E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. సత్యం, ప్రభావతిని కలిపిన సుశీల.. మనోజ్ కు షాక్..

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. సత్యం, ప్రభావతిని కలిపిన సుశీల.. మనోజ్ కు షాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. సుశీల ఇంట్లోకి రాగానే ప్రభావతి పై చిందులు వేస్తుంది.. నువ్వు ఇలా వాడిని వెనకేసుకుని రావడం వల్లే వాడు ఇలా తయారయ్యాడు అని అంటుంది. వాడు బిజినెస్ లో లాస్ రావడం వల్ల నేను ఇలా చేశాను అని అంటుంది ప్రభావతి.. సత్యం ని కలవడానికి వెళ్ళిన సుశీలను చూసి సత్యం సంతోషపడతాడు. ఏంట్రా నేను విన్నది నిజమేనా నువ్వు మాకు ఎందుకు అబద్ధం చెప్పాలని అనుకున్నావు.. నిజం చెప్పలేదు ఏంటి నాకు చెప్పకూడదని అనుకున్నావా అని సుశీల అడుగుతుంది. కానీ సత్యం మాత్రం నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదమ్మా అని అంటాడు. ప్రభావతి గురించి మొదటి నుంచి తెలుసు కదా పెద్ద కొడుకు అంటే దానికి ఎంత ప్రాణము వాడు ఏం చేసినా కూడా సపోర్ట్ చేస్తూ వస్తుంది అని అంటుంది..
తన గురించి తెలుసమ్మా ఎప్పుడు తను ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మాత్రం బంగారం తీసుకెళ్లి వాడికి ఇచ్చింది నేను బంగారం ఇచ్చినందుకు బాధపడడం లేదు.. వాళ్ళిద్దరూ కలిసి దాన్ని మళ్ళీ నగలుగా మార్చి మీనా వాళ్ళ అమ్మ మీద నిందలు వేశారు.. దారుణంగా అన్నారు. ఇంత జరిగిన సరే మీనాని అంటూనే ఉంది. అందుకే మీనా కి క్షమాపణ చెప్పాలి అని నేను అన్నాను.. ఎప్పుడైతే అది క్షమాపణ చెప్తుందో అప్పుడే నేను దాంతో మాట్లాడుతాను అని సత్యం అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మీనా మొఖం మీద గాజులు విసిరి కొట్టిందమ్మ అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అందుకే మీ నాకు క్షమాపణ చెప్పాలని అంటున్నాను అని సత్యం సుశీలతో అంటాడు.. ఇంత చేసిందా..? అయినా అది ఇంకా మారదు అని తెలుసు కదరా నువ్వు ఎందుకు ఇంకా బాధపడుతున్నావు వదిలేయచ్చు కదా అని సుశీల సత్యంని ఒప్పించి కిందకు తీసుకొని వస్తుంది. అమ్మ నీ మీద మీనా వాళ్ళ అమ్మ మీద నిందలు వేసింది కాబట్టి క్షమాపణ చెప్పాలి అని సత్యం అంటాడు. మీరు నాకు అత్తయ్య గారు కాబట్టి మిమ్మల్ని నేను క్షమించమని అడుగుతాను.. కానీ దాన్ని నేను అడగను అని ప్రభా అంటుంది. ఆ వినగానే సత్యం మళ్ళీ కోపంగా ఉంటాడు..

Advertisement

నీ కోడలు కొడుకులు ముందర నా కోడల్ని తక్కువ చేసి మాట్లాడొద్దు రా అని సుశీల అంటుంది. అయినా నేను క్షమించమని అడగకపోయినా మీనా క్షమిస్తుంది. మీరు గొడవ పడకండి అని అంటుంది సుశీల. నేనేం చేసినా అది మనోజ్ కోసమే చేశాను వాడు మోసపోయాడని వాడికే సహాయం చేశాను. అంతే తప్ప నేను వాటిని తీసుకెళ్లి ఇంకేమీ చేయలేదు అని ప్రభావతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. పెద్ద కొడుకు మీద ప్రేమతోనే ఇదంతా చేసింది అంతేకానీ ఇంకేమీ లేదు లేరా అని సుశీల అంటుంది. అంత కాదు వీళ్ళిద్దరూ ఇక్కడుంటే మాట్లాడుకోలేకపోతున్నారు ఒక గదిలోకి పంపిదం వాళ్లే మాట్లాడుకుంటారు అని బాలు అంటాడు.

బాలు సుశీల ఇద్దరూ కలిసి వాళ్ళిద్దర్నీ బలవంతంగా గదిలోకి పంపిస్తారు. కానీ వాళ్ళిద్దరూ ఎంతసేపైనా బయటికి రాకపోవడంతో బాలు సుశీల ఇద్దరు కలిసి సత్యం గది తలుపు తెరవనా అని అడుగుతారు. తలుపు తెరిచిన వాళ్ళిద్దరూ లోపల జరిగింది చూసి షాక్ అవుతారు. తూర్పు పడమర అని చిరాకు వైపు ఉంటే ఎలా కలుస్తారు పదండి కిందికి అని సుశీల అంటుంది. మొత్తానికి సుశీల మాట విని ప్రభావతి సత్యం కలిసిపోతారు. నువ్వు నా కొడుకు కష్టార్జితం 40 లక్షలు దొబ్బేసావు. అలాగే ఇప్పుడు నాలుగు లక్షలు దొబ్బెసావు ఇవన్నీ కలిపి ఇస్తేనే నాన్న మనశ్శాంతిగా ఉంటాడు అని బాలు ఫిట్టింగ్ పెట్టేస్తాడు.

Advertisement

ఇక బాలు చెప్పినట్లు సుశీల 40 లక్షలు తిరిగి ఇవ్వాలని అంటుంది. ఇప్పుడు అంత డబ్బులంటే కష్టం కదా అత్తయ్య అని ప్రభావతి అంటుంది. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందని బాలు అంటాడు. ప్రతి నెల 50 వేలు ఇవ్వాలని అంటాడు. బాలు చెప్పింది నిజమే.. ఇవ్వాలి అని సుశీల కూడా అనడంతో మనోజ్ షాక్ అవుతాడు. రోహిణి మొహం చూస్తాడు. నువ్వు 40 లక్షలు ఎత్తుకెళ్లినప్పుడు పార్లరమ్మ పర్మిషన్ తీసుకున్నావా..? మన నాలుగు లక్షలు దొబ్బేసినప్పుడు భార్యకు చెప్పే వెళ్ళావా అని బాలు అంటాడు. నాకే సంబంధం లేదు నువ్వు చేసే ప్రతి తప్పుని నా మీద వేసుకోలేను అని రోహిణి అంటుంది.

Also Read : ఈ వారం పడిపోయిన టీఆర్పీ రేటింగ్.. ఆ రెండింటి పరిస్థితి దారుణం..?

నువ్వు వాడికి డబ్బులు ఇవ్వాలని చెప్పు అని సుశీల అంటుంది. నువ్వు కచ్చితంగా డబ్బులు ఇవ్వాలి రా ఒప్పుకో అనేసి ప్రభావతి అంటుంది. బాలు ఏమి చేయలేక ఒప్పేసుకుంటాడు.. గదిలోకి వెళ్లిన రోహిణి మనోజ్ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటారు.. అయితే ప్రభావతి కూడా మనోజ్ కి డబ్బులు ఇవ్వాలని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Related News

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Big Stories

Advertisement
×