Shobana: సినీ ఇండస్ట్రీలోని తారలకు ఒక్కొక్కరికి ఒక్కో జానర్ లో సినిమాలు చెయ్యాలని కోరిక ఉంటుంది. కొంతమంది హీరోయిన్ గా కన్నా ప్రత్యేకమైన పాత్రలో నటించాలని అనుకుంటారు. ఎన్ని సినిమాలు చేసిన కూడా కొన్ని సినిమాలు చెయ్యాలని కోరిక ఉంటుంది. నటీనటులకు ఏదో ఒక డ్రీమ్ పాత్ర మిగిలే ఉంటుంది. అలా ప్రముఖ నటి శోభన కూడా ఓ పాత్ర పోషించేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పింది. ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈమె వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. క్యారెక్టర్ కు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్రలో ఈమె నటిస్తుంది. కథల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తుంది. ప్రస్తుతం ప్రత్యేక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. తాజాగా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సీనియర్ హీరోయిన్ శోభన ఈ మధ్య కల్కి సినిమాలో కనిపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత మలయాళ సినిమాల్లో నటించింది. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. తాజాగా ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన మనసులోని కోరికను బయటపెట్టింది. తాను ఓ హిజ్రా పాత్రని పోషించాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ విషయమై దర్శకులతోనూ మాట్లాడానని అన్నారు. కానీ వారు మాత్రం.. ప్రేక్షకులు మిమ్మల్ని ఆ పాత్రలో అంగీకరించరని తనతో చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. మమ్ముట్టి ఆ పాత్రలో నటించి అందరిని మెప్పించారు. నేను కూడా అలానే చేస్తాను అని ఆమె అన్నారు. రూపురేఖలు, మాట్లాడే తీరు, గొంతు లాంటివి చాలా ముఖ్యమని అన్నారు అందువల్ల అలాంటి పాత్రలో నటించడం తనకు చాలా ఛాలెంజ్‌గా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
Also Read: రామరాజు కూతురితో విశ్వ ప్రేమ.. ఒంటరిగా మిగిలిన ప్రేమ.. శ్రీవల్లి మాస్టర్ ప్లాన్..
తెలుగు, తమిళం, మలయాళం ఇలా పలు భాషల్లో హీరోయిన్‌గా చేసిన ఈమె.. గొప్ప నాట్య కళాకారిణి కూడా. నటించడం తగ్గించి భరతనాట్యం పైనే ఎక్కువ మక్కువ చూపిస్తోంది. అలా చైన్నెలో డ్యాన్స్ స్కూలు నిర్వహిస్తోంది.. అలాగే ఈమె వరుసగా సినిమాలు చేస్తుంది. గత ఏడాది కల్కి సినిమాలో నటించింది. ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ గా మరో మూవీ రాబోతుంది. అలాగే ఇటీవల మలయాళంలో మోహన్ లాల్‌కు జంటగా ‘తుడరుమ్’ మూవీలో శోభన లీడ్ రోల్ చేశారు. ఈ చిత్రం అద్భుతమైన హిట్ అయింది. శోభన నటనకు ప్రశంసలు దక్కాయి.. ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులలో నటిస్తుంది. అలాగే లైనప్ లో మరో మూడు ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తుంది.. త్వరలోనే వాటి గురించి అనౌన్స్ చెయ్యనున్నట్లు సమాచారం.