E-Paper
Advertisement

హైదరాబాద్‌లో కొవిడ్ కలకలం.. గడగడలాడిస్తున్న కొత్త వేరియంట్ లక్షణాలు!

హైదరాబాద్‌లో కొవిడ్ కలకలం.. గడగడలాడిస్తున్న కొత్త వేరియంట్ లక్షణాలు!
Advertisement

Corona Cases: దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు మళ్లీ నిశ్శబ్దంగా విజృంభిస్తుండటం తెలుగు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే నలుగురు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అమరావతి ఆరోగ్య శాఖ వర్గాల సమాచారం ప్రకారం, ఏపీలో కొత్తగా మరో 7 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 26కు చేరింది. గుంటూరు, తూర్పుగోదావరి, బాపట్ల జిల్లాల్లో ఈ కొత్త కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, మరికొందరు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

హైదరాబాద్ ఆస్పత్రుల్లో రోగుల క్యూ..
మరోవైపు తెలంగాణలోనూ పరిస్థితి ఏమాత్రం భిన్నంగా లేదు. గడిచిన నెల రోజులుగా హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తీవ్రమైన జలుబు, ఒళ్లు నొప్పులు, పొడి దగ్గు, తీవ్ర జ్వరంతో వస్తున్న బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే, వీరికి వైద్యులు కేవలం సాధారణ ఇన్ఫెక్షన్లకే చికిత్స అందిస్తున్నారు తప్ప కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం లేదు. పరీక్షలు చేయకపోవడం వల్లే అధికారిక రికార్డుల్లో తెలంగాణలో కరోనా కేసులు ‘సున్నా’గా కనిపిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల తార్నాకకు చెందిన ఒక మహిళ తీవ్ర శ్వాసకోశ సమస్యలతో మరణించడం, గాంధీ ఆస్పత్రిలో ఒక కేస్ వెలుగు చూడటం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

Advertisement

కొరతలో ఆస్పత్రులు.. నిమ్మకు నీరెత్తిన ఆరోగ్య శాఖ
ICMR నివేదికల ప్రకారం దేశంలో జూన్ నెల నుంచే కరోనా గ్రాఫ్ పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. అయినా సరే, రాష్ట్రంలో వ్యాధుల వ్యాప్తిని పర్యవేక్షించాల్సిన ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత నాలుగేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రులకు టెస్టింగ్ కిట్లు, మాస్కులు, శానిటైజర్ల కొనుగోలు బంద్ చేయడంతో ప్రస్తుతం ఆస్పత్రుల్లో తీవ్ర కొరత వేధిస్తోంది. ఆరోగ్య శాఖ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు లేదా హెచ్చరికలు రాకపోవడంతో క్షేత్రస్థాయిలో వైద్యులు కూడా కేవలం సాధారణ మందులతో సరిపెడుతున్నారు.

ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
వాతావరణంలో మార్పులు, కొవిడ్ కొత్త సబ్‌వేరియంట్ల ప్రభావం వల్ల ఈ సమస్య తలెత్తుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, వృద్ధులు, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా తీవ్రమైన దగ్గు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండటం ద్వారా ఈ వైరస్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

Advertisement

Also Read: మందులు తీసుకుంటున్నా కొలెస్ట్రాల్ పెరుగుతూనే ఉందా? మీరు చేసే ఈ 6 తప్పులే కారణం

Related News

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

Big Stories

Advertisement
×