7G Rainbow Colony 2: ..7/G బృందావన కాలనీ.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సృష్టించిన అతి తక్కువ చిత్రాలలో ఈ చిత్రం మొదటి స్థానంలో ఉంటుంది. దశాబ్దాల తెలుగు సినీ చరిత్రలో లెక్కలేనన్ని ప్రేమ కథల కాన్సెప్ట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మధిలో నిలిచిపోతాయి. అలాంటి చిత్రాలలో చెప్పుకోదగ్గ చిత్రమే ఇది. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ (Selva Raghavan) దర్శకత్వం వహించగా.. రవికృష్ణ(Ravikrishna ), సోనియా అగర్వాల్ (Sonia Agarwal) హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కోలీవుడ్ కంటే టాలీవుడ్ లోనే భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు అభిమానుల అభిరుచిని అర్థం చేసుకున్న డైరెక్టర్ ‘7/G బృందావన్ కాలనీ 2’ అంటూ ప్రకటించారు.
రంగంలోకి మలయాళ బ్యూటీ..
ఇక ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయగా.. కొత్త తారాగణంతోనే సీక్వెల్ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ప్రకటించినా.. సమ్మర్ కి ఈ సినిమా రాలేకపోయింది. మరొకవైపు ‘లవ్ టుడే’ ఫేమ్ ఇవానా (Ivana) , కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar ) కూతురు అదితి శంకర్ (Aditi Shankar) ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చినా అందులో నిజం కాలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్ కోసం ఒక యంగ్ బ్యూటీ ని రంగంలోకి దింపినట్లు సమాచారం. ఆమె ఎవరో కాదు ప్రముఖ మలయాళీ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ (Anaswara Rajan).
ఒక్క నిర్ణయం.. కొంపముంచేటట్టుందే..
ఇకపోతే సాధారణంగా ఒక సినిమా హిట్ అయ్యాక ఆ సినిమా సీక్వెల్ రావాలి అంటే, అందులో దాదాపు మొదటి భాగంలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ రెండవ భాగంలో కూడా నటిస్తూ ఉంటారు. కానీ ఈ సినిమాలో తారాగణం మార్చేయడానికి అసలు కారణం తెలియదు కానీ ప్రధానంగా ఆయన భార్య అని తెలుస్తోంది. ఎందుకంటే 7/G బృందావన్ కాలనీ సినిమా షూటింగ్ సమయంలో ఆ సినిమా హీరోయిన్ సోనియా అగర్వాల్ తో ప్రేమలో పడ్డారు సెల్వ రాఘవన్. ఆ ప్రేమ కాస్త 2006లో పెళ్లిగా మారింది. ఇక ఏమైందో తెలియదు కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2009 ఆగస్టు 9న చెన్నైలోని కుటుంబ న్యాయస్థానంలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. తర్వాత 2011 జూన్ 19న తమిళనాడు మాజీ అడ్వకేట్ జనరల్ పిఎస్ రామన్ కూతురైన గీతాంజలిని వివాహం చేసుకున్నారు సెల్వ రాఘవన్. ఇకపోతే తన భార్య మొదటి సినిమాలో నటించగా.. మళ్లీ సీక్వెల్ లో ఆమెను రంగంలోకి దింపడం ఇష్టం లేక సెల్వ రాఘవన్ పూర్తి తారాగణాన్ని మార్చేశారనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే 7/g బృందావన్ కాలనీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆ పాత్రలో సోనియా అగర్వాల్ ను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేని పరిస్థితికి అభిమానులు వచ్చేశారు. ఇలాంటి సమయంలో కొత్త హీరోయిన్ అంటే యాక్సెప్ట్ చేస్తారా? ఒక మంచి సినిమాను తన నిర్ణయంతో కొంప ముంచేటట్టు ఉన్నారే.. అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ALSO READ; Film industry: సరికొత్త రికార్డు.. 555సార్లు రీరిలీజ్.. 30ఏళ్ల నాటి మూవీ విశేషాలు..!
ఎవరీ అనస్వర రాజన్ ?
అనస్వర రాజన్ విషయానికి వస్తే.. 2002 సెప్టెంబర్ 8న కేరళ కరివెల్లూరులో జన్మించింది.2017 లో వచ్చిన ‘ఉదాహరణం సుజాత’ అనే సినిమాలో అతిరా కృష్ణన్ పాత్రలో నటించి, వెండితెరకు పరిచయమైంది. ఇక తర్వాత 2019లో వచ్చిన ‘తన్నీర్ మథన్ దినంగల్’ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమా ఈమెకు మంచి పేరు అందించింది. అంతేకాదు ‘యారియన్ 2’ సినిమాతో హిందీలో కూడా అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు 7/G బృందావన కాలనీ 2 లో కూడా అవకాశాన్ని అందుకుంది. మరి ఇక్కడ తన నటనతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.