E-Paper
Advertisement

Year Ender 2025 : కటౌట్ కాదు కంటెంట్ ముఖ్యం బిగిలూ… ఈ ఏడాది ఓటీటీలో దుమ్మురేపిన తమిళ సినిమాలు

Year Ender 2025 : కటౌట్ కాదు కంటెంట్ ముఖ్యం బిగిలూ… ఈ ఏడాది ఓటీటీలో దుమ్మురేపిన తమిళ సినిమాలు
Advertisement

Year Ender 2025 : 2025 తమిళ సినిమాలకు మరపురాని ఏడాది అని చెప్పొచ్చు. బిగ్ స్టార్ మూవీస్ ఎక్కువగా మిక్స్‌డ్ రెస్పాన్స్ ఇచ్చాయి. కానీ చిన్న బడ్జెట్ సినిమాలు మాత్రం కథల పవర్‌తో కట్టిపడేశాయి. మిడిల్ క్లాస్ జీవితం, ఫ్యామిలీ బంధాలు, సమాజ సమస్యలను చర్చించిన సినిమాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. మధరాసి ఒక్కటే బిగ్ స్టార్ ఫిల్మ్‌గా బాక్సాఫీస్ హిట్ అయింది. 2025లో బెస్ట్ 10 తమిళ సినిమాలను ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాం పదండి.

1. Angammal

విపిన్ రాధాకృష్ణన్ డైరెక్ట్ చేసిన ఈ ఇండీ డ్రామా గీతా కైలాసం నటనతో ఆకట్టుకుంది. ఇది ఒక మహిళ సమాజానికి లొంగకుండా తన సొంత మార్గంలో నడిచే కథ. ఈ సినిమాలో హార్ట్‌ను టచ్ చేసే సీన్లు చాలానే ఉన్నాయి. ఓటీటీలో ఇంకా స్ట్రీమింగ్ రిలీజ్ లేదు. జనవరిలో వచ్చే అవకాశం ఉంది.

2. Dragon

Advertisement

అశ్వత్ మారిముతు డైరెక్ట్ చేసిన కమింగ్ ఆఫ్ ఏజ్ ఎంటర్‌టైనర్. ప్రదీప్ రంగనాథన్ హీరోగా మరో సారి హ్యట్రిక్ కొట్టాడు. ఇది సక్సెస్ కోసం షార్ట్‌కట్స్ తీసుకునే ఒక అబ్బాయి కథ. హ్యూమర్, మసాలా, మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ బాగా మిక్స్ అయ్యాయి. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం Netflixలో అందుబాటులో ఉంది.

3. Madras Matinee

డెబ్యూ డైరెక్టర్ కార్తికేయన్ మణి ఫిల్మ్. చెన్నై మిడిల్ క్లాస్ లైఫ్‌ను రియలిస్టిక్‌గా చూపిస్తుంది. కాళీ వెంకట్, షెల్లీ కిషోర్, రోషిని హరిప్రియన్ నటనకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది.

4. Bison

Advertisement

మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన సోషల్ స్పోర్ట్స్ డ్రామా. కబడ్డీ చాంపియన్ మనాథి గణేశన్ లైఫ్ ఇన్‌స్పైర్డ్ గా రూపొందిన ఈ సినిమాలో ధ్రువ్ విక్రమ్ హీరోగా నటించారు. కుల వివక్ష, పొలిటికల్ ఇష్యూస్ తో స్టోరీ పీక్స్ లో ఉంటుంది. Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.

5. Paranthu Po

రామ్ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాను చూస్తే, హ్యాపీనెస్ అంటే ఏమిటో రియలైజ్ అవుతారు. ఇది ఒక తండ్రి, ఆరేళ్ల కొడుకు రోడ్ ట్రిప్ కథ. హ్యూమర్, ఎమోషన్ మిక్స్ తో చిన్నప్పటి ఫీల్ వచ్చేస్తుంది. JioHotstarలో స్ట్రీమింగ్.

6. Naangal

అవినాష్ ప్రకాష్ డెబ్యూ ఫిల్మ్. ఇది ముగ్గురు అన్నదమ్ముల చైల్డ్‌హుడ్ బాధల కథ. స్ట్రిక్ట్ స్కూల్ ప్రిన్సిపల్ అయిన తండ్రి వల్ల వీళ్ళు ఇబ్బందులు పడతారు. చాలా పర్సనల్, ఎమోషనల్ స్టోరీ. ఇంకా ఓటీటీ స్ట్రీమింగ్ రిలీజ్ కాలేదు. జనవరిలో వచ్చే అవకాశం ఉంది.

7. Tourist Family

శశికుమార్, సిమ్రన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అభిషన్ జీవింత్ డైరెక్షన్ లో తెరకెక్కింది. ఈ శ్రీలంక తమిళ ఫ్యామిలీ ఇండియాలో రెఫ్యూజీ అవుతుంది. ఇన్నోసెన్స్, కైండ్‌నెస్‌తో మనసును హత్తుకునే స్టోరీ ఇది. JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది.

8. Madharaasi

శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన యాక్షన్ ఎంటర్‌టైనర్. అద్భుతమైన యాక్షన్ సీన్స్ తో ఆడియన్స్‌ను థ్రిల్ చేసింది. Amazon Prime Videoలో స్ట్రీమింగ్.

9. Kudumbasthan

మణికందన్ హీరోగా నటించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రిస్పాన్సిబిలిటీస్ చుట్టూ తిరిగే ఒక ఎమోషనల్ స్టోరీ.
చిన్న సినిమాగా వచ్చి, భారీ హిట్ కొట్టింది. ప్రస్తుతం ZEE5లో అందుబాటులో ఉంది.

10. Bad Girl

వర్షా భరత్ తెరకెక్కించిన ఈ మూవీ వివాదాలతో ఆలస్యంగా థియేటర్లలో రిలీజ్ అయింది. న్యూ జెనరేషన్ ఫిల్మ్ మేకింగ్ తో అందరినీ ఆశ్చర్యపరచింది. JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : జనవరిలో ఓటీటీలోకి మోస్ట్ అవైటింగ్ కన్నడ సినిమాలు… స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×