E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి షాక్.. లక్ష గెలుచుకున్న బాలు.. సత్యం, కామాక్షి ప్రశంసలు..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి షాక్.. లక్ష గెలుచుకున్న బాలు.. సత్యం, కామాక్షి ప్రశంసలు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 28th : నిన్నటి ఎపిసోడ్ లో.. భార్యని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో కళ్లలోకి చూస్తూ నిజాలు చెప్పాలి అని అనగానే ముందుగా మనోజ్ రోహిణి ఇద్దరు కూడా ఎమోషనల్ అయిపోతారు.. ఆ తర్వాత వచ్చిన శృతి రవి ఒకరినొకరు తిట్టుకొని వెళ్లిపోతారు. మీనా బాలు మాత్రం జడ్జిలను మెప్పిస్తారు. నిజమైన ప్రేమ ఉన్న జంటలు కళ్లతో ఎలా మాట్లాడుకుంటారో చూపించారు.. ఒకరి మనసులో మరొకరు ఏమనుకుంటున్నారో ఇద్దరూ ఒకేలా రాసి అక్కడ ఉన్న జడ్జిలను ఇంప్రెస్ చేశారు.  ఇప్పుడు రెండు కూడా మూడు రౌండ్స్ సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు.

ఏ టాస్క్ లోనైనా కూడా బాలు మీనా ఎంతో చక్కగా పాల్గొంటూ విన్నర్ అయ్యారు. ఈ జంట అన్యోన్యతను చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మురిసిపోతూ ఉంటారు. కచ్చితంగా ఈ జంట గెలవాలి అని కోరుకుంటారు కూడా.. ముఖ్యంగా బాలు తమకు ఒక గది లేదు అని చెప్పడంతో అందరూ బాధపడతారు. ఏది ఏమైనా కూడా అత్యాశకు పోయిన జంటలతో పోలిస్తే స్వచ్ఛమైన మనసుతో తమ మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమను తెలియజేసిన మీనా బాలు ఆ పోటీల్లో విన్నర్ గా నిలుస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. బాలు మీనా లక్ష రూపాయలు చెక్కుతో పాటుగా మరికొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్ లను కూడా సొంతం చేసుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యతను చూసి అక్కడకు వచ్చిన జంటలు వాళ్లతో కలిసి సెల్ఫీలు దిగుతారు. మొత్తానికి భార్యాభర్తల పోటీ ఎపిసోడ్కి ముగింపు పలికేశారు. అక్కడ ఇచ్చిన లక్ష రూపాయలు చెక్కుతో బాలు మీనా సంబరాలు చేసుకుంటూ ఇంటికి బయలుదేరుతారు. మీరు గెలుస్తారని మేము అనుకున్నాం కచ్చితంగా మీరే గెలిచారు మాకు చాలా సంతోషంగా ఉంది అని శృతి అంటుంది. ఇక రవి కూడా మీరిద్దరూ ఎప్పుడూ కొట్టుకుంటూ కనిపించే వాళ్ళు కానీ ఇప్పుడు మీ మధ్య ఉన్న బంధాన్ని అందరికీ తెలియజేశారు గ్రేట్ అని పశంసలు కురిపిస్తారు.

అధర్ కదా కచ్చితంగా ఈ పోటీలో మనోజ్ రోహిణిని గెలిచి ఉంటారు అని ప్రభావతి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది. బాగా చదువుకున్న వాళ్ళు డబ్బున్న తెలివైన రోహిణి ఈ పోటీలో మనోజ్ కి సాయంగా ఉండి గెలుస్తుంది చూడండి అని అంటుంది. ఇక లక్ష్యం మనకే వచ్చింది అని తెలుసుకున్న ప్రభావతి కచ్చితంగా మనోజ్ రోహిణి లక్ష రూపాయలు కొట్టేసి ఉంటారు. వాళ్ళకి దిష్టి తీసేయాలని హారతి పళ్లెం పట్టుకొని వస్తుంది..

Advertisement

హారతి పళ్లెం పట్టుకొని బయటికి వస్తుంటే కామాక్షి మనోజ్ రోహిణి కి అంత సీన్ లేదు కచ్చితంగా బాలు మీనానే గెలిచి ఉంటారు అని అంటుంది. నువ్వు ఊరుకో కామాక్షి ఎప్పుడు చూసినా నువ్వు కూడా ఈయన గారు లాగే బాలు భజన చేస్తుంటావు కచ్చితంగా మనోజ్ నా పరువు నిలబెట్టాడు అని సంతోషంతో బయటికి వస్తుంది. అక్కడ మనోజ్ రోహిణి రావడంతో ఎక్కడా లక్ష రూపాయలు మనకే వచ్చిందా మీరు ఎక్కడ పెట్టారు అని అడుగుతుంది. మీకు దిష్టి తగలకుండా నేను హారతి కూడా తీసుకొచ్చాను అని అనగానే వాళ్ళు లక్ష రూపాయలు. గెలిచిన మేము కాదు అని అంటారు.

Also Read : నర్మదకు ప్రేమ దూరం.. రామరాజు మాటతో ప్రేమ కన్నీళ్లు.. నిజం చెప్పేసిన వేదవతి..

బాలు మీనా ఆ లక్ష రూపాయలు గెలిచారని చెప్పగానే ప్రభావతి దిమ్మతిరిగిపోయే షాక్ అవుతుంది. అప్పుడే బాలు మేళ తాళాల మధ్య తనకు వచ్చిన లక్ష రూపాయలు చెక్కులు తీసుకొని లోపలికి వస్తాడు. రవి శృతి వాళ్ళ వెనకాలే వచ్చి వాళ్లతో కలిసి బయట డాన్స్ చేస్తారు. అది చూసిన ప్రభావతి ఏంటి ఈ లక్ష రూపాయలు కూడా నీకు రాలేదా? ఆ బాలు గాడిని చూసి తెలివి తెచ్చుకో ఇప్పటికైనా అని ప్రభావతి అంటుంది.. వాడికి ఎటువంటి డిగ్రీలు లేవు. నేను చదివాను. అని మనోజ్ సెటైర్లు వేస్తాడు. పార్వతి, సుమతి మీనా, బాలు లక్ష గెలుచుకున్నందుకు సంతోషంగా ఉంటుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

Big Stories

Advertisement
×