BigTV English

Delhi News: మహీంద్రా షోరూమ్‌.. థార్‌ ఎస్‌యూవీ ఒక్కసారిగా పల్టీలు, వైరల్ వీడియో

Delhi News: మహీంద్రా షోరూమ్‌.. థార్‌ ఎస్‌యూవీ ఒక్కసారిగా పల్టీలు, వైరల్ వీడియో

Delhi News: షోరూమ్ నుంచి వాహనాలు తీసేటప్పుడు జాగ్రత్త. ఏ మాత్రం తేడా వచ్చినా షోరూమ్ మాత్రమేకాదు.. చివరకు వాహనం సైతం డ్యామేజ్ అవుతుంది. ఢిల్లీ మహీంద్రా షోరూమ్‌లో అదే జరిగింది. కస్టమర్ వాహనం తీసుకుని యాక్సిలరేటర్‌ ఒక్కసారిగా వదలడంతో పైఅంతస్తు నుంచి కిందపడింది. దీనికి సంబంధించి వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది.


యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన మాని పవార్‌ మహిళ థార్‌ ఎస్‌యూవీని కొనుగోలు చేసింది. అయితే సోమవారం దానిని తీసుకునేందుకు ఢిల్లీలోని నిర్మాణ్ విహార్‌లోని మహీంద్రా షోరూమ్‌కు వెళ్లారు. కొత్త కారు కొనుగోలు చేసిన బయటకు తీసే క్రమంలో తొలుత పూజ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే మహీంద్రా షోరూమ్‌ ఫస్ట్‌ ఫ్లోర్‌లో ఉంది.

థార్‌ వాహనంతో నిమ్మకాయలను తొక్కించి ఒక్కసారిగా ఆమె యాక్సిలేటర్‌ నొక్కారు. ఒక్కసారిగా వాహనం షోరూమ్ మొదటి అంతస్తు నుంచి ఎగిరి కింద పడింది. అద్దాలను బద్దలు గుద్ది కిందకు పల్టీలు కొట్టింది.  ఈ ఘటన సమయంలో థార్‌ వాహనంలో యజమాని మాని, ఆమె భర్త ప్రదీప్, షోరూమ్‌ సిబ్బంది ఒకరు ఉన్నారు.


వెంటనే ఎయిర్‌బాగ్స్‌ తెరుచుకోవడంతో అందులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఢిల్లీ తూర్పు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభిషేక్ ధనియా తెలిపారు. కొత్త థార్ డెలివరీ తీసుకున్న కొద్దిక్షణాల్లో ఈ ప్రమాదం జరిగిందన్నారు.  స్వల్పగాయాలు అయినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ALSO READ: ఆ టేప్ చుట్టుకుని నడిచినందుకు రూ. 80 కోట్లు చెల్లించారట

కొత్త వాహనం పూజ చేస్తున్నప్పుడు వాహనం యజమాని ప్రమాదవశాత్తు యాక్సిలరేటర్‌ను నొక్కినట్టు తెలిపారు. ఈ ఘటనలో షోరూమ్ గాజు గోడను ధ్వంసం అయ్యింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగినట్టు తెలుస్తోంది. ఆలస్యంగా ఈ వీడియో వెలుగులోకి వచ్చింది.

థార్ పడిన సమయంలో కింద ఓ టూ వీలర్ ఉంది. అది డ్యామేజ్ అయినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.  కొద్దిరోజుల కిందట హైదరాబాద్‌లో ఈ విధంగా ఘటన జరిగింది. పైఅంతస్తు నుంచి కొత్త కారు  కింద పడింది. ఈ ఘటనలో కారు డ్యామేజ్ అయిన విషయం తెల్సిందే.  ఒకప్పుడు షోరూములు కింద ఫ్లోర్‌‌లో ఉండేవని, పెద్దగా ఇలాంటి ఘటనలు జరగలేదని అంటున్నారు.

 

 

Related News

Gigi Hadid: కేవలం ఆ టేపు చుట్టుకుని నడిచినందుకు రూ.80 కోట్లు చెల్లించారట.. ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటీ?

Viral Video: మినీ బస్సులో సముద్రంలో షికారు.. ఒక్క భారీ కెరటంతో సీన్ మారిపోయింది!

Viral News: కొట్టేయడం నా హాబీ.. చోరీ కేసులో మహిళ సర్పంచ్ అరెస్ట్, ఆమె చెప్పింది వింటే ఫ్యూజులు ఔట్!

Viral Video: పరాయి మగాడితో అడ్డంగా దొరికిన భార్య.. తట్టుకోలేక భర్త..

Shocking: శిశువును ఫ్రీజర్ లో పెట్టి నిద్రపోయిన తల్లి.. వామ్మో ఇదేం ఘోరం?

Big Stories

×