Political Crime Thriller OTT : ఇంటెన్స్ గా సాగే ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూడాలనుకుంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాపై ఓ లుక్ వేయండి. ఈ తమిళ సినిమా చాలా రియలిస్టిక్ కంటెంట్ తో ఉంటుంది. 1980ల కాలంలో సాగే ఈ కథ, అడవి ప్రాంతంలో ఒక గిరిజన నాయకుడిని పట్టుకోవడానికి ప్రభుత్వం చేసే ఆపరేషన్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో విజయ్ సేతుపతి నటనకు భారీ ప్రశంసలు కూడా లభించాయి. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…
వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ పోలీస్ ప్రొసీజరల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘విధుతలై పార్ట్ 1’ (Viduthalai Part 1). ఇది బి. జయమోహన్ రాసిన తునైవన్ అనే నవల ఆధారంగా తెరకెక్కింది. ఇక తమిళ కామెడీ నటుడు సూరి ఈ సినిమాతో కథానాయకుడిగా మారారు. ‘పెరుమాళ్ వాతియార్’ అనే కీలక పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. దీనికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రానికి 8.2/10 రేటింగ్ కూడా ఉంది. థియేట్రికల్ రిలీజ్ 2023 మార్చి 31న అయింది. ZEE5లో 2023 ఏప్రిల్ 28 నుంచి తెలుగు వెర్షన్ లో కూడా అందుబాటులో ఉంది ఈ సినిమా.
1980 కాలంలో ఒక అడవి ప్రాంతంలో ప్రభుత్వం ఒక మైనింగ్ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టాలనుకుంటుంది. కానీ పెరుమాళ్ (విజయ్ సేతుపతి) నాయకత్వంలోని ‘మక్కల్ పడై’ అనే గ్రూపు దాన్ని తీవ్రంగా అడ్డుకుంటూ ఉంటుంది. వీళ్ళను పట్టుకోవడానికి ప్రభుత్వం భారీగా పోలీసు బలగాలను అడవికి పంపిస్తుంది. అక్కడికి కొత్తగా వెళ్లిన కానిస్టేబుల్ కుమరేశన్ (సూరి) అనే యువకుడు, తన పై అధికారుల పెట్టే హింసను చూసి తట్టుకోలేకపోతాడు. అదే సమయంలో అడవిలోని ఒక గిరిజన అమ్మాయి (భవాని శ్రీ)తో అతనికి పరిచయం ఏర్పడుతుంది.
అక్కడి పోలీసులు ‘వాతియార్’ అని పిలవబడే పెరుమాళ్ గురించి సమాచారం కోసం, అక్కడి ప్రజలను ఎంతగా వేధిస్తున్నారో చూసి కుమరేశన్ మనస్తాపానికి గురవుతాడు. ఒకవైపు తన పై అధికారుల ఆదేశాలు, మరోవైపు తన కళ్ల ముందే జరుగుతున్న అన్యాయం మధ్య అతను నలిగిపోతుంటాడు. చివరికి అనుకోకుండా ‘వాతియార్’ ఎక్కడున్నాడో కుమరేశన్‌కి తెలుస్తుంది. అతను తన ప్రాణాలకు తెగించి పెరుమాళ్‌ను పట్టుకున్నాడా లేదా? ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే ఈ సినిమా మిగతా కథ.
Read Also : ఓటీటీలోకి కామెడీ సినిమా… నలుగురు పెళ్లాలతో పరుగులు పట్టించే సరికొత్త స్టోరీ… ఎక్కడ చూడొచ్చంటే ?