Gundeninda GudiGantalu Today episode September 10th : నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా బాలు వాళ్ళ అత్తగారింటికి తీసుకెళ్తుంది. పార్వతి వాళ్ళింట్లో బాలుని మంచిగా చూసుకుంటారు కానీ శివ ముచ్చట రావడంతో బాలు సీరియస్ అవుతాడు. సుమతి షర్టు బాగుంది బాగా సెట్ అయింది బావ అని అంటుంది. అయితే బామ్మ కూడా బాగుంది అని చెప్పింది అని బాలు అంటాడు. అవును ఇంతకీ షర్టు ఎక్కడ కొన్నారు అని అడుగుతాడు. దానికి పార్వతి మేం కొనలేదండి మా శివ కొన్ని తీసుకొని వచ్చాడు అని పార్వతి అంటుంది. ఆ మాట వినగానే బాలు కోపం పెరుగుతుంది.
అసలు ఎందుకు నువ్వు నాకు చెప్పలేదు అని మీనాపై బాలు సీరియస్ అవుతాడు.. ఈ విషయం మీద కూడా తెలియదు బాబు అని పార్వతి అంటుంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన శివ.. నేను కొంటే ఏమైంది నేను కొనడం వల్ల ఏమైనా తప్పు అయిందా అని అంటాడు. అయితే వీడు కొనడం తెలిస్తే నేను అసలు వేసుకునే వాడినే కాదు కదా అని అంటాడు. ఇప్పుడు నీకు ఉన్నానని తెలిసింది కదా మరి ఎందుకు ఇప్పుడు వేసుకున్నావ్ అని శివ అంటాడు. ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు మీనా అలా పెళ్లి రోజు కోసం అంత ఏర్పాట్లు చేస్తారు. అందంగా ఏంటి నీ రెడీ చేస్తారు. అందరూ మీనా బాలు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే కామాక్షి మీ నాకు గొప్ప అవార్డు ఇవ్వాలి అన్నయ్య అని అంటుంది. ఏంటమ్మా ఎందుకు అని సత్యం అడుగుతాడు. ఏడాది పాటు నీ సాధింపుల్ని భరించింది కదా అని ప్రభావతం అంటుంది కామాక్షి. అది నిజమే నన్ను వెనకాల సాధించి ఉంటే నేనెప్పుడూ రవిని తీసుకుని వెళ్ళిపోయే దానిని శృతి అంటుంది. రోహిణి కూడా అది నిజమే నేను కూడా ఎప్పుడో మనోజ్ తీసుకొని వెళ్ళిపోయేదాన్ని అని అంటుంది. ఇది నా ప్రభావతి నా గురించి మీరు మనసులో ఇంత అనుకుంటున్నారా అని అంటుంది.
అందరూ కూడా మీనా బాలులా అన్యోన్యతను చూసి మురిసిపోతారు. బాలు మీనా రాగానే కామాక్షి మొదటి పెళ్లి రోజు శుభాకాంక్షలు అని అంటుంది. కామాక్షి మాటలకి అందరూ సెటైర్లు వేస్తారు. కామాక్షి మాత్రం మీరు ఇలాంటి ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని అంటుంది. ప్రభావతి సంవత్సరం అంతా సంపాదించింది ఈ ఒక్కరోజు ఖర్చు చేయాలా అని అంటుంది. ఇక అందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే మనోజ్ కేక్ ఎక్కడ రా అని అడుగుతాడు.
ఎంత పావు కిలోన అరకిలోనా అని సంజయ్ అంటాడు. మా మధ్య ఉన్న ప్రేమని తూకం వేసి కలవలేం బావగారు మీరే చూస్తారు గా ఎంత కేకు తెచ్చాము అని అంటారు రవి. అప్పుడే శృతి వాళ్ళ అమ్మ శోభన ఇంట్లోకి వస్తుంది. శోభన రాగానే సంజయ్ కి దిమ్మతిరిగిపోయే షాక్ ఇస్తుంది. మీనాకు తెచ్చిన గాజులను శృతికి గిఫ్టుగా ఇస్తుంది. నాకు బంగారం అంటే అంత మోజు లేదు పిన్ని అని అంటుంది. శోభనకి అడుగడుగునా అవమానం ఎదురవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతానని వెళ్ళిపోతుంది.
Also Read: బిగ్ బాస్ 9 తెలుగు ఫస్ట్ వీక్ ఎలిమినేషన్.. ఆమెను టార్గెట్ చేస్తున్నారా?
సంజయ్ బాలుకి పర్సనల్ డ్రైవర్ గా ఆఫర్ ఇస్తాడు. 50వేల జీతంతో ఆఫర్ ఇస్తాడు కానీ బాలు మాత్రం అంతా పెద్ద ఆఫర్ నాకొద్దు బావగారు నేను ఎవరి దగ్గర పని చేయను అని అంటాడు. సంజయ్ వెళ్లి సోఫాలో కూర్చుంటే అది విరిగి కింద పడిపోతాడు. ఇక తర్వాత బాలు మీ నాన్న అన్యోన్యత గురించి అందరూ గొప్పగా చెప్తారు దాన్ని శృతి వీడియో తీస్తుంది. అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటారు.. అందరూ చెప్పిన మాటలు విని ప్రభావతి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో సంజయ్ కి వార్నింగ్ ఇస్తాడు బాలు. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..