Gundeninda GudiGantalu Today episode December 24th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం లేవగానే ప్రభావతి హడావిడి చేస్తుంది. పెళ్లి వాళ్ళు వస్తున్నారు మీరు ఇలా పేపర్ చదువుతూ కూల్ గా కూర్చుంటారా నాకైతే కాళ్లు చేతులు ఆడటం లేదు అనేసి అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన బాలు ఎక్కువగా టెన్షన్ పడకు బీపీ వస్తే కాళ్లు చేతులు ఆడడమే మానేస్తాయని అంటాడు. ఇక అప్పుడే కామాక్షి రంగా అక్కడికి వస్తారు. కామాక్షి సెటైర్లు వేస్తుంది. ఇక మౌనికను అందరు రెడీ చేస్తారు.. నీల కంఠం ఫ్యామిలీ ఇంట్లోకి వస్తారు. అందరు సరదాగా మాట్లాడుకుంటారు. ఇక సత్యం మా గురించి మీరు తెలుసుకోవాలని అంటారు. మేము మేమేదో సాధ జీవితాన్ని గడిపే వాళ్ళం అనేసి సత్యమంటాడు మా గురించి మీకు ముందుగా చెప్పాలి మీరు తెలుసుకోవడం కూడా బాధ్యత అనేసి సత్యం అంటాడు. ఇక మౌనికను బుట్టలో వేసుకొనే ప్రయత్నం చేస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. తాను రెండు తప్పులు చేశానంటూ చెప్పుకొస్తాడు అందులో ఒకటి గతంలో ఒక అమ్మాయితో నిశ్చితార్థం జరిగిందని, కానీ అమ్మాయి తనని మోసం చేసి వెళ్లిపోయిందని, ఆ సమయంలో నువ్వు కనిపించావని చూసిన మరుక్షణంలోనే నిన్ను ప్రేమించాను అని చెబుతాడు. మరొకటి బార్ లో మీ అన్నయ్య బాలుకి తనకి గొడవ జరిగిందని, ఆ గొడవ తర్వాత మీ అన్నయ్యకు స్వారీ చెప్పాలని ప్రయత్నించాలని కథలు చెప్తాడు. దీంతో మౌనిక సంజయ్ బుట్టలో పడిపోతుంది. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుంటే అందరు టెన్షన్ పడతారు. ఇక మౌనిక, సంజయ్ కిందకు వస్తారు. అబ్బాయి నచ్చాడా? అని మౌనికను తన తల్లిదండ్రులు అడగగా.. తనకు నచ్చాడని సమాధానం ఇస్తుంది. దీంతో వెంటనే తాంబూలాలు మార్చేసుకుని ముహూర్తం పెట్టేద్దామని నీలకంఠం అంటాడు. బాలు వచ్చేంత వరకు వెయిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాడు సత్యం. కానీ, ప్రభావతి అవసరం లేదని, నిక్కచ్చిగా చెబుతుంది. మరోవైపు పంతులు కూడా వర్జ్యం వస్తుంది. వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాం అంటారు. ఇక సత్యం మాత్రం బాలు రాలేదని ఎదురుచూస్తుంటారు. సరిగ్గా తాంబులాలు మార్చుకొనే సమయంలో బాలు ఇంటికి వస్తాడు. రంగా నీలకంఠాన్ని పరిచయం చేస్తాడు. ఆ తర్వాత సంజీవ్ ని పరిచయం చేయగానే.. వీడా.. మా అమ్మ తెచ్చిన సంబంధం అనగానే.. నాకు అనుమానం వచ్చింది. ఈ దరిద్రపు సంబంధం తనకు ఇష్టం లేదంటూ బాలు తెగేసి చెబుతాడు. నా చెల్లెను నీకు ఇవ్వనని తేల్చి చెప్తాడు.
ఇక అంతేకాదు ఇంట్లో నుంచి వెంటనే వెళ్లి పొమ్మని వార్నింగ్ ఇస్తాడు బాలు. దీంతో ఇంటిల్లిపాది షాక్ అవుతారు. తాంబూలాలు మార్చుకునే సమయంలో వచ్చి అనవసరంగా గొడవ చేయకండి ప్రభావతి ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.. బాలు వార్నింగ్ ఇస్తాడు. అనవసరంగా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దంటూ రంగా కూడా అంటాడు. మరోవైపు ప్రభావతి ఎక్కడ సంబంధం క్యాన్సల్ అవుతుందోనని, నీ లాగా డ్రైవర్ కి ఇచ్చి పెళ్లి చేయాలంటూ బాలుని ఎగతాళి చేస్తుంది. డ్రైవర్ అయినా మంచి మనసుంటే చాలు వీడు ఎలాంటి వాడో తనకు తెలుసుననీ, వాడి సైకో వేషాలు తనకు తెలుసు అంటాడు. నీకు ఎలా తెలుసు అని మనోజ్ అడుగుతాడు. నువ్వు ఏమి తాగి గొడవ చెయ్యకుండా ఉన్నావా అని అంటాడు. ఇక నీలకంఠం బాబు ఆ గొడవ గురించి తెలుసు అది జరిగాక ఇక ఎప్పుడు తాగొద్దని మాట ఇచ్చాడు. అని అంటాడు. కానీ బాలు మాత్రం నమ్మడు. తన కొడుకు ఇష్టపడ్డ సంబంధం అని, మా స్థాయిని తగ్గించుకుని, మీ ఇంటికి వచ్చాం. ఇలాంటి అవమానం జరుగుతుందని ఊహించలేదంటూ నీలకంఠం తన ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోతాడు..
ఇక ప్రభావతి వాళ్ళు వెళ్ళగానే పెద్ద రచ్చ చేస్తుంది. ఆశలన్నీ అడియాశలవుతాయి. కోపంతో బాలుని కొడుతుంది. వీడు ఉండగా నా కూతురు పెళ్లి జరగదని ప్రభావతి అరుస్తు.. తన రూం లోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత బాలు తన రూమ్ లోకి వెళ్లి బాధపడతాడు. తన తల్లి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ బాధపడతాడు. ఇంతలోనే మీనా వచ్చి అనవసరంగా ఎక్కువగా ఆలోచించకండి అంటూ చెబుతుంది. వాడు ఇలాంటి వాడు తనకు తెలుసునని, ఆ విషయం ఇంట్లో వాళ్లకి అర్థం కావడం లేదంటూ చెబుతాడు. ఇంతలోనే మౌనిక కూడా బాలు రూమ్ లోకి వస్తుంది.. ఇక సత్యం కూడా లోపలికి వస్తాడు నువ్వు కూడా తాగావు కదా రవిని పోలీస్ స్టేషన్లో కొట్టావు కదా మరి ఎవరైనా ఒక అన్న తమ్ముని కొట్టారని అప్పుడు అనుకున్నారా ఏదో శత్రుత్వంతో కొట్టామని అనుకున్నారు ఇది అలానే అనుకోవచ్చు కదా తాగితే చిన్న మెదడు పనిచేయదు ఏం చేస్తున్నామో అది మర్చిపోతాము అని అనగానే చెప్పండి నాన్న నాకు మనసు ఒప్పుకోవట్లేదు అనేసి బాలు వెళ్లిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో నీలకంఠం గురించి బాలు అసలు నిజాలు తెలుసుకుంటాడు.