BigTV English

Modi-Trump: మోదీ–ట్రంప్ వాణిజ్య చర్చలు.. ఎక్స్ వేదికగా ప్రకటన

Modi-Trump: మోదీ–ట్రంప్ వాణిజ్య చర్చలు.. ఎక్స్ వేదికగా ప్రకటన

Trump-Modi: భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరూ పరస్పరం స్పందిస్తూ వాణిజ్య చర్చలు త్వరలోనే విజయవంతం అవుతాయని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించగా, వెంటనే మోదీ కూడా ట్వీట్ చేస్తూ రెండు దేశాలు సహజ భాగస్వాములని, ఈ చర్చలు అపరిమిత అవకాశాల తలుపులు తెరవబోతున్నాయని అన్నారు. ఇదిలా ఉండగా, ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరగబోయే చర్చలపై కూడా సంకేతాలు ఇచ్చారు. మరోవైపు మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ దాడులు, గాజా సమస్యపై కూడా ఆయన స్పందించారు.


ఎక్స్ వేదికగా ట్రంప్ ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా భారత్‌తో జరుగుతున్న వాణిజ్య చర్చలపై ప్రకటన చేశారు. భారత్ – అమెరికా మధ్య ఉన్న వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు ఇరుదేశాలు చర్చలు కొనసాగిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. “మన రెండు గొప్ప దేశాలకు లాభదాయకంగా ఉండేలా ఈ చర్చలు విజయవంతంగా పూర్తవుతాయని నాకెంతో నమ్మకం ఉంది. త్వరలోనే నా మిత్రుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీతో కూడా మాట్లాడతాను” అని ట్రంప్ పేర్కొన్నారు.


ట్రంప్ ప్రకటనపై మోదీ ఏమన్నారంటే?

ట్రంప్ వ్యాఖ్యలకు వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ భారత్, అమెరికా సన్నిహిత మిత్ర దేశాలు, సహజ భాగస్వాములు. ఈ వాణిజ్య చర్చలు మన రెండు దేశాల మధ్య ఉన్న అపరిమిత అవకాశాలను వెలికి తీసేలా మారుతాయని నాకెంతో విశ్వాసం ఉంది. మా బృందాలు వీలైనంత త్వరగా చర్చలు పూర్తిచేయడానికి కృషి చేస్తున్నాయి. త్వరలోనే ట్రంప్‌తో కూడా మాట్లాడాలని ఆశిస్తున్నాను. మన ప్రజలందరికీ ప్రకాశవంతమైన, అభివృద్ధి చెందే భవిష్యత్తు అందించేందుకు కలిసి కట్టుగా ముందుకు సాగుతాంమని మోదీ ట్వీట్ చేశారు.

Also Read: OTT Movie : ప్రేమ పేరుతో సీక్రెట్ వీడియోలు… లేడీ ఆఫీసర్ ను నిండా ముంచే కేటుగాడు… గ్రిప్పింగ్ స్పై థ్రిల్లర్

పుతిన్‌తో సంభాషణపై మీడియా ప్రశ్న.. ట్రంప్ సమాధానం

మీడియా ప్రతినిధులు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఎప్పుడు మాట్లాడతారని అడగగా ట్రంప్ ఈ వారం లేదా వచ్చే వారం మొదట్లోనే ఆయనతో మాట్లాడతాను. ప్రస్తుతం రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయి – రష్యా అంశం, గాజా పరిస్థితి. రెండింటినీ పరిష్కరించాలనే ప్రయత్నం జరుగుతోంది” అని వెల్లడించారు.

ఇజ్రాయెల్ దాడులపై వ్యాఖ్యలు ట్రంప్..

దోహా, ఖతార్‌లో హమాస్ సౌకర్యంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులపై ట్రంప్ మాట్లాడుతూ ఆ ఘటన నన్ను అసలు సంతోష పరచలేదు. పరిస్థితి మంచిది కాదు. కానీ ఒక విషయం మాత్రం చెప్పాలి – బందీలను తిరిగి ఇవ్వాలి. ఆ విధంగా జరిగిన తీరు నచ్చలేదని అన్నారు. గల్ఫ్ ప్రాంతంలో జరిగే ఏ సంఘటననైనా చూసి నేను ఆశ్చర్యపోను. అక్కడ ఎప్పుడూ ఊహించని పరిణామాలే చోటు చేసుకుంటుంటాయి” అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రపంచ రాజకీయాల గందరగోళం మధ్య ఇండియా – అమెరికా వాణిజ్య చర్చలు కొత్త దిశను సంతరించుకున్నాయి. ట్రంప్ – మోదీ ఇద్దరూ ఈ చర్చలు విజయవంతమవుతాయని నమ్మకం వ్యక్తం చేశారు. ఇక రష్యా, గాజా, గల్ఫ్ ప్రాంత సమస్యలపై ట్రంప్ స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో, రాబోయే రోజులు ప్రపంచ దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.

Related News

Nepal Protests: భారత్-నేపాల్ సరిహద్దులో ఉద్రిక్తతలు! విమాన సర్వీసుల నిలిపివేత..

Vice President: భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్..

Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నిక.. రాధాకృష్ణన్ Vs సుదర్శన్ రెడ్డి

Social Media Ban: నేపాల్‌లో హింసాత్మకంగా యువత నిరసనలు.. కాల్పుల్లో 20 మంది మృతి

Amruta Fadnavis: బీచ్‌‌ను శుభ్రం చేసిన సీఎం భార్య.. ఆమె డ్రెస్ చూసి నోరెళ్లబెట్టిన జనం

×