Illu Illalu Pillalu Today Episode may 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మదా వేదవతి దగ్గరికి వచ్చి నేను ఆఫీస్ పని మీద హైదరాబాద్ కు వెళ్లాలి మీరు పర్మిషన్ ఇప్పియ్యాల అత్తయ్య మామయ్యకి మీరు ఎలాగైనా ఒప్పించి చెప్పాలని అంటుంది. శ్రీవల్లికి తెలిస్తే ఖచ్చితంగా చెడగొడుతుందని అందరూ నాటక మాడుతారు. నర్మదా వేదవతిని తన మాటలతో బురిడీ కొట్టించి హైదరాబాద్ కు వెళ్లేందుకు రామరాజు తో చెప్పించాలని అనుకుంటుంది.. రాత్రి అందరూ కూర్చొని ఉండగా వేదవతి మనము అన్నవరం వెళ్లాలని అనుకుంటున్నాం కదండి అని అంటుంది.. నర్మదా నాకు కుదరదు ఆ టైంలో వెళ్లాలంటే నేను హైదరాబాద్ కి వెళ్ళాలి అని ఇండైరెక్టుగా హింట్ ఇస్తుంది..
జాబ్ కు సంబంధించి ట్రైనింగ్ ఉంది అత్తయ్య రెండు రోజులు నేను హైదరాబాద్ కి వెళ్లి ట్రైనింగ్ తీసుకొని రావాలి అని అంటుంది. శ్రీవల్లి మాత్రం ఎలా వెళ్తావు అత్తయ్య గారు మొగ్గ అని చెప్పారు కదా అని మధ్యలో కలగజేసుకుంటుంది. వేదవతి మాత్రం ట్రైనింగ్ అన్నారు కదా దాని గురించి కచ్చితంగా తెలుసుకోవాలి కదా అప్పుడే జాబ్ ఉంటుంది కదా అనేసి ఇన్ డైరెక్ట్ గాని ముగ్గురు కలిసి రామరాజుకు అర్థమయ్యేలా చెప్పేస్తారు. మొత్తానికి నర్మదను ట్రైనింగ్ పంపించడానికి రామరాజు ఒప్పుకుంటాడు. శ్రీవల్లి మాత్రం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. వేదవతి తన ఇద్దరు కోడలు కలిసి శ్రీవల్లిని దూరం పెడుతున్నారని ఫీల్ అయ్యి తన తల్లికి ఈ విషయాన్ని ఫోన్ చేసి చెప్తుంది. ఇంక భాగ్యం కోడలని అందరినీ సమానంగా చూసుకునే మీ అత్తని నీ వైపు తిప్పుకోవాలంటే నువ్వు ఆ నమ్మకాన్ని మీ అత్తలో కలిగించాలి అని ధైర్యాన్ని నూరిపోస్తుంది. ఇక శ్రీవల్లి తర్వాత రోజు వేదవతి దగ్గరికి వెళ్లి ఎలాగైనా అతని బుట్టలో వేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. వేదవతి వంటగదిలో టీ పెట్టుకుంటూ ఉంటుంది శ్రీవల్లి ఎలాగైనా అతని బుట్టలో వేసుకోవాలని అనుకొని లోపలికి వెళ్తుంది.
అత్తయ్య గారండీ ఏం చేస్తున్నారండి అని అడుగుతుంది. టీ పెడుతున్నానమ్మా అని వేదవతి అనగానే అయ్య బాబోయ్ నేనుండగా మీరు టీ పెట్టడమేంటండీ అత్తగారు అని శ్రీవల్లి షాక్ ఇస్తుంది. అది విన్న వేదవతి నేను తేనే కదమ్మా పెట్టేది అని అంటుంది. కోడల్ని నేనుండగా మీరు కనీసం స్పూన్ ని కూడా పక్కన పెట్టడానికి వీల్లేదు అని అంటుంది. అత్తయ్య గారండీ నన్ను మీరు వేరేగా చూస్తున్నారు మీ ఇద్దరి కోడల్ని మీకు ఎక్కువ మీ ముగ్గురు కలిసి నన్ను దూరం పెట్టేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నట్లు నటిస్తుంది. అది చూసిన వేదవతి కరిగిపోతుంది.
అదేంటమ్మా అలా అనేసావు నేను నా ముగ్గురు కోడల్ని ఒకేలా చూస్తాను అని అంటుంది. కాని శ్రీవల్లి మాత్రం నిన్న మీరు వంట గదిలో మాట్లాడుకోవడం చూసి నేను రాగానే ఆపేశారు.. అంటే నాకు తెలియకుండా రహస్యం ఏదో మీరు మాట్లాడుకున్నట్టే కదా అని శ్రీవల్లి అంటుంది. ముగ్గురు కోడలు ఒకటే కదా మరి నిన్న మీరు ముగ్గురు ఏం మాట్లాడుకున్నారు నాకు చెప్పండి అని అడుగుతుంది. నేను ఏం మాట్లాడలేదు అమ్మ నర్మదా ట్రైనింగ్ కోసం సాగర్ ని కూడా పంపించమని మామయ్య గారిని అడగమని చెప్పింది. అదే నేను ఆయనను అడిగి ఒప్పించాను అంతే అని శ్రీవల్లితో అంటుంది.
అంతేనా ఇంకేదైనా ఉందా అత్తయ్య గారు అంటే ఇంకేం లేదమ్మా అని వేదవతి అంటుంది. మొత్తానికి నాలుగు చుక్కలు కన్నీళ్ళతో వేదవతిని బుట్టలో వేసుకుంటుంది శ్రీవల్లి. తర్వాత ధీరజ్ కి సపోర్ట్ గా ఉండాలని ప్రేమ నిర్ణయించుకుంటుంది. ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసి ధీరజ్ కి సపోర్ట్ గా మనీ ఇవ్వాలని అనుకుంటుంది. ఇక శ్రీవల్లి ఇంట్లో వాళ్ళందరినీ బుట్టలో వేసుకొని తన ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటుంది.. నర్మదతో ఫ్రెండ్ గా ఉండాలని అంటుంది. వీరిద్దరి మధ్య కన్వర్జేషన్ కాస్త కామెడీగా ఉంటుంది. ఎపిసోడ్ కు ఇదే హైలెట్ అవుతుంది.
ఇక తర్వాత వేదవతి దగ్గరికి నర్మదా వస్తుంది. ఏంటి ఒక్కరే ఆలోచిస్తున్నారు అని అంటే ఏం లేదు ఇంట్లో వాళ్ల గురించి ఆలోచిస్తున్నానని వేదవతి అంటుంది. ప్రేమ అక్కడికొచ్చి నేను ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నాను ఇంట్లో కూర్చొని ఏదైనా పార్ట్ టైం జాబ్ ఉంటే చెప్పండి అని ఇద్దరిని అడుగుతుంది.. దానికి వేదవతి ఒక మంచి ప్లాన్ వేసి సులువుగా ఉండే జాబ్ ఒకటి వెతుకుదామని అంటుంది. అప్పుడే శ్రీవల్లి అక్కడికి రాగానే వాళ్ళందరూ మాటలు ఆపేస్తారు. మళ్లీ శ్రీవల్లి నన్ను మీరు వేరు చేస్తున్నారని అంటుంది. మొత్తానికి మనమంతా ఒకటే అని శ్రీవల్లి చెప్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…