E-Paper
Advertisement

రైలు బోగీలో పూజలు.. అసలు రైల్వేలో ఏమి జరుగుతోంది?

రైలు బోగీలో పూజలు.. అసలు రైల్వేలో ఏమి జరుగుతోంది?
Advertisement

Viral Video of Puja Inside Train: గత కొద్ది రోజులుగా కదులుతున్న రైళ్లలో జరుగుతున్న వ్యవహారాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రీసెంట్ రైల్లో ఏకంగా శోభనం సెటప్ వైరల్ కాగా, తాజాగా రైల్వేకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రన్నింగ్ ట్రైన్ లో పూజలు నిర్వహించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీంతో రైళ్లలో ఇలాంటి మతపరమైన కార్యక్రమాలకు అనుమతి ఉంటుందా? అనే ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి.

ఇంతకీ వైరల్ వీడియోలో ఏముందంటే?

వైరల్ అవుతున్న వీడియోలో ఓ పూజారి రైలు బోగీలో కింద కూర్చొని పూజలు నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన చుట్టూ తెల్లటి వస్త్రాలు ధరించిన పలువురు పాల్గొనగా, వారు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లు కనిపిస్తోంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.  కొంతమంది ఇది సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే చర్య అని విమర్శిస్తే, మరికొందరు ప్రత్యేకంగా బుక్ చేసుకున్న కోచ్‌లో వ్యక్తిగత కార్యక్రమాలు నిర్వహించడంలో తప్పేముందని ప్రశ్నించారు. దీంతో ఈ వీడియోపై వివాదం చెలరేగింది.

Advertisement

క్లారిటీ ఇచ్చిన రైల్వే!

ఈ అంశంపై ఉత్తర రైల్వే క్లారిటీ ఇచ్చింది. వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్నది సాధారణ ప్రయాణికుల బోగీ కాదని, ప్రత్యేకంగా బుక్ చేసుకున్న  సెలూన్ కార్ అని స్పష్టం చేసింది. ఈ సెలూన్ కార్‌ ను ఐఆర్‌సీటీసీ ద్వారా నిబంధనల ప్రకారం ప్రైవేట్‌ గా బుక్ చేసుకున్నారని తెలిపింది. అలాగే, ఆ సమయంలో ఆ బోగీలో సాధారణ ప్రయాణికులు ఎవరూ లేరని, పూర్తిగా బుక్ చేసిన వ్యక్తులే ప్రయాణిస్తున్నారని ఉత్తర రైల్వే వివరించింది. అందువల్ల ఇతర ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని పేర్కొంది.

Advertisement

ఇటీవల రైళ్లలో వ్యక్తిగత కార్యక్రమాలు నిర్వహించడం తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే ఓ ఏసీ కుపేను పూలతో అందంగా అలంకరించి కొత్త దంపతుల శోభనం నిర్వహించిన ఘటన కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు అదే తరహాలో పూజలు నిర్వహించిన వీడియో బయటకు రావడంతో రైల్వే నిబంధనలపై మళ్లీ చర్చ మొదలైంది. అయితే రైల్వే ఇచ్చిన వివరణతో ఈ వీడియోపై నెలకొన్న సందేహాలకు కొంతవరకు తెరపడింది. ప్రత్యేకంగా బుక్ చేసుకున్న సెలూన్ కార్లలో వ్యక్తిగత కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని, అయితే అవి రైల్వే నిబంధనలకు లోబడి ఉండాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సాధారణ ప్రయాణికుల కోసం కేటాయించిన కోచ్‌లలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి ఉండదని కూడా వారు గుర్తు చేస్తున్నారు. ఈ ఘటనతో రైల్వేలో ప్రైవేట్‌గా బుక్ చేసుకునే ప్రత్యేక కోచ్‌ల వినియోగంపై మరోసారి ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది.

Read Also: రైలు బోగిలో ఫస్ట్ నైట్ పై స్పందించిన రైల్వే.. వాళ్లకు దబిడి దిబిడే!

Related News

హిమాలయాల్లో రైల్వే అద్భుతం.. 2029 నాటికి మంచు కొండలను చీల్చుకుంటూ రైలు ప్రయాణం!

ఇండియన్ రైల్వేలో రారాజు.. ఈ ట్రైన్ వస్తే మిగతావన్నీ పక్కకు వెళ్లాల్సిందే!

అందాల రాణి క్లియోపాత్రా ఎలా చనిపోయింది? ఇప్పటికీ మిస్టరీనే!

అప్పటి ప్రజలతో.. రాముడు, కృష్ణుడు ఏ భాషలో మాట్లాడేవారు? బయటపడ్డ అసలు నిజం!

500 ఏళ్ల నాటి సమాధి తెరవగానే వరుస మరణాలు.. రాజు శాపమే ప్రాణాలు తీసిందా?

బ్రిటిష్ ఇంజనీరింగ్ అద్భుతాలు.. దేశానికే గర్వకారణమైన 7 వింటేజ్ రైల్వే స్టేషన్లు!

ప్రపంచంలోనే అత్యంత అందమైన స్మశానవాటిక, ఇక్కడ సమాధులు కూడా కళాఖండాలే!

మాజీ ప్రేమికులు కలిసే స్పెషల్ మార్కెట్.. భార్యలే ‘వెళ్లి రా’ అంటారట!

Big Stories

Advertisement
×