BigTV English
Advertisement

Brahmamudi Serial Today September 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రుద్రాణి ప్లాన్ అట్టర్ ప్లాప్ – సారీ చెప్పిన రేవతి

Brahmamudi Serial Today September 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రుద్రాణి ప్లాన్ అట్టర్ ప్లాప్ – సారీ చెప్పిన రేవతి

Brahmamudi serial today Episode:  దేవుడి దగ్గర ఉన్న తీర్థంలో రుద్రాణి పౌడర్‌ కలుపుతుంది. వెనక నుంచి కనకం, జూనియర్‌ స్వరాజ్‌ చూస్తుంటారు. వాళ్లను చూసిన రుద్రాణి షాక్‌ అవుతూ.. వీళ్లేంటి నన్ను ఇలా చూస్తున్నారు.. కొంపతీసి నేను తీర్థంలో పౌడర్‌ కలిపింది చూశారా ఏంటి… అని మనసులో అనుకుంటూ.. ఏంటి నా వైపు అలా చూస్తున్నారు.. అని అడుగుతుంది. దీంతో కనకం నువ్వు చేసిన పనికి అని చెప్తుంది. డౌటే లేదు.. వీళ్ల వాలకం చూస్తుంటే కచ్చితంగా చూసేసినట్టే ఉన్నారు. చచ్చా అని మనసులో అనుకుంటూ భయపడుతుంద. ఏంటి తప్పు చేశానని భయపడుతున్నావా..? అని స్వరాజ్‌ అడుగుతాడు. నేనా నేను తప్పు  చేయడం ఏంటి.. ? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటుంది రుద్రాణి.


నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీకు తెలయదా..? ఏం చేస్తున్నావు ఇక్కడ..? నేనా నేనేం చేయట్లేదే.. అంటుంది రుద్రాణి. నేను ఇందాక ఏం చెప్పాను.. ఇందాక జ్యూస్‌ ఇవ్వమని అడిగాను కదా.? ఈ ఇంటి వారసుడు జ్యూస్‌ అడిగితే ఇవ్వాలని తెలియదా..? అనగానే రుద్రాణి కోపంగా ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు.. ఇది నా ఇల్లు నా ఇష్టం నాకు పని చేయాలనిపిస్తే చేస్తాను  లేదంటే కాలీగా తిరుగుతాను.. అయినా ఓనర్ అనుకుంటున్నావా..? నువ్వు అంటూ చెప్పగానే.. అవును నా డార్లింగ్‌ ఇప్పుడు ఓనరే.. ఇందాక వదిన ఏం చెప్పిందో విన్నావు కదా.? అంటుంది కనకం. ఏంటి డార్లింగా..? ఇదెప్పుడో అంటుంది రుద్రాణి. అవును నేను తనకు డార్లింగ్‌.. తను నాకు డార్లింగ్‌.. అయినా నాకు జ్యూస్‌ తెస్తావా..? నా ఫ్రెండ్‌కు చెప్పనా.. అంటాడు. రుద్రాణి సరేనని చెప్పి వెళ్లిపోతుంది.

తర్వాత అందరూ కలిసి వినాయక పూజ చేస్తారు. పూజ అయిపోయాక కావ్య హారతి ఇస్తుంది. కావ్య అందరికీ హారతి ఇస్తుంటే.. నేను ఇస్తాను ఇవ్వు కావ్య అంటూ అపర్ణ హారతి తీసుకుని అందరికీ ఇస్తుంది. ఇంతలో రుద్రాణి ఏంటి హారతి ఇచ్చినప్పుడు కూడా ముసుగు తీయరా..? అంటుంది. వెంటనే ప్రకాష్‌ రుద్రాణిన చేయి పట్టుకుని రేవతి దగ్గరకు తీసుకెళ్లి ముసుగు నువ్వే తీయ్‌ అని చెప్తాడు. రుద్రాణి ముసుగు తీయబోతుంటే.. శవయాత్రకు రెడీ చేసుకోండి అంటాడు దీంతో రుద్రాణి భయపడుతూ ముసుగు తీయకుండా వెళ్లిపోతుంది. అపర్ణ తీసుకోమ్మా రాధ అనగానే రేవతి హారతి తీసుకుంటుంది. అందరూ మీ మనసులో ఉన్న కోరికలన్నీ వినాయకుడికి విన్నవించుకుంటూ నమస్కారం చేసుకోండి అని చెప్తాడు.


అందరూ మొక్కుతారు. ఇంతలో అపర్ణ ఓరేయ్‌ ఫ్రెండ్‌ ఏంట్రా అంతసేపు దండం పెట్టుకున్నావు ఎన్ని కోరికలు కోరుకున్నావు అని అడుగుతుంది. దీంతో ఫ్రెండ్‌ మనసులో కోరుకున్న కోరికలు బయటకు చెప్పకూడదట.. అంటాడు. నేను నీ ఫ్రెండ్‌ను కదరా నాకు చెప్పొచ్చు అంటుంది అపర్ణ. అయితే నేన లైఫ్‌లాంగ్‌ ఈ ఇంట్లోనే ఉండాలని కోరుకున్నాను అంటాడు.. అయితే లైఫ్‌లాంగ్‌ ఉంటావా..? ఏమ్మా మా ఇంట్లోనే ఉంచుతావా..? అని అపర్ణ రేవతి అడుగుతుంది. ఏంటి అపర్ణ అలా అడగొచ్చా…? వాళ్లు ఏమనుకుంటారు అంటుంది ఇంద్రాదేవి. ఇంతలో రేవతి బయటకు వెళ్లిపోతుంది. వెనకాలే రాజ్‌ వెళ్తాడు. ఏమైంది అక్కా అని అడుగుతాడు. ఇలాంటి సందర్భం వస్తుందని అనుకోలేదు.. అంటూ ఎమోషనల్ అవుతుంది. రాజ్‌ ఓదారుస్తాడు. వెనకాలే వచ్చిన రాహుల్‌, రుద్రాణి వాళ్లను చూసి అనుమానిస్తారు.

తర్వాత పంతులు అందరికీ తీర్తం ఇస్తుంటే.. స్వరాజ్‌ హాయ్‌ తీర్థం అనుకుంటూ పరుగెత్తుకుంటూ వెళ్లి పంతులుకు తగులుతాడు. దీంతో తీర్థం కిందపడిపోతుంది. రాహుల్‌, రుద్రాణి కోపంగా చూస్తుంటారు. అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు. కోపంగా రుద్రాణి, స్వరాజ్‌  దగ్గరకు వెళ్లి ఏరా ఉన్న వాడివి ఒక్కచోట ఉండలేవా..? తీర్థం మొత్తం ఎలా ఒలికిపోయిందో చూడు అంటూ తిడుతుంటే.. రేవతి ఏదో చిన్న పిల్లాడు తప్పై పోయింది. క్షమించండి అంటుంది. ఏంటి చిన్న పిల్లాడా..? ఇలా పరాయి వాళ్ల ఇంటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని తెలియదా..? నీకు .. అంటుంది. దీంతో అపర్ణ కోపంగా రుద్రాణి ఏంటా మాటలు ఇంటికి వచ్చిన అతిథులతో ఇలాగేనా మాట్లాడేది అంటుంది. అది కాదు వదిన తీర్థం అలా కింద పడిపోతే ఇంటికి ఎంత అరిష్టం అంటుంది. దీంతో ఇంద్రాదేవి అని నీకు ఎవరు చెప్పారే.. తీర్థం కింద పడితే అరిష్టం.. పిల్లి ఎదురొస్తే కష్టం.. బల్లి మీద పడితే ప్రమాదం అని మన హిందూ ధర్మాలలో ఎక్కడా చెప్పబడలేదు ముందు ఆ అమ్మాయికి సారీ చెప్పు అంటుంది.

సారీనా నేనా నెవర్‌ చెప్పను.. అంటుంది రుద్రాణి. పర్వాలేదు నాన్నమ్మ గారు తప్పు మాదే నేనే బాబును జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకోసారి అలా జరగదు.. అంటుంది. దీంతో అపర్ణ ఏంటి రాధ అలా మాట్లాడతావు.. చిన్న పిల్లాడు అన్నాక అల్లరి చేయాలి. ఆట పట్టించాలి. అదే కదా వాడికి ఆనందం.. పైగీ వీడెవడు నా ఫ్రెండ్‌.. వీడు ఏం చేసినా రైటే.. ఈ ఇంట్లో ఎవ్వరూ తప్పు పట్టడానికి వీలులేదు.. అంటుంది. ఆ విషయం ముందు మీ రుబ్బురోలుకు చెప్పు అంటాడు.. దీంతో రుద్రాణి కోపంగా ఎవ్వడ్రా రుబ్బు రోలు వేలేడంత లేవు నాకే పేరు పెడతావా..? అంటుంది. దీంతో కనకం ఏంటి రుద్రాణి ఇది నీ గొడవలకు చిన్నా పెద్ద తేడా లేదా..? ఆఖరికి ఆ చిన్న పిల్లాడి చేత కూడా మాట అనిపించుకోవాలా..? అంటుంది.

మా రుద్రాణికి మాట పడనిదే ముద్దు దిగదులే కనకం అంటుంది ఇంద్రాదేవి.. రుద్రాణి పిల్లలు దేవుడికి ప్రతిరూపాలు అంటారు. వీడి చేత ఏ మంచి కోసం విఘ్నేశ్వరుడు అలా చేయించాడో మనకేం తెలుసు.. అంటూ సీతారామయ్య చెప్పగానే.. రుద్రాణి, రాహుల్‌ అలిగి వెళ్లిపోతాడు.  ఏంటి మమ్మీ మనం అనుకున్న ప్లాన్‌ ఇలా ఫెయిల్‌ అయింది అంటాడు రాహుల్‌. చెప్పాను కదా మనం ఇంకా గట్టిగా ఆలోచించాలి.. ముందు ఆ కావ్య సంగతి కాదు.. ఇంటికి వచ్చిన అతిథి గురించి ఆలోచించాలి అని రుద్రాణి చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu Illalu Pillalu Today Episode: రామరాజు ఇంట దీపావళి పూజ.. ధీరజ్ ప్రేమ గొడవ.. పోలీసుల ఎంట్రీ.. ప్రేమ కన్నీళ్లు..

Intinti Ramayanam Today Episode: చక్రధర్ కు షాకిచ్చిన కమల్.. పల్లవికి క్లాస్ పీకిన పార్వతి.. అక్షయ్ కు అవని సపోర్ట్..

Brahmamudi Serial Today October 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: డాక్టర్‌ చేత అబద్దం చెప్పించిన కావ్య – నిజం తెలుసుకున్న రాజ్‌  

GudiGantalu Today episode: తాగొచ్చిన బాలు.. ఒక్కొక్కరికి క్లాస్ పీకిన మీనా.. కన్నీళ్లు పెట్టుకున్న బాలు..

Hyper Aadi : నోరు జారి బుక్కయిన ఆది..దీపిక పరువు అడ్డంగా పోయిందిగా..

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు.. మస్ట్ వాచ్..

Gundeninda Gudigantalu Satyam: ‘గుండెనిండా గుడి గంటలు ‘ సత్యం క్యూట్ ఫ్యామిలీ.. బాగా సౌండే..

Nindu Noorella Saavasam Serial Today october 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ శారీ తీసుకున్న మనోహరి – అంతా గమనించిన ఆరు

Big Stories

×