E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలుకు చింటును దూరం చేస్తున్న రోహిణి.. రాజేష్ కోసం మీనాతో ఫైట్.. ప్రభావతి చిచ్చు..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు చింటును దూరం చేస్తున్న రోహిణి.. రాజేష్ కోసం మీనాతో ఫైట్.. ప్రభావతి చిచ్చు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode February 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ కి వచ్చిన లెటర్ గురించి అర్ధరాత్రి కలకంటూ ఉంటాడు. ఈ విషయాన్ని ఎలాగైనా సరే అమ్మతో చెప్పాలి ఏదో ఒక సలహా ఇస్తుంది అని మనోజు అనుకుంటాడు. ప్రభావతికి మనోజ్ ఫోన్ చేసి అర్జెంటుగా పైకి రమ్మని అడుగుతాడు. ఏంటి నువ్వు అప్పుడే పైకి ఎందుకు వెళ్లావు అంటే ఏం మాట్లాడుతున్నావ్ అమ్మ పైనే చచ్చాను. ఇంకా చావలేదు రా అనేసి అంటాడు. ఎందుకురా ఈ టైంలో ఫోన్ చేసి రమ్మన్నావు. ఏం జరిగిందిరా ఏం చేసావ్ మళ్ళీ అని అడుగుతుంది ప్రభావతి.. నువ్వు ఏదైనా చేయడానికి చేసావా నన్ను మళ్ళీ ఇరికించేసావా అని ప్రభావతి టెన్షన్ పడిపోతూ అడుగుతుంది..

మనోజ్ మాత్రం ముందు నేను చెప్పేది వింటే నువ్వే షాక్ అవుతావు అని అంటాడు. ఈ ప్రపంచంలో ఎవరికీ లేనిది నీకెందుకు జరుగుతుంది రా వాడు ఎవడో నీకే వచ్చి లెటర్ అని ప్రభావతి కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే వచ్చినా రోహిణి ఖచ్చితంగా ఇది దినేష్ ఇచ్చి ఉంటాడా అని ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది. ఈ లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి ముందు వీళ్ళని డైవర్ట్ చేయాలి అని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. బాలు మీనా నిద్రపోతూ ఉంటే ఒక్కసారిగా బాలు ఉలిక్కిపడి లేస్తాడు. ఏమైంది ఎందుకు లేచావు అని నేను అడుగుతుంది. ఏం లేదు నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో మనిద్దరం కొట్టుకుంటున్నాము. అందుకే నేను భయపడి లేచేసాను అని బాలు అంటాడు.. అయితే ఆ కలలో కూడా నేను మాట్లాడేది లేదు కదా అని నేను అడుగుతుంది.. అదేంటి నేను నీకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదని ఫీల్ అవుతున్నావా ఏంటి అని ఇద్దరు కలిసి గొడవపడతారు.. చూశారా కళ నిజమే అయింది మనిద్దరం ఇప్పుడు గొడవ పడుతున్నామని మీనా అంటుంది. ఇకపోతే ఇద్దరి మధ్య కాస్త రొమాంటిక్ టచ్ మొదలవుతుంది.. రోహిణి విద్య ఇద్దరు కలిసి సుగుణమ్మ కోసం ఒక ఇంటిని వెతకాలని అనుకుంటారు. అక్కడ ఒక ఇల్లు చూసి అక్కడ ఓనర్ తేడాగా ఉన్నాడని విద్య అంటున్న సరే రోహిణి మాత్రం ఇల్లు చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అని అంటుంది.

నీకు ఇల్లు నచ్చింది ఒకని నాకు మాత్రం ఓనర్ అస్సలు నచ్చలేదు వీడి మొహం చూస్తుంటే నాకు ఏదో తేడా కనిపిస్తుంది అని విద్య అంటుంది.. ఇప్పుడు ఆ ఇల్లు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఒక లక్ష అడ్వాన్స్ కట్టాలి. ఏ ఒక్కటి నుంచి తెస్తావు ఎలా తెస్తావు మనోజ్ అయితే పిసినారోడు అస్సలు ఇవ్వడు అని విద్య అంటుంది.. ఎలాగైనా సరే ఇంటిని కచ్చితంగా తీసుకోవాలి ఆ బాలు పీడ విరగడవ్వాలి అని రోహిణి అనుకుంటుంది.. ఎలాగోలాగా నేను లక్ష రూపాయలు తెచ్చి వాడికి ఇచ్చి మా అమ్మని ఇక్కడికి షిఫ్ట్ చేయాలి అని రోహిణి ఫిక్స్ అయిపోతుంది..

Advertisement

తర్వాత రోజు బాలు ట్రిప్ కోసమని వెళ్లగా అందరూ ఖాళీగా ఉండటం చూసి ఏంట్రా మీరందరూ ఖాళీగా కూర్చున్నారు అని అంటారు. ట్రిప్పులు వస్తే ఖాళీగా ఎందుకు కూర్చుంటాం ఇవాళ ట్రిపుల్ ఏం లేవురా అందుకే ఖాళీగా ఉన్నామని అంటాడు.. రాజేష్ మాత్రం అక్కడ పడిపోయి కనిపించడంతో ఏమైందిరా వీడు నిద్రపోతున్నాడా ఏంటి అని బాలు అడుగుతాడు. తాగొస్తే పడుకోక ఇంకేం చేస్తారు అని బాలు అంటాడు.. తాగి రావడమేంట్రా ఏం మాట్లాడుతున్నావ్ రా అసలు పగలు తాగడం ఏంటి అయినా తాగితే ఇద్దరం కలిసే తాగుతాం కదా.. అని అనగానే ఏమో వాడ్ని లేపి అడుగు అని వాళ్ళు అంటారు..

రాజేష్ ని లేపి ఏం జరిగింది అని అడుగుతారు బాలు. మా అమ్మ నాన్నలా షష్టిపూర్తి కార్యక్రమాన్ని చేయడానికి డబ్బులు లేవురా అదే నా బాధ అని రాజేష్ అంటాడు. డబ్బుల కోసం నువ్వు ఇంతగా బాధపడి తాగొచ్చావా ఇప్పుడు నీకు ట్రిప్ వస్తే ఏం చేస్తావ్ రా అని బాలు అంటాడు. డబ్బులు దొరకాలి కదరా నన్ను కన్నందుకు వాళ్ళని సంతోషంగా చూసుకోవాలని అనుకున్నాను. కానీ ఇలాంటి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేక పోతున్నాను చవటని అని బాధపడిపోతూ ఉంటాడు.. నీకు డబ్బులే కదా నేను తెచ్చిస్తాను మీ అమ్మ నాన్నకి నువ్వు ఫంక్షన్ చేసుకో అనేసి బాలు మాట ఇచ్చి వస్తాడు. మీనా నీ పక్కకు పిలిచి రాజేష్ గురించి చెప్పి డబ్బులు ఇవ్వమని అడుగుతాడు. అది మన రూమ్ కోసం పెట్టాము ఇప్పుడు వాళ్ళందరికీ బిర్యానీలు పెట్టడానికి ఇవ్వాలని బాలును మీనా అడుగుతుంది. బాలు ఎంతగా చెప్పినా సరే మీనా మాత్రం డబ్బులు ఇవ్వడానికి అసలు ఒప్పుకోదు.

Also Read :తండ్రిని మోసం చేసిన సాగర్.. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రేమ.. శ్రీవల్లికి షాక్..

అది విన్న ప్రభావతి చూసావా నువ్విచ్చిన డబ్బులు నీకు ఇవ్వడానికే ఎంతగా ఇది చేసిందో.. నీ పెళ్ళాం గురించి ఇప్పటికైనా నీకు అర్థమైందా లేదా అని బాలు మీనాల కాపురంలో చిచ్చు పెట్టేస్తుంది. నువ్వు ఇచ్చిన డబ్బుల్ని ఇవ్వడానికి అంతగా ఇది చేస్తుంది అంటే నువ్వే ఆలోచించుకో దానికి ఎంత పొగరు అన్నది అని మీనా పై కావాలనే రెచ్చగొట్టేలా బాలుకి చెప్తుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో బాలు మీనాల మధ్య మళ్లీ దూరం పెరుగుతుందేమో చూడాలి..

Related News

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Big Stories

Advertisement
×