Jubilee Hills Bypoll: తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం వేడెక్కింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మా పార్టీయే అభివృద్ధి పదేపదే నేతలు చెబుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ వెరైటీ ప్రచారం మొదలుపెట్టింది. ఆ విషయంలో మంత్రి సీతక్క దూసుకుపోతున్నారు.
జూబ్లీహిల్స్ బైపోల్‌లో ప్రచారం జోరు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సత్తా చాటాలని ప్రధాన పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. అందుకోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 8 లేదా 9 వరకు ప్రచారం సాగుతోంది. ఓ వైపు నేతలు ఇంటింటికీ ప్రచారం, రోడ్ షోలు చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
సోమవారం ఉదయం మంత్రి సీతక్క.. కృష్ణకాంత్ పార్కులో మార్నింగ్ వాకర్స్‌తో ముచ్చటించారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. ఆ తర్వాత స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని ఆమె క్షుణ్ణంగా విన్న, అన్నింటికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత స్థానిక వీధి వ్యాపారులతో ముచ్చటించారు మంత్రి సీతక్క.
ఇంటింటికీ ప్రచారంలో నేతలు
వారిని ఆప్యాయంగా పలకరించిన సదరు మంత్రి, వారి కష్టాలను తెలుసుకున్నారు. విధి వ్యాపారులు, వాకర్స్ విజ్ఞప్తి మేరకు సరదాగా కాసేపు టీ, పూలు విక్రయించారు మంత్రి సీతక్క. మంత్రి సింప్లిసిటికీ ఓటర్లు ఫిదా అయ్యారు. సీతక్క విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్‌కు గెలిపిస్తామని స్పష్టం చేశారు ఓటర్లు. మంత్రికి జై అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సీతక్క, హైదరాబాద్ మహానగర అభివృద్ధికి కాంగ్రెస్ చేసిన కృషిని గుర్తు చేశారు. పిల్లల ఎదుగుదలలో తల్లి తపన, తండ్రి కష్టం ఎంత ఉందో, అలాగే హైదరాబాద్ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ కష్టం అంతే ఉందన్నారు. నగరంలో వందలాంది ప్రభుత్వ రంగ సంస్థలు, అనుబంధంగా వేలాది కంపెనీలు, లక్షలాది ఉపాధి అవకాశాలు వచ్చాయంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమైందన్నారు.
ALSO READ: బీఆర్ఎస్ నేతల ప్రచారంపై కేటీఆర్ ఆరా
హైదరాబాద్ అభివృద్దిని-హస్తాన్ని వేరు చూసి చూడ లేమన్నారు. హస్తంతో హైదరాబాద్ అభివృద్ది చెందిందని, చెందుతుందని తెలిపారు. చిన్న మధ్య తరహ పరిశ్రమ జాతీయ సంస్థ జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడలో ఉందన్నారు. 1960 ల్లో తొలి ప్రధాని నెహ్రూ ఇక్కడ ఏర్పాటు చేశారని వివరించారు. దానివల్ల చుట్టు పక్కల వేలాదిగా చిన్న మధ్య తరహ పరిశ్రమలు వచ్చాయని గుర్తు చేశారు.
అలాగే కేంద్రీయ విద్యుత్ శిక్షణా సంస్థ తొలి ప్రధాని నెహ్రు ఇక్కడే ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అప్పుడు దేశంలో కరెంటు సమస్య ఎక్కువగా ఉండేదని, ఇంటింటికి విద్యుత్ సరఫరా చేయాలన్న సంకల్పంతో యూసుఫ్ గూడ లో కేంద్రీయ విద్యుత్ శిక్షణా సంస్థ ఏర్పాటు చేసి ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించారు.
పూల అంగడి, టీ స్టాల్ వద్ద మంత్రి సీతక్క సందడి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా కృష్ణకాంత్ పార్కు వద్ద వీధి వ్యాపారులతో ముచ్చటించి, అప్యాయంగా పలకరించిన మంత్రి
మంత్రి సీతక్క సింప్లిసిటీకి ఫిదా అయిన స్థానిక వీధి వ్యాపారులు, ప్రజలు https://t.co/ofAImpuHjg pic.twitter.com/dMKzNY17iU
— BIG TV Breaking News (@bigtvtelugu) October 27, 2025