Allu Arjun.. పుష్ప 2 (Pushpa 2). ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు రికార్డులు క్రియేట్ చేస్తుంటే.. మరొకవైపు విమర్శలకు, కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో నేపథ్యంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన రోజురోజుకు హాట్ టాపిక్ గా మారుతోంది. హైదరాబాదులోని ఎక్స్ రోడ్డు దగ్గర ఉన్న సంధ్యా థియేటర్లో పుష్ప2 బెనిఫిట్ షో డిసెంబర్ 4న ప్రదర్శించగా.. ఆ సినిమా చూడడానికి అల్లు అర్జున్ (Allu Arjun)ఫ్యామిలీతో విచ్చేశారు. అయితే ఆయన ర్యాలీ నిర్వహించగా తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో రేవతి అనే మహిళ మరణించింది. ఆమె కుమారుడు శ్రీ తేజ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. తెలంగాణలో అటు కాంగ్రెస్ నేతలు, ఇటు బీజేపీ నేతలు ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని నెటిజన్స్ కూడా కామెంట్లు చేసుకుంటున్నారు.
రాయదుర్గంలో మరో యువకుడు మృతి..
ఈ క్రమంలోనే పుష్ప 2 వివాదం మాత్రం తెలుగు స్టేట్స్ లోనే కాకుండా దేశంలో కూడా కాక రేపుతోంది అని చెప్పాలి. సంధ్య థియేటర్ ఘటన తర్వాత రాయదుర్గంలో ఒక థియేటర్లో సినిమా చూస్తున్న యువకుడు అక్కడికక్కడే మరణించాడు. అయితే ఆయన మరణానికి గల కారణాలు ఇప్పటివరకు బయటకు రాలేదు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. ప్రస్తుతం ఈ యువకుడి మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.
మూడవ అంతస్తు నుండి దూకేసిన యువతి..
ఇప్పుడు మరొక యువతి ఏకంగా పుష్ప 2 సినిమా కోసం మూడంతస్తుల భవనం నుండి దూకేసి ప్రాణాలతో చెలగాటం ఆడింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో బనారస్ హిందూ యూనివర్సిటీ కాలేజీలో చదువుతున్న ఒక యువతి, తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వారణాసికి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ హోటల్లో రూమ్ కూడా తీసుకున్నారు. ఆ యువతి పుష్ప 2 సినిమాకి వెళ్దామని తన బాయ్ ఫ్రెండ్ కి చెప్పిందట. కానీ అతడు నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంలో హోటల్ లోని మూడో అంతస్తు నుంచి దూకేసిందట. వెంటనే గమనించిన హోటల్ సిబ్బంది హుటాహుటిన ఆమెను హాస్పిటల్ కి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా ప్రస్తుతం యువతి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు సమాచారం.
పుష్ప 2 సినిమా..
అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar) కాంబినేషన్లో వచ్చిన చిత్రం పుష్ప 2. తన నటనతో భారీ ఇమేజ్ సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ఈ సినిమాతో ఇప్పటి వరకూ ఏకంగా రూ.1600 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇందులో రష్మిక మందన్న(Rashmika Mandanna)హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా నాలుగింతల లాభం కొట్టేలా కనిపిస్తోందని మేకర్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏదిఏమైనా అల్లు అర్జున్ ఈ సినిమాతో రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతున్నారు. కానీ జరుగుతున్న సంఘటనల కారణంగా ఆయన మనశ్శాంతి కోల్పోయారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.