BigTV English

Bigg Boss 9 Promo : హీట్ హీట్‌గా నామినేషన్స్… సెలబ్రెటీస్‌ను వణికిస్తున్న కామనర్స్.. దెబ్బకు కన్నీళ్లు

Bigg Boss 9 Promo : హీట్ హీట్‌గా నామినేషన్స్… సెలబ్రెటీస్‌ను వణికిస్తున్న కామనర్స్.. దెబ్బకు కన్నీళ్లు

Bigg Boss 9 Telugu:ప్రేక్షకులను అలరించడానికి బిగ్ బాస్ మళ్లీ వచ్చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగులో ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పుడు 9వ సీజన్ కూడా ప్రారంభం అయింది. 9 మంది సెలబ్రిటీలు హౌస్ లోకి అడుగుపెట్టగా.. 6 మంది కామనర్స్ అగ్ని పరీక్షలో తమ సత్తా చాటి ఇప్పుడు హౌస్ లోకి అడుగుపెట్టారు. అంతేకాదు ఈ 6 మంది కామనర్స్ తొలిసారి బిగ్ బాస్ చరిత్రలో ఓనర్స్ గా చలామణి అవుతూ అటు సెలబ్రిటీలను టెనెంట్స్ గా ట్రీట్ చేస్తూ ఈ షో ను ముందుకు తీసుకు వెళ్తున్నారు.


నామినేషన్స్ ప్రక్రియ మొదలు..

బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7వ తేదీన అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడు మూడవ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. మరి ఈ ప్రోమో ఎలా ఉంది అనే విషయం ఇప్పుడు చూద్దాం. మొదటి వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియను నిన్నటితో బిగ్ బాస్ ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదట కామనర్స్ అందరూ ఒక సెలబ్రిటీని నామినేట్ చేయాలని కోరగా.. కామనర్స్ అంతా చర్చించుకొని మరి సంజన గల్రాని ని నామినేట్ చేశారు.

హీట్ పెంచుతున్న గొడవలు..


ఇక ఇప్పుడు అసలైన నామినేషన్ ప్రక్రియ మొదలయింది. అందులో భాగంగానే కామనర్స్.. సెలబ్రెటీల తప్పొప్పులను బయటకు తీస్తూ నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కామనర్ అయిన దమ్ము శ్రీజ.. సంజన గల్రానీ, తనూజ గౌడ లను నామినేట్ చేస్తూ.. తన వేలో కారణం చెప్పే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే దమ్ము శ్రీజ మాట్లాడుతూ..” సంజన గారు మీరు వాష్ రూమ్ లో షాంపూ బాటిల్ , కండిషనర్ పెట్టినప్పుడు వాటిని రిమూవ్ చేయమని అడిగితే.. లేదు నేను ఆ స్టాండ్ మీదే ఉంటాను. అలాగే చేస్తాను అని అంటున్నారు. అసలు ఆ స్టాండే కరెక్ట్ కాదు” అంటూ దమ్ము శ్రీజ తెలిపింది.

బాడీ లాంగ్వేజ్ పై కామెంట్స్..

తనూజ గురించి మాట్లాడుతూ..” మీరు ఫస్ట్ డే నుంచి కామెంట్లు చేయడం మొదలుపెట్టారు” అని దమ్ము శ్రీజ మాట్లాడడం మొదలుపెట్టగానే తనుజ రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని నిలబడింది. ఇలాంటివే మొదటి రోజు నుంచి మీ దగ్గర మేము గమనిస్తూనే ఉన్నాము. అని చెబుతుండగానే మధ్యలో పవన్ కలగజేసుకొని మనుషుల్లా చూడడం లేదు అంటున్నారు అది వెరీ రాంగ్ అంటూ ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. చిరాకు పడుతూ ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తోంది అని దమ్ము శ్రీజ తన అభిప్రాయాన్ని చెప్పగా.. దానికి తనూజ మాట్లాడుతూ.. ఒకరొచ్చి ఒక మాట చెబుతారు.. ఇంకొకరు వచ్చి ఇంకొకరు ఇంకో మాట చెబుతారు. ఎవరు చెప్పేది వినాలి అని మేము మనుషులమే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉండగా.. హరీష్ మాట్లాడుతూ.. అగ్నిపరీక్ష అని చెప్పబోతుండగానే ఆమె నేను అక్కడ మాట్లాడుతున్నాను అంటూ తనూజ తెలిపింది. బాడీ లాంగ్వేజ్ బాగలేదు అంటూ హరీష్ ఆమెతో గొడవ దిగగా.. భరణి కొట్టడానికి వెళ్తున్నట్టు ముందుకు వెళ్ళగా.. అప్పుడు ఇమ్మానుయేల్ వచ్చి మధ్యలో భరణిని ఆపేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏది ఏమైనా ఈ నామినేషన్ ప్రక్రియ హీట్ పెంచుతోందని చెప్పవచ్చు.

 

ALSO READ:Mollywood: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఫోటోలో వైరల్!

 

Related News

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు ఫస్ట్ వీక్ ఎలిమినేషన్.. ఆమెను టార్గెట్ చేస్తున్నారా?

Bigg Boss 9 Telugu Day 2: బ్యాక్ బిచ్చింగ్ లో అంత బూతుందా.. సంజన ఓవరాక్షన్, నామినేషన్ లో టార్గెటైన ‘బుజ్జిగాడు‘ భామ

Bigg Boss season 9 Day 2: షాంపూ కోసమో సబ్బు కోసమో, మీలో మీరు కొట్టుకు చావండి, మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ చేయండి

Bigg Boss 9 Telugu: ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ సెలబ్రిటీల నుంచే.. వారిద్దరికే నెగిటివిటీ ఎక్కువ.. హౌజ్ వీడేది ఆమెనే!

Bigg Boss 9 Telugu: సంజనా మొండితనం.. దెబ్బకు లేడీ కంటెస్టెంట్స్ కి షాక్!

Big Stories

×