Milk Purity Test: ఈ రోజుల్లో మార్కెట్లో లభించే పాల స్వచ్ఛతను నమ్మడం కష్టంగా మారింది. చాలా చోట్ల.. పాలలో నీరు, డిటర్జెంట్, స్టార్చ్ లేదా సింథటిక్ రసాయనాలు కలిపిన కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి పాలు ఆరోగ్యానికి చాలా హానికరం. అంతే కాకుండా వీటిని ఎక్కువ కాలం తీసుకుంటే.. అది తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమవుతుంది.
మీరు రోజూ పాలు, లేదా టీ వంటివి తాగుతుంటే మాత్రం అవి స్వచ్ఛమైన పాలా లేదా కల్తీ చేసినవా అని తెలుసుకోవడం ముఖ్యం. కల్తీ పాలను గుర్తించడానికి కొన్ని సులభమైన హోం రెమెడీస్ ఉన్నాయి. వాటి ద్వారా మీరు ఇంట్లోనే పాల నాణ్యతను చెక్ చేయవచ్చు. అలాంటి కొన్ని సింపుల్ టిస్ట్ లను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ 5 విధాలుగా కాల్తీ పాలను టెస్ట్ చేయండి:
కల్తీని గుర్తించడం: పాలు నీటితో కలిపి ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి, శుభ్రమైన గాజు ఉపరితలంపై ఒక చుక్క పాలు వేయండి. స్వచ్ఛమైన పాలు నెమ్మదిగా తెల్లటి జాడను వదిలి కిందకు వస్తాయి.. నీరు కలిపిన పాలు వెంటనే ప్రవహిస్తాయి. అంతే కాకుండా స్పష్టమైన జాడను వదలవు. దీనివల్ల పాలు స్వచ్ఛమైనవో కాదో తెలుసుకోవడం సులభం అవుతుంది.
స్టార్చ్ కల్తీని గుర్తించడం: పాలలో స్టార్చ్ కలిపితే.. దానిని అయోడిన్ ద్రావణంతో గుర్తించవచ్చు. ఒక టీస్పూన్ పాలలో 2-3 చుక్కల అయోడిన్ కలపండి. పాలు నీలం రంగులో కనిపిస్తే.. దానిలో స్టార్చ్ కల్తీ అయిందని అర్థం. ఈ పరీక్ష సులభం, అంతే కాకుండా దీనిని ఇంట్లో కూడా చేయవచ్చు.
డిటర్జెంట్ కల్తీని గుర్తించడం: పాలలో డిటర్జెంట్ కలిపితే ఆరోగ్యానికి ప్రమాదకరం. దీన్ని చెక్ చేయడానికి.. నీటిలో కొంత పాలు కలిపి కదిలించండి. ఎక్కువ నురుగు ఏర్పడటం ప్రారంభిస్తే.. పాలలో డిటర్జెంట్ కలిపారని అర్థం చేసుకోండి. స్వచ్ఛమైన పాలు సాధారణంగా షేక్ చేసినప్పుడు అంత నురుగును ఏర్పరచవు.
Also Read: మీ ముఖం, మెడ.. ఇలా మారుతున్నట్లయితే కిడ్నీ సమస్యలు మొదలైనట్లే !
సింథటిక్ పాలను గుర్తించడం: సింథటిక్ పాలను వాసన చూసి, రుచి చూడటం ద్వారా గుర్తించవచ్చు. దాని రుచి కొద్దిగా చేదుగా ఉంటుంది. అంతే కాకుండా వాసన కూడా అసహజంగా ఉంటుంది. ఇలాంటి పాలను మరిగించినప్పుడు, రంగు మారుతాయి. అవంతే కాకుండా కొన్ని సార్లు పొర కూడా ఏర్పడుతుంది. ఈ పరీక్ష సరళమైనది. అంతే కాకుండా ప్రభావవంతమైనది కూడా .
ఉప్పు పాల గుర్తింపు: కొన్నిసార్లు యూరియా లేదా ఇతర రసాయనాలను పాలలో కలుపుతారు. అటువంటి పాల రుచి కొద్దిగా ఉప్పగా ఉంటుంది. వాటిని రుచి చూడటం ద్వారా, పాలు స్వచ్ఛమైనదా కాదా అని సులభంగా తెలుసుకోవచ్చు. ఈ కల్తీ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. వీటిని తాగడం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయి.