావా..? నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చావో ఎక్కడి నుంచి వచ్చావో అది మర్చిపోతున్నావా అని శృతికి దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ పీకుతుంది శోభ..నువ్వు మంచి వాడివని అనుకున్నాను కానీ మా అమ్మాయి చేత ఇలాంటి పని చేస్తున్నవని నాకు అర్థం కావడం లేదు అని శోభా చాలా ఫీల్ అయిపోతుంది. మమ్మీ ఇక్కడ గొడవ చేయొద్దు నువ్వు వెళ్ళు అని అనగానే.. ఎవరితో చెప్తే నీ తిక్క కుదురుతుందో నాకు బాగా తెలుసు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి శృతి ఇది నేను పని చేసే చోటా నాకు ఇలాంటివి ఎందుకు అని రవి ఫీలవుతాడు..ప్రభావతి అనవసరంగా బాలును గెలికి అతని శాపానికి గురవుతుంది… నీ నడుమును విరుగుతాయి ఏమైనా అంటే అని బాలు ప్రభావతిని అంటాడు. మనోజు ప్రభావతి కూర్చుంటూ ఉండగా ఆ కుర్చీని లాగడంతో తను కింద పడిపోయి నడుము విరగట్టుకుంటుంది.

మనోజ్ కు షాకిచ్చిన బాలు..

మనోజ్ హాల్లో కూర్చుని నిద్రపోతూ ఉంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి మనోజ్ మనోజ్ అని గట్టిగా అరుస్తుంది.. అయితే మనోజ్ మాత్రం పలకకపోవడంతో కళ్ళు ఆపరేషన్ చేయించిన తర్వాత మెలకువగా ఉన్నాడో నిద్రపోతున్నాడు అర్థం కావడం లేదు అని రోహిణి అనుకుంటూ ఉంటుంది.. మనోజ్ అని గట్టిగా అరవడంతో ఆ చెప్పు రోహిణి అలా నిద్ర పట్టేసింది అని అంటాడు. నీకోసం పాలు తీసుకొని వచ్చాను తాగు అని రోహిణి అనగానే మనోజ్ ఇవి కాస్త వేడిగా ఉన్నాయి కాసేపాగి తాగుతాను అని అంటాడు.. రోహిణి పాలను అక్కడే పెట్టి నేను లోపలికి వెళ్తున్నాను ఒక ముఖ్యమైన కాల్ మాట్లాడాలి.. నువ్వు పాలు తాగు అని అంటుంది.. సరే అంతే కాదు నాకోసం ఒక క్లైంట్ కూడా రాబోతున్నారు అని రోహిణి చెప్పగానే సరే నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని మనోజ్ అంటాడు.. పాలు అక్కడే ఉండడం చూసిన బాలు వీడికి కళ్ళు కనిపించవు కదా… ఆ పాలు మనం తాగి వీడికి జలక్ ఇవ్వాలి అని మనోజ్ మూతికి పాలు కొంచెం రాస్తాడు.. ఆ తర్వాత మొత్తం పాలని తాగేస్తాడు..

నోరుజారిన మనోజ్..

Advertisement

మనోజ్ ఆ పాలు నేను తాగలేదని ఎంత చెప్తున్నా సరే.. మనోజ్ మూతిని చూసిన వాళ్ళు ఎవరైనా సరే పాలు తాగాడని అనుకుంటారు.. ఆ తర్వాత మనోజ్ ప్రభావతిని పిలిచి మాట్లాడుతాడు.. నువ్వు తాగకుండా ఎవరు తాగారా ఏం మాట్లాడుతున్నావ్ రా నీ ప్రభావతి కూడా అంటుంది.. ఇక ప్రభావతి అలా వెళ్ళిందని అనుకున్న మనోజ్ మా అమ్మకు ఏం చెప్పినా నమ్ముతుంది. రెండు సెంటిమెంట్ డైలాగులు అలా పడేస్తే మా అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది అని మనోజ్ అంటాడు.. రోహిణి మనోజ్ ని కొడుతుంది.. ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోగానే నువ్వు అన్న మాటలన్నీ అత్తయ్య గారు విన్నారు తెలుసా అని అంటుంది.. మంచి పని చేసావ్ రోహిణి నేను నోరు జారి మాట్లాడితే ఇలానే కొట్టు అని అంటాడు..

బిక్షగాడిని ఇంట్లోకి తీసుకొచ్చిన మనోజ్..

బిచ్చగాడు బయట అమ్మా అని అరుస్తూ ఉంటాడు.. మనోజు రోహిణి కోసం వచ్చిన క్లైంట్ ఏమో అని లోపలికి రమ్మని చెప్తాడు.. అయితే ఇతను ఎవరు కళ్ళకు ఆపరేషన్ చేయించుకున్నాడా ఏంటి..? ఆ ఏదైతేమీ మనకి ఫుడ్డు పెడతాడు కదా అని అతను కూడా సరాసరి లోపలికి వచ్చి అక్కడ కూర్చుంటాడు.. ఇక మనోజ్ బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు.. అప్పుడే వచ్చిన మీనా అతని చూసి ఎవడ్రా నువ్వు? ఇక్కడ కూర్చున్నావ్ ఏంటి అని అడుగుతుంది.. క్లైంట్ అని మర్యాద ఇవ్వకుండా అలా మాట్లాడతావ్ ఏంటి ఇతను రోహిణి క్లైంట్ అని మనోజ్ అంటాడు.. మీనా ప్రభావతిని కేకలు వేసి పిలుస్తుంది.. అక్కడున్న బిక్షగాడిని చూసి ప్రభావతి షాక్ అవుతుంది.. ఎవడు వీడు అని రోహిణి కూడా అడుగుతుంది.. అరేయ్ వాడికి నీకు బాగా సంబంధం ఉన్నట్టుంది వాడెవడో కూడా నీకు తెలియట్లేదు అని ప్రభావతి అంటుంది.. అయితే వాడు ఒక ముష్టోడు రా వాడి ఇంట్లోకి తీసుకొని వచ్చావు అని ప్రభావతి బయటికి పంపించేస్తుంది..

విద్య లవ్ స్టోరీ సక్సెస్..

Advertisement

విద్య మనోహర్ని గుడికి రమ్మని పిలుస్తుంది. మనోహర్ గుడిలోకి రాగానే ఆ లెటర్ గురించి విద్యా మాట్లాడుతుంది.. ఇద్దరు కూడా కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఒకరి అభిరుచుల గురించి మరొకరు తెలుసుకుంటారు.. ఆ తర్వాత విద్య మీనాకు ఫోన్ చేసి నువ్వు చెప్పినట్లుగానే మా ఇద్దరి అభిప్రాయాలను ఒక పేపర్లో రాసి ఇచ్చాను.. అతను అభిప్రాయాలు నా అభిప్రాయాలు బాగానే సెట్ అయ్యాయి.. నేను ఎప్పుడూ అతని ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తానని ఎదురు చూస్తున్నాడు అని మీనాతో చెప్తుంది విద్య. అయితే మీనా మాత్రం అప్పుడే నువ్వు ఓకే చెప్పొద్దు ఇంకొన్ని రోజులు వెయిట్ చేయించి అప్పుడు చెప్తే బాగుంటుంది అని చెప్పగానే విద్య ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాం.. అన్నట్లుగా అతనికి చెప్పడంతో ఇంకా ఏమీ చేయలేక అక్కడ నుంచి వెళ్ళిపోతారు.

మనోజ్ కు చూపు పోతుందా..?

మనోజ్ ను బాలు ఒక ఆట ఆడుకుంటాడు. అయితే మనోజ్ దేవుడి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకొని నాకు కళ్ళు రావాలి అని మొక్కుకుంటాడు.. చూసావా మీనా వాడు దేవుడి దగ్గరికి వెళ్లి కూడా అన్ని ఫ్రీగా వచ్చేలా చేస్తున్నాడు అని అనుకుంటారు.. ఇక దేవుడు కల దండం పెట్టుకున్నాడో లేదో రోహిణి గుడ్ న్యూస్ మనోజ్ అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది.. కట్లు విప్పడానికి నర్స్ వస్తున్నారని చెప్పగానే.. మనోజ్ తో పాటు మిగిలిన వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు.. బాలు కౌంటర్ల మధ్య మనోజ్ కి కట్లు విప్పుతారు.. మనోజ్ నాకు మసక్క కనిపిస్తుంది అని చెప్పగానే అందరూ కూడా షాక్ అవుతారు. మనోజు నాకు కళ్ళు మసక మసకగా కనిపిస్తున్నాయి అని చెప్పడంతో అందరూ ఏంటి వీడికి చూపు వస్తుందో రాదా అని అనుకుంటారు.. అయితే మనోజ్ కళ్ళజోడు మర్చిపోయాడు కాబట్టి బాలు తెచ్చి దాన్ని ఇవ్వగానే స్పష్టంగా కనిపిస్తుంది అని అంటాడు.. మనోజ్ మళ్లీ చూడగలుగుతున్నాడు అని అందరూ చాలా సంతోషంగా ఉంటారు.. బాలు నోటితో కాస్త జాగ్రత్తగా ఉండరా అ ని ప్రభావతి వార్నింగ్ ఇస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : కన్నాను షాకైన కేశవ.. అర్రె అడ్డంగా ఇరుక్కున్నాడే.. నారాయణ దెబ్బకు షాక్..

Related News

Podarillu Kanna : సీరియల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కన్నా అవుట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇరుక్కుంటుందా..? మీనాకు కొత్త టెన్షన్.. బాలు, ప్రభా ఫైట్..

Podarillu Today Episode : నారాయణ మాటతో షాక్.. జమునకు మైండ్ బ్లాక్.. మహాకు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు కోసం కన్నీళ్లు.. భద్రకు తల్లి వార్నింగ్.. వల్లికి, భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

Illu Illaalu Pillalu : రామరాజు అరెస్ట్.. స్టోరీలో ఊహించని ట్విస్ట్.. శ్రీవల్లి అవుట్..

Brahmamudi Serial Today Episode October 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సొంత ఆఫీసుకు వెళ్తూ రేఖకు షాక్‌ ఇచ్చిన ఐశ్వర్య

Big Stories

Advertisement
×