Illu Illalu Pillalu Today Episode may 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. ఆనందరావు రావు ఇడ్లీలు తీసుకొని ఆ సెంటర్లో పెట్టి అమ్ముతూ ఉంటాడు.. నర్మదా అతని చూసి సాగర్ ని బైక్ ఆఫ్ అని చెప్తుంది. వీళ్ళని చూసిన ఆనందరావు అక్కడి నుంచి పక్కకు వెళ్లి దాక్కుంటాడు. నర్మదా కు మాత్రం అనుమానం ఉంటుంది. ఆ మాట నువ్వు ఎందుకు నమ్మవు సాగర్ అని వాళ్ళిద్దరూ కాసేపు గొడవపడతారు. ఇది నిజమో కాదో తెలుసుకోవాలంటే మన వాళ్ళ ఇంటికి వెళ్లాలని వాళ్ళిద్దరు బండిపై వెళ్ళిపోతారు. ఆనందరావు కూడా ఈ విషయం బయట పడితే నా పరిస్థితి అంతేనని పరిగెత్తుకుంటూ వెళ్తాడు.. నర్మదా వాళ్ళు మాత్రం ఆనందరావు గురించి తెలుసుకోవాలని శ్రీవల్లి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళని చూసినా ఆనందరావు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లిపోతాడు.. శ్రీవల్లి వాళ్ళ ఫ్యామిలీ భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక్కడ భాగ్యం బాగా ఏర్పాటు చేసి ఉండడంతో అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు.. ఇక శ్రీవల్లి వాళ్ళ అమ్మని కౌగిలించుకుంటుంది. బంగారం తెచ్చావు కదా అమ్మడు అనగానే తీసుకొచ్చానమ్మా అనేసి అంటుంది. అమ్మోయ్ నువ్వు చాలా గ్రేట్ ఇంత బాగా డెకరేట్ చేసావ్ ఏంటి అని శ్రీవల్లి భాగ్యం ని అడుగుతుంది. అయితే వెంటనే మనం తీసుకున్నాం కదా అది అలా కలిసి వచ్చేసింది అని చెప్తుంది. ప్రేమను పని మనిషి చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. భాగ్యం ప్రేమను పనిమనిషి చేస్తుంది.. అది చూసిన ధీరజ్ ప్రేమ నువ్వేంటి పని చేస్తున్నావని అడుగుతాడు. నేనే చెప్పాను బాయ్ కాఫీ గచ్చు మీద పడింది ఇంట్లో ఎవరూ చూడడానికి లేరు. ఎండిపోయే చండాలంగా తయారవుతుందని నేనే చెప్పాను అని భాగ్యం అంటుంది. నా భార్య ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా అపురూపంగా చూసుకున్నారు. కాలిని కింద పెట్టనివ్వకుండా మహారాణి లాగా పెంచారు. నేను కూడా నా భార్యని మా ఇంట్లో అలానే చూసుకుంటున్నాను. ఇలాంటి పనులన్నీ తనకు రాబోతున్న చేయదు అని భాగ్యంకి షాక్ ఇస్తాడు ధీరజ్. అయితే ఇది ఎవరు చేస్తారు ఇటు ఇవ్వండి నేనే చేసుకుంటాను అని భాగ్యం అంటుంది. దానికి నేను చేస్తానని మొత్తం చేస్తాడు.
భార్య మీద ఎంత ప్రేమ.. భార్యను ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమయిపోయింది అని భాగ్యం అనుకుంటుంది. ఇక అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే నర్మదా సాగర్ లో ఇంట్లోకి వస్తారు.. ఆనంద్ రావు కోసం ఇల్లంతా వెతుకుతారు. నేను ముందే చెప్పానా అక్కడ ఇడ్లీలు అన్నది ఈయనే.. అదేంటో ఇప్పుడే నేను తెలుస్తాను పదండి అని నర్మదా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్లి ఆనంద్ రావు కోసం వెతుకుతుంది. కానీ ఆయన ఎక్కడ కనిపించకపోవడంతో భాగ్యంతో బాబాయ్ ఎక్కడ పిన్ని అని అడుగుతుంది.
అదేంటమ్మా అలా అడిగావు అని భాగ్యం షాక్ అవుతుంది. ఇంట్లో నల్లపూసలు గుచ్చుతున్న సమయంలో బాబాయి ఇంట్లో కనిపించకపోతే అడిగాను లే పిన్ని ఎక్కడున్నాడు బాబాయి అని నర్మదా అడుగుతుంది. పైన రెడీ అవుతున్నాడు వస్తాడులే అని అంటుంది. ఏదో ఒకసారి పిలవండి అని నర్మదా అంటుంది. భాగ్యం తమ బండారం బయటపడిందని ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అయ్యో ఆయన ఏదో బిజినెస్ పని ఉందని బయటికి వెళ్లాడు కదా వస్తాన్లే ఇలా వెళ్లి అలా వచ్చేస్తాడని ఏదో మేనేజ్ చేస్తుంది.. అయితే బాబాయ్ కి ఒకసారి వీడియో కాల్ చేయండి మాట్లాడాలి అనిపిస్తుంది అని నర్మదా అంటుంది. ఆ మాట వినగానే భాగ్యంకు నోట మాట రాదు. టెన్షన్ పడిపోతుంది..
అప్పుడే పైనుంచి ఆనంద్ రావు కిందకి వస్తాడు. ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను ఆవిడకి రండి అంటూ కిందకి రాగానే అడుగుతాడు. ఏమైంది ఎందుకు ఇలా డౌట్ గా అడుగుతుంది అని భాగ్యం ఆనందరావు అని అడుగుతుంది. నేను ఇడ్లీలు అమ్ముతుంటే ఈ అమ్మాయి చూసింది. అందుకే బేగిన వచ్చేసాను అని అంటాడు.. మీరు మా దగ్గర ఏదైనా విషయం రాస్తున్నారా అని నర్మదా అడుగుతుంది. మీ దగ్గర చాలా పెద్ద విషయం రాస్తున్నాను. మీ అందరికీ భోజనాలు చేశాను తినేసి వెళ్లాల్సిందే అని భాగ్యం అంటుంది.
ఇక నల్లపూసల గుచ్చే కార్యక్రమానికి టైం అయిందని అక్కడికి వెళ్లి పూజ చేయాలని భాగ్యం అందర్నీ పూజ గదిలోకి తీసుకెళ్తుంది.. అందరూ సరదాగా కూర్చొని నల్లపూసలు వేస్తూ ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.