E-Paper
Advertisement

Podarillu Today Episode : కన్నాను షాకైన కేశవ.. అర్రె అడ్డంగా ఇరుక్కున్నాడే.. నారాయణ దెబ్బకు షాక్..

Podarillu Today Episode : కన్నాను షాకైన కేశవ.. అర్రె అడ్డంగా ఇరుక్కున్నాడే.. నారాయణ దెబ్బకు షాక్..
Advertisement

Podarillu Today Episode July 13th: కేశవ తన ఇంట్లో వాళ్ల గురించి శైలుకి చెప్పడం అందరూ అక్కడే ఉండి వింటారు. అది విన్న వాళ్ళందరూ కూడా పక్కకు వెళ్లి వీడు ఇలా అంటాడని అస్సలు ఊహించలేదు. అతని గురించి అతను గొప్పగా చెప్పుకోవాలని మనందరి గురించి ఇలా మాట్లాడతారని అందరూ చాలా సీరియస్ గా ఉంటారు. అప్పుడు మనిషా ఏమైంది ఏం జరిగింది అని హిందీలో అడుగుతుంది.. ఏం జరగలేదు అని మహాలక్ష్మి అంటుంది.. అయితే మహాలక్ష్మి అందరి గురించి అలా చెప్పడానికి అతనికి ఎంత ధైర్యం అని సీరియస్ అవుతుంది.. పోనీలే అమ్మ ఏదో అన్నాడు అని మాధవ్ అనగానే మీరు ఇలా అనడం వల్లే అతను మిమ్మల్ని కూడా పరువు తీసేలా మాట్లాడుతున్నాడు అని మహా సీరియస్ అవుతుంది.. అంతే కాదు అందరూ తమల్ని ఎంతమాట అంటారా అని బాధపడిపోతూ ఉంటారు.. నన్ను మహంకాళి అంటాడా ఇంటికి వస్తాడు కదా అతని సంగతి చెప్తాను అని మహాలక్ష్మి సీరియస్ అవుతుంది..

కన్నా ప్లాన్ వర్కౌట్..

కన్నా మనల్ని ఇంత మాట అంటారా.. నేను ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకొని వస్తాను అని కోపం వెళ్తాడు.. అందరూ ఎంతగా ఆపాలని ప్రయత్నించిన సరే.. అస్సలు వినకుండా కన్నా నేను నా కోపాన్ని చల్లార్చుకొని వస్తాను అని అంటాడు. నన్ను డిగ్రీ ఫెయిల్ అయినవాడు అని అవమానిస్తాడా..? ఈరోజు వాడి అంతు చూస్తాను అని కోపంగా వెళ్ళిపోతాడు కన్నా. పార్క్ లో పల్లీలు అమ్మే వ్యక్తి దగ్గరనుంచి ఆ బుట్టని తీసుకొని ఇప్పుడే ఇస్తాను అని వెళ్తాడు.. కేశవ శైలు ఉన్న ప్లేస్ కి వెళ్లి పల్లీలు పల్లీలు అంటూ గోల గోలగా అరుస్తాడు.. వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఇంకాస్త ఎక్కువగా పల్లీలు అంటూ గట్టిగా అరుస్తాడు. వేడివేడి పల్లీలు ఉతికారేసిన పల్లీలు, డిగ్రీ ఫెయిల్ అయిన పల్లీలు అని గట్టిగా అరుస్తూ ఉండడంతో కేశవ అసలే భయంగా ఉందంటే ఈ పల్లీలమ్మేవాడు ఒకడు అని అంటాడు.. వాడితో నీకేం పని లేదా అస్సలు ఊరుకునేదే లేదని లేస్తాడు కేశవ.

శైలుకు నిజం చెప్పిన కేశవ..

Advertisement

కేశవ ఆవేశంగా లేచి ఎదురుగా ఉన్న కన్నా ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు.. సర్ పల్లీలు కావాలా పల్లీలు పల్లీలు అని కన్నా అనడంతో కేశవ అడ్డంగా వీడికి దొరికిపోయానా అని కంగారు పడిపోతూ ఉంటాడు.. ఏంట్రా ఇక్కడ.. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ రా.. ఆ పల్లీలు ఏంటి అని కేశవ కన్నా అని అడుగుతాడు.. కన్నా మాత్రం నేను డిగ్రీ ఫెయిల్ అయినోన్ని ఏం చేస్తాను చెప్పండి అని అంటాడు. ఆ తర్వాత వీడు నేను పార్కులో ఉన్నానని సంగతి అందరికీ చెప్తాడేమో అని శైలు నీ బలవంతంగా అక్కడి నుంచి పంపించేస్తాడు.. వీడు నా గురించి నిజం చెప్పే లోపల నేనే వాళ్ళ దగ్గరికి వెళ్లి చెప్పాలి అని అనుకుంటాడు కేశవ.. ఇక పార్క్ మొత్తం వెతుకుతూ ఉంటాడు..

అడ్డంగా ఇరుక్కున్న కేశవ..

నేనిచ్చిన జలకు మామూలుగా లేదు వదిన.. ఇప్పుడు కచ్చితంగా మనల్ని వెతుక్కుంటూ వస్తాడు అని కన్నా అనగానే మహా చాలా సంతోషంగా ఉంటుంది.. ఎదురుగా కేశవా అందరిని వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు.. మీరు ఇక్కడికి వచ్చారా అని కేశవ అడుగుతాడు.. మీరు వస్తారని తెలియక మేము కూడా ఇక్కడికే వచ్చాము సార్ అని మహాలక్ష్మి అనగానే ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారు అని అంటాడు కేశవ. అటు చక్రి తో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా కేశవని ఒక ఆట ఆడుకుంటారు. అయితే కేశవ మీరు నన్ను ఆడుకోవాలని చూశారని నాకు బాగా అర్థమైంది. మీరందరూ నాతో ఆడుకుంటున్నారు కదూ అని అంటాడు.. మనిషా కూడా ఎక్కడికి వచ్చిందా అని కేశవ్ అనగానే.. తను రాలేదు నేనే తనని బలవంతంగా తీసుకొని వచ్చాను ఎందుకంటే మహంకాళిని కదా అని మహాలక్ష్మి అనగానే సారీ అండి అని కేశవ్ అంటాడు.. ఇక అందరూ కూడా కేశవ ని చూసి ఒక్కసారిగా నవ్వుకుంటారు..

అయ్యో.. ఎంత పని చేశావ్ నారాయణ..

Advertisement

ఇక మహాలక్ష్మి నవ్వుతూ ఉండగా చక్రింగా నవ్వుతూనే ఉంటారా ఏదైనా ఒక ఆట ఆడుకుందాం పదండి అని అందరూ కలిసి కళ్ళకు గంతలు కట్టుకునే ఆటనే ఆడుకుంటారు. ఇక మహాలక్ష్మి వంటగ దొరకడంతో చక్రి తన మనసులోని మాటని చెప్పాలని అనుకుంటాడు. అయితే తన మనసులో మాట చెప్పబోతూ ఉండగా నారాయణను సెక్యూరిటీ పోలీసులకు పట్టిస్తాను అని గొడవకు దిగుతాడు.. ఇక నారాయణ ఏం చేశాడో తెలుసుకోవాలని అందరూ అక్కడికి వెళ్తారు.. ఆయన మందు తాగి ఇక్కడ న్యూసెన్స్ చేస్తున్నాడని చెప్పగానే మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఇక సెక్యూరిటీ దగ్గర నుంచి నారాయణను విడిపించి ఇంటికి తీసుకొని వస్తారు.. అందరూ కలిసి నారాయణను ఒక ఆట ఆడుకుంటారు.. నారాయణ ను తీసుకొచ్చిన మహాలక్ష్మిని కూడా అందరూ తిడతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి పై కమల్ కు అనుమానం.. ప్రణతికి సపోర్ట్ గా చక్రధర్.. అవని సర్ప్రైజ్ గిఫ్ట్..

Related News

Illu Illaalu Pillalu : రామరాజు అరెస్ట్.. స్టోరీలో ఊహించని ట్విస్ట్.. శ్రీవల్లి అవుట్..

Brahmamudi Serial Today Episode October 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సొంత ఆఫీసుకు వెళ్తూ రేఖకు షాక్‌ ఇచ్చిన ఐశ్వర్య

Thursday TV Movies : గురువారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 15th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: వైజయంతికి మనోహరి గురించి సరస్వతి నిజం చెప్తుందా..?  

బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి.. వీడియో వైరల్!

మంగ్లీ vs మధుప్రియ.. ఈసారి బతుకమ్మ పాటల్లో ఎవరిది పైచేయి?

తల్లి కాబోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్.. ఘనంగా సీమంతపు వేడుక!

అగ్గిపెట్టి మచ్చ అంత్యక్రియల్లో అసలేం జరిగింది? బయటపెట్టిన వైజాగ్ సత్య!

Big Stories

Advertisement
×