Intinti Ramayanam Today Episode September 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి భరత్ ను ఎలాగైన తనవైపు తిప్పుకోవాలని అనుకుంటుంది. కావాలనే భరత్ తో మాట్లాడుతుంది. నువ్వు అవునన్నా కాదన్నా మా ఇంటి అల్లుడువి ఖచ్చితంగా నీకు మేము సేవలు చెయ్యాలి. శ్రీయ అన్న మాటలకు అస్సలు ఫీల్ అవ్వకు అని అంటుంది. నాకు బ్రదర్ లేడు. నువ్వు నా కు తమ్ముడు లాంటిదే నువ్వు ఏమీ బాధపడకు. నీకేం కావాలన్నా నేను చేసి పెడతాను అని పల్లవి అంటుంది. పల్లవి మాటకి భరత్ మెల్ట్ అయిపోతాడు.. పల్లవి భరతు నా మాట వింటున్నాడు ఇక నా దారిలోకి వచ్చినట్లే అని అంటుంది. అవని నీ దెబ్బ కొట్టాలంటే భరత్ నువ్వు ఆయుధంగా వాడుకోవలేని అనుకుంటుంది. పార్వతిని ఇంటికి తీసుకొచ్చిన అవని శ్రేయని శ్రీకర్ని పిలుస్తుంది.. అత్తయ్య గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడతావా కొంచమైనా నీకు బుద్ధుందా? చదువుకున్న దానివేగా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది.శ్రీయా మారడానికి కారణం నువ్వే అని పల్లవి పై సీరియస్ అవుతుంది అవని.. భరత్ పల్లవి అక్కని ఏమీ అనొద్దు అని అడ్డుపడతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పార్వతితో వచ్చిన అవని అందరికి దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది. అత్తయ్య గారిని పెద్ద చిన్న లేకుండా మాటలు అంటే నేను అసలు ఊరుకోను. నోటికొచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదు అని పల్లవి అంటుంది. అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది అవని. అయితే శ్రీకర్తో మాట్లాడాలని బయటికి పిలుస్తుంది.. అక్కడికి వచ్చిన శ్రీకర్ నా భార్య అలా మాట్లాడడం తప్పేమీ కాదు కదా అని అవినీకి షాక్ ఇస్తాడు. అయితే అవని ఇంటికి వచ్చి ఆరాధ్యతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అక్షయ్ ఆరాధ్యకు చాక్లెట్లు స్వీట్లు అన్ని చాలా తెచ్చిస్తాడు. నీకు జీతం వచ్చిందని నాకు ఇచ్చావు మరి మమ్మీకి ఏం తెచ్చావని అడుగుతుంది..
మీ మమ్మీకి ఇవ్వాల్సింది వేరేది ఉంది అని అక్షయ్ ఉన్న డబ్బులను అవనికి ఇస్తాడు. లాస్ట్ ఉన్న దానికి ఇప్పుడున్న దానికి ఇదిగో మనీ అని ఇస్తాడు. మీకు అన్నిటికీ డబ్బులను వెలకట్టడం సరదా అయిపోయింది. మీరు ఇచ్చిన నేను తీసుకొని రండి అని అవని అంటుంది. ఆరాధ్య మమ్మీకి డబ్బులు కాకుండా ఈ చాక్లెట్స్ ఇవ్వండి నాన్న అని అంటుంది. కానీ అక్షయ మాత్రం ఇవ్వాల్సినవి ఇచ్చేసాను ఇంకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటాడు.
రాజేంద్రప్రసాద్ హాస్పిటల్ కి వెళ్లి అన్ని టెస్టులు చేయించుకుంటాడు. అయితే డాక్టరు మీరు అన్ని రెగ్యులర్ గా చేస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి సమస్య లేదని అంటుంది.. అప్పుడే పార్వతి జ్వరం అని హాస్పిటల్ కి వస్తుంది. అక్కడే ఉన్న రాజేందర్ ప్రసాద్ పార్వతిని చూసి ఏంటి పార్వతి ఏమైంది ఇలా వచ్చావ్ ఏంటి అని అడుగుతాడు. నాకు జ్వరం ఉంది అండి అందుకే చూపిచ్చుకుందామని ఇలా వచ్చాను అని అంటుంది. అవునా రా వెళ్లి డాక్టర్ని కలుద్దామని ఇద్దరు కలిసి డాక్టర్ని కలుస్తారు అన్ని టెస్టు చేసిన డాక్టర్ ఈమెకి జ్వరము అన్నిటికన్నా మనోవేదన ఎక్కువగా ఉన్నట్లు ఉంది అని చెప్తుంది.
Also Read: గ్రాండ్ గా మీనా, బాలు పెళ్లిరోజు వేడుక.. సంజయ్ అదిరిపోయే ఆఫర్.. ట్విస్ట్ అదిరింది..
రాజేంద్రప్రసాద్ పార్వతిని అన్ని అడుగుతాడు.. ఇంట్లో జరుగుతున్న వాటి గురించి పార్వతి రాజేంద్రప్రసాద్ తో చెబుతుంది. అవినీకి ఫోన్ చేసిన రాజేంద్రప్రసాద్ నేను ఇవాల్టికి అత్తయ్యతో పార్టీ అక్కడికి వెళ్తాను అమ్మని అంటాడు. ఏదైనా సమస్య ఉంటే చెప్పండి మావయ్య గారు నేను వస్తాను అని అంటుంది అవని.. ఏ సమస్య లేదు నేను చూసుకుంటాను రేపు వస్తాను అని అంటాడు. రాజేంద్రప్రసాద్ పార్వతి తో కలిసి ఇంటికి వెళ్తాడు అక్కడ కమల్ అందరినీ తిడతాడు. ఇంతమంది ఉన్నారు అమ్మని ఒంటరిగా ఎందుకు హాస్పిటల్ కి పంపించారు అని అంటాడు. కానీ ఎవరు ఏం మాట్లాడుకున్నారంటే రాజేంద్రప్రసాద్ నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని అంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..