Nepal Protests: నేపాల్ రాజధాని ఖాట్మాండు నుంచి మొదలైన ఆందోళనలు ఇప్పుడు భారత్-నేపాల్ సరిహద్దు వరకు చేరాయి. దేశవ్యాప్తంగా అశాంతి నెలకున్న నేపథ్యంలో, భారత సరిహద్దు ప్రాంతాల్లోనూ పరిస్థితి గందరగోళంగా మారింది. ఖాట్మాండు నగరంలో నిరసన కారులు బీపీ చౌక్, త్రిభువన్ చౌక్‌లలో విధ్వంసానికి పాల్పడి, భవనాలకు నిప్పులు పెట్టారు. ఆ తర్వాత ఆగ్రహంతో రుపైడీహా సమీపంలోని జమునాహా వైపు ఊరేగారు. అక్కడ భారత సరిహద్దు భద్రతా దళం (SSB) సిబ్బంది, పోలీసులు ముందుగా నిలబడి, నినాదాలు చేస్తూ, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన నిరసన కారులను అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్తతల నడుమ నేపాల్‌లో కర్ఫ్యూ విధించారు. ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థను అడ్డుకుంటున్నారు. ఎవరని అనుమతించడంలేదు. దీంతో ప్రయాణికులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి ఇంకా ఎన్నిరోజులు కొనసాగుతుంతో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భారత్-నేపాల్ సరిహద్దులో భద్రత
ఇలాంటి ఉద్రిక్తల పరిస్థితుల్లో, ఇండో-నేపాల్ సరిహద్దులో భద్రతా చర్యలు మరింత కఠినతరం అయ్యాయి. ప్రతి రహదారిని కట్టుదిట్టంగా తనిఖీ చేస్తూ, అనుమానాస్పద వ్యక్తులపై పక్కా నిఘా వేసి, అవసరమైతే ప్రవేశానికి కూడా అనుమతించడం లేదు. బయటకు ఎవరు కనపడిన వారిని తనిఖీ చేస్తున్నారు. దీంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు భయాందోళన చెందుతున్నారు. ఇంకా ఎన్ని రోజుల వరకు ఈ రకం అనుభవించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇండిగో విమాన సర్వీసులు రద్దు
నేపాల్ అశాంతి ప్రభావం ఉత్తరప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో బాగా కనిపిస్తోంది. సరిహద్దు మార్కెట్లు ఖాళీగా మారిపోయాయి. వ్యాపారం ఆగిపోవడంతో స్థానికులు ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారు. చాలామంది తమ బంధువులతో సంబంధాలు తెగిపోయి ఆందోళన చెందుతున్నారు. ప్రయాణ ప్రణాళికలు కూడా రద్దు అవుతున్నాయి. నేపాల్ వెళ్లే భారతీయులు తిరిగి వచ్చేస్తున్నారు.
ఇండిగో ఎయిర్‌లైన్స్ ఖాట్మండు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ట్రావెల్ అడ్వైసరీ జారీ చేశారు.
మాజీ ప్రధాని కె.ఐ. సింగ్ మనవడు యశ్వంత్ షా
ఈ సంఘటనలపై రాజకీయ ప్రతిస్పందనలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మాజీ ప్రధాని కె.ఐ. సింగ్ మనవడు యశ్వంత్ షా మాట్లాడుతూ, నిరసనలను ప్రభుత్వం తప్పుగా నిర్వహించిందని, అవి శాంతియుతంగా సాగినవి, అవి అవినీతి వ్యతిరేకంగానే జరిగాయని పేర్కొన్నారు.
Also Read: Modi-Trump: మోదీ–ట్రంప్ వాణిజ్య చర్చలు.. ఎక్స్ వేదికగా ప్రకటన
బీజేపీ నేత దిలీప్ ఘోష్ మాట్లాడుతూ
బీజేపీ నేత దిలీప్ ఘోష్ వ్యాఖ్యానిస్తూ, నేపాల్‌లో కమ్యూనిస్టులపై ప్రజల్లో ఆగ్రహం ఎక్కువైందని, వారి జెండాలు చింపి వేస్తున్నాయని, నేతలను కొడుతున్నారని తెలిపారు. అవినీతిలో కూరుకుపోయిన కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఇలాంటి పరిణామాలను ఎదుర్కొంటాయని, ఇది దురదృష్టకరమని, భారత్ ఎల్లప్పుడూ నేపాల్‌తో ఉందని అన్నారు.
నేపాల్ ప్రధాని కేపీ. శర్మ రాజీనామా! నెక్ట్ పీఎం ఎవరు?
నేపాల్ ప్రధాని కేపీ. శర్మ ఓలి అవినీతి ఆరోపణల నడుమ రాజీనామా చేశారు. మంత్రులు అని కూడా చూడకుండా రోడ్లపై పరిగెత్తించి చితకబాదారు. అయితే అందరి ప్రశ్న నేపాల్ నెక్స్ట్ పీఎం ఎవరు..? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరొకవైపు దేశవ్యాప్తంగా నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ఖాట్మాండు నగరంలో కర్ఫ్యూ విధించబడింది, ఉద్రిక్తత తగ్గేవరకు అది కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రయాణాలు, విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసి, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ట్రావెల్ అడ్వైసరీ జారీ చేసిందని అధికారులు వెల్లడించారు.
కర్ఫ్యూ అధికారులు ప్రకటన
ఖాట్మాండు లోని కాంటిపూర్ మీడియా గ్రూప్ ప్రధాన కార్యాలయానికి నిరసనకారులు నిప్పు పెట్టడంతో ఆప్రాంతమంతా పొగ వ్యాపించి ఉధృుత వాతావరణం నెలకొంది. భైరవా ప్రాంతంలో ఈ ఉదయం నుంచి సెక్యూరిటీ బలవంతం చేయబడింది. కర్ఫ్యూ అమల్లోనే ఉంది, హింసా కాండా నిలిచేంత వరకు కర్ఫ్యూ అమల్లోనే ఉంటుందని అధికారులు ప్రకటించారు. అవినీతి వ్యతిరేక నిరసనలు నేపాల్‌లో రాజకీయ కల్లోలంగా మారాయి. దాని ప్రభావం ఇండో-నేపాల్ సరిహద్దు ప్రాంతాలపై తీవ్రంగా పడింది. వ్యాపారాలు, కుటుంబ సంబంధాలు, ప్రయాణాలు అన్నీ దెబ్బతిన్నాయి. ఇక పరిస్థితి ఎప్పుడు శాంతిస్తుంది అన్నదే అందరి ఆందోళనగా మారింది.