Bhatti Vikramarka: రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన, మధ్యతరగతి, విద్యార్థి, యువత, మహిళ ఇలా అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచనలతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందన్న విషయాన్ని పట్టణ ఓటర్లు గుర్తించి మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని డిప్యూటీ సీఎం (Bhatti Vikramarka) భట్టి విక్రమార్క మల్లు విజ్ఞప్తి చేశారు. సాయంత్రం వైరా మున్సిపాలిటీలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం మధిర పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల సభలో ప్రసంగించారు. మహిళలను మహాలక్ష్మి లుగా చూడాలన్న ఆలోచనతో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని అధికారంలోకి రాగానే ప్రారంభించామని తెలిపారు.
సంవత్సరానికి 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు పంపిణీ చేస్తామని ప్రకటిస్తే అంతా నవ్వారు కానీ మేం ఇప్పటికే 27 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు అందించామని అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసి చూపించామని తెలిపారు. పట్టణాల్లోని మహిళా సంఘాలకు మెప్మా ద్వారా శిక్షణ ఇప్పించి పరిశ్రమలు పెట్టించి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. రాష్ట్రంలోని పేద, బలహీన వర్గాల కోసం ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచన చేస్తుంది ఎన్నికల ముందు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంలో అనేకమంది నీడ కోసం ఇల్లు కావాలని అడిగారు అధికారంలోకి రాగానే మా ప్రభుత్వం మొదటి దశలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాం ఒక్కో ఇంటిని 5 లక్షలతో నిర్మిస్తున్నాం ఎందుకు గాను 22,500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
Also Read: Hydra: రూ. 85 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా!
గత ప్రభుత్వం 10 సంవత్సరాలపాటు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు, చేర్పులు మార్పులు చేయలేదు కానీ మేము అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్రంలో 1.15 లక్షల కుటుంబాలు ఉంటే 1.02 లక్షల కుటుంబాలకు సకాలంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయినా ప్రయాణం చేసేందుకు ఆర్టీసీ ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం మహిళల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చార్జీల డబ్బులు చెల్లిస్తుందని తెలిపారు. కుటుంబాలకు డబ్బు ఆదా అయితే వారు కుటుంబ సభ్యుల విద్య, ఆరోగ్యం, ఆహారం కోసం ఖర్చు చేసుకునే అవకాశం ఉంటుందని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.
ఆరోగ్యం బాగాలేక ఆపద వచ్చి పడితే పది లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సహాయం అందిస్తున్నామని తెలిపారు. మరో 50 సంవత్సరాల వరకు గుర్తుపెట్టుకునేలా మధి ర మున్సిపాలిటీని అభివృద్ధి చేసే బాధ్యత నాదని, కాంగ్రెస్ పక్షాన బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటు తెలుగుదేశం మద్దతు స్వతంత్రులుగా నిలిచిన అభ్యర్థులను గెలిపించి పంపండని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అమెరికా హైదరాబాద్ నగరాల్లో ఎలాంటి రక్షణ, వైద్య, విద్య సదుపాయాలు ఉన్నాయో ఆ తరహా సదుపాయాలు మధిరలో కల్పించడమే నా లక్ష్యం అని డిప్యూటీ సీఎం తెలిపారు.
Also Read:Telangana RTC: ఆర్టీసీ ఉద్యోగులకు భరోసా.. యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్!