E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode July 13th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఫోన్ చేసి శివనారాయణను రెచ్చగొట్టిన దక్షిణమూర్తి 

Karthika Deepam 2 Serial Today Episode July 13th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఫోన్ చేసి శివనారాయణను రెచ్చగొట్టిన దక్షిణమూర్తి 
Advertisement

Karthika Deepam 2 serial today Episode: స్కూటీ వెళ్తున్న సూరజ్‌ తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చూస్తూ.. కుళ్లుతో చచ్చిపోతావని జ్యోత్స్నకు చెప్తాడు. అంత చెండాలంగా ఉంటుందా..? ఆ అమ్మాయి అంటూ తిడుతుంది జ్యోత్స్న.. అదేం లేదు.. చూస్తావా.? ఆ అమ్మాయిని అని సూరజ్‌ అడిగితే ఓ ఫోటో కూడా ఇచ్చిందా నీకు చూపించు అంటుంది జ్యోత్స్న.. సూరజ్‌ తన ఫోన్‌లో ఉన్న జ్యోత్స్న ఫోటోనే చూపిస్తాడు. ఆ ఫోటో చూసిన జ్యోత్స్న కోపంగా సూరజ్‌ను తిడుతూ.. నీకు పోయే కాలం వచ్చిందిరా..? అంటూ తిడుతుంటే.. సూరజ్‌ కోపంగా బ్రహ్మదేవుడు నీ డ్రెస్‌కు నా షర్ట్‌కు ముడి వేశాడు అంటూ చెప్తుంటే.. జ్యోత్స్న దండంరా నాకు నీ లాంటి వాడు వద్దు నేను ఆఫీసుకు వెళ్లిపోతాను అంటూ వెళ్లబోతుంటే.. ఆగు ఆగు స్కూటీ ఎక్కు వెళ్దాం అంటూ చెప్పగానే.. జ్యోత్స్న ఆఫీసుకు వెళ్లరా..? నీ గురించి మా తాతకు చెప్తాను అనగానే.. ఇవాళ ఆయన ఆఫీసుకు రాడు కదా ఆయన కార్తీక్‌ గారితో కలిసి ఏదో మీటింగ్‌కు వెళ్లారు అని చెప్తాడు. జ్యోత్స్న తిడుతుంటే.. సూరజ్‌ స్కూటీ స్టార్ట్‌ చేసుకుని వెళ్లిపోతాడు.

మీటింగ్‌లో అందరూ కూర్చుని ఉంటారు. అక్కడే దక్షిణమూర్తి, మాలిని ఉంటారు. రెస్టారెంట్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ వాళ్లను ఈ మీటింగ్‌ ఎందుకు పెట్టారని శివనారాయణ అడగ్గానే.. అసోసియేషన్‌ వాళ్లు మాలిని, దక్షిణమూర్తిని పరిచయం చేస్తారు. శివనారాయణ కోపంగా చూస్తుంటాడు. కార్తీక్‌ ఆలోచిస్తుంటాడు. మీటింగ్‌ త్వరగా కంప్లీట్‌ చేస్తే నేను వెళ్లిపోతాను చాలా పనులు ఉన్నాయని చెప్తాడు. దీంతో దక్షింణమూర్తి తొందరలోనే ముగిస్తాం లేండీ అంటాడు. ఆ మాటలకు కార్తీక్‌, శివనారాయణ షాక్‌ అవుతారు.  ఉత్తమ రెస్టారెంట్‌ పోటీలో శివనారాయణ గారితో తాము పోటీ పడతామని అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయమని దక్షిణమూర్తి చెప్తాడు. ఈ పోటీకి మీరు సిద్దమేనా అని మాలిని అడిగితే.. అందుకు శివనారాయణ మేము సిద్దంగా లేమని.. ఏ రెస్టారెంట్‌ లో ఫుడ్‌ ఎలా ఉంటుందో జనాలకు తెలుసు.. నేను చెప్పాల్సింది పూర్తి అయింది ఇక వెళ్లిపోతున్నా అంటూ కార్తీక్‌ తీసుకుని వెళ్లిపోతాడు శివనారాయణ. చాలా తెలివిగా తప్పించుకున్నాడని దక్షిణమూర్తి అనగానే.. బాబాయ్‌ని పోటీలోకి ఎలా దింపాలో నాకు తెలుసు మామయ్యగారు అని మనసులో అనుకుంటుంది మాలిని.

Advertisement

ఇంటికి వెళ్లిని శివనారాయణ మీటింగ్‌లో జరిగిన విషయాలు చెప్పగానే.. జ్యోత్స్న కోపంగా మనం ఎవ్వరితోనూ పోటీ పడాల్సిన అవసరం లేదు తాత. మనమేంటో ఇప్పటికే జనానికి తెలుసు అంటుంది. ఇంతలో సూరజ్‌ ఏదో చెప్పబోతుంటే.. జ్యోత్స్న అడ్డుపడుతుంది. దీంతో దీప తను ఏదో చెప్పబోతుంటే.. ఎందుకు అడ్డుపడుతున్నావు అంటుంది. పారిజాతం కల్పించుకుని ఇది మా ఫ్యామిలీ మ్యాటర్‌ ముందు సూరజ్‌ను బయటకు వెళ్లమను అని చెప్పగానే.. శివనారాయణ కోపంగా పారిజాతాన్ని తిట్టి.. సూరజ్‌ నువ్వు ఏం చెప్పాలనుకున్నావో చెప్పు అనగానే.. సూరజ్‌ చెప్తూ.. ఈ పోటీలో మీరు లేకపోతే ఓడిపోతారేమోనని భయంతోనే ఇలా చేశారేమో అందరూ అనుకుంటారు అనగానే.. శివనారాయణ కోపంగా సూరజ్‌ను తిట్టగానే.. కాస్త కూల్‌గా ఆలోచించండి అంటూ దీప, కార్తీక్‌ చెప్తారు. జ్యోత్స్న, పారిజాతం మాత్రం సూరజ్‌, దీప, కార్తీక్‌లను తిడతారు. పోటీ పేరుతో మీ తాతను దక్షిణమూర్తిని కొట్టుకోమంటారా… అంటూ పారిజాతం అడగ్గానే. అందరి మధ్య మాటల యుద్దం జరుగుతుంది.

అప్పుడే శివనారాయణకు దక్షిణమూర్తి ఫోన్‌ చేస్తుంటాడు. జ్యోత్స్న కాల్‌ కట్‌ చేయమని చెప్తుంది. శివనారాయణ మాత్రం కాల్‌ లిఫ్ట్‌ చేయమంటాడు. కార్తీక్‌ కాల్‌ లిఫ్ట్ చేసి స్పీకర్‌ ఆన్‌ చేస్తాడు. దక్షిణమూర్తి మమ్మల్ని చూసి భయపడ్డావు కదా..? మాతో పోటీ పడితే ఓడిపోతానని భయపడ్డావు కదా..? అంటూ దక్షిణమూర్తి అనగానే.. శివనారాయణ కోపంతో రగిలిపోతుంటాడు. నీ మీద పోటీ చేసి గెలిచే దమ్ము నాకుంది.. నన్ను ఓడించే దమ్ము నీకుందా..? ఉంటే రా మనిద్దరిలో ఎవరు గొప్పో పోటీలో తేల్చుకుందాం.. అంటూ చెప్తుంటే.. సుమిత్ర కోపంగా మరోసారి మా మామయ్యతో ఇలా మాట్లాడితే బాగోదు.. పెట్టేయ్‌ ఫోన్‌ అంటూ కాల్ కట్‌ చేస్తుంది. పారిజాతం కోపంగా దక్షిణమూర్తి మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు.. అనగానే.. రెచ్చగొట్టని మామయ్యగారు నా మెట్టినింటి పవర్‌ వాళ్లకు తెలియాలి అంటే పోటీలో వాళ్లను చిత్తుచిత్తుగా ఓడించాలి అంటుంది సుమిత్ర ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు కోసం కన్నీళ్లు.. భద్రకు తల్లి వార్నింగ్.. వల్లికి, భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

Illu Illaalu Pillalu : రామరాజు అరెస్ట్.. స్టోరీలో ఊహించని ట్విస్ట్.. శ్రీవల్లి అవుట్..

Brahmamudi Serial Today Episode October 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సొంత ఆఫీసుకు వెళ్తూ రేఖకు షాక్‌ ఇచ్చిన ఐశ్వర్య

Thursday TV Movies : గురువారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 15th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: వైజయంతికి మనోహరి గురించి సరస్వతి నిజం చెప్తుందా..?  

బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×