E-Paper
Advertisement

Brahmamudi Serial Today May 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యను ఆపేందుకు రుద్రాణి ప్లాన్‌ – రుద్రాణికి ఇందిరాదేవి షాక్‌  

Brahmamudi Serial Today May 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యను ఆపేందుకు రుద్రాణి ప్లాన్‌ – రుద్రాణికి ఇందిరాదేవి షాక్‌  
Advertisement

Brahmamudi serial today Episode:  యామిని, కావ్యకు ఫోన్‌ చేసి వార్నింగ్‌ ఇద్దామనుకుంటే.. కావ్యనే వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో యామిని షాక్‌ అవుతుంది. తర్వాత కావ్య సూట్‌కేసు తీసుకుని కిందకు వచ్చి అత్తయ్యా ఫంక్షన్‌ ఉందని చెప్పాను కదా వెళ్తున్నాను అని అపర్ణకు చెప్పగాగనే.. సరేమ్మా జాగ్రత్తగా వెళ్లిరా అంటుంది. దీంతో రుద్రాణి వాహ్‌ అద్బుతం మహా అద్బుతం.. మొగుడు కనిపించకపోతే బాధపడాలి. చచ్చిపోయాడని తెలిస్తే ఏడవాలి. కానీ ఈ ఇంట్లో మాత్రం మొత్తం రివర్స్‌ గా ఉంది. కోడలేమో అసలు దిగులు లేకుండా పార్టీలు, ఫంక్షన్లు అని తిరుగుతుంది. ఇంట్లో వాళ్లేమో ఈజీగా పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది.

ఇంతలో ఇందిరాదేవి అది వెళ్లే నీకు వచ్చే ప్రాబ్లమ్‌ ఏంటి? అని అడుగుతుంది. దీంతో రుద్రాణి ఫంక్షన్లు, పార్టీలు అని వెళ్తే.. అక్కడ మొగుడు ఏమయ్యాడు అని అడిగితే అప్పుడు నిజం చెప్పాలి కదా..? నిజం చెబితే పోయేది మన కుటుంబం పరువే కదా లేదంటే ఏదైనా గోల్డ్‌ మెడల్‌ సాధించడానికి వెళ్తుందా..? అంటుంది. ఇందిరాదేవి అవునే అది గోల్డ్‌ మెడల్‌ సాధించడానికే వెళ్తుంది అని చెప్తుది. అపర్ణ మాత్రం నువ్వు అవేవీ పట్టించుకోకు హ్యాపీగా వెళ్లిరా అని చెప్తుంది. ఇంతలో కావ్యకు రాజ్‌ ఫోన్‌ చేస్తుంటాడు. సరే అత్తయ్యా మామయ్య, బామ్మ వెళ్లి వస్తాను అంటూ కావ్య వెళ్లిపోతుంది.

Advertisement

కావ్య బయటకు వెళ్లి  లాన్‌లో నిలబడి రాజ్‌తో ఫోన్‌ మాట్లాడుతుంది. ఇంతలో రుద్రాణి, రాహుల్‌ వస్తారు. ఏదో రకంగా చూస్తుంటే.. వీళ్లేంటి ఇలా చూస్తున్నారు. నా మాటలు విన్నట్టా.. విననట్టా అని మనసులో అనుకుని కావ్య ఎంటి అలా చూస్తున్నారు అని అడుగుతుంది. దీంతో రుద్రాణి నువ్వేంటి అలా అనుమానాస్పదంగా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. నాకేం అంత కర్మ పట్టలేదు. నా ఫ్రెండ్స్‌ తో కలిసి పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నా అంటుంది. దీంతో రాహుల్‌ అదేంటి కావ్యకు పార్టీ కల్చర్‌ పడదు కదా అంటాడు. దీంతో కావ్య చీరలు కట్టిన వారు చీర్స్‌ కొట్టకూడదని ఎక్కడైనా ఉందా..? ఏదో దుగ్గిరాల కుటుంబానికి కోడలిగా వచ్చాను కదాని నాలో వెస్ట్రన్‌ కావ్యను దాచేసి  లోకల్‌ కావ్యను చూపించాను. ఇక ఈరోజు నుంచి అలా ఉండకూడదని నా ఫ్రెండ్స్‌తో గెట్‌ టు గెదర్‌ పార్టీ ఏర్పాటు చేసుకున్న ఫుల్‌ ఎంజాయ్‌ చేసి వస్తాను అంటూ కావ్య వెళ్లిపోతుంది. అది ఎక్కడికి వెళ్తుందో ఏంటో గట్టిగా తెలుసుకో రా రాహుల్‌ అంటూ రుద్రాణి చెప్తుంది.

తర్వాత రాజ్‌, కావ్య కారుల వెళ్తుంటారు. రిసార్ట్‌ నుంచి తిరిగి వచ్చే లోపు కళావతి మనసులో ఏముందో తెలుసుకోవాలి అని రాజ్‌ మనసులో అనుకుంటే.. రిసార్ట్‌  నుంచి తిరిగి వచ్చే లోపు ఏ ప్రమాదం జరగకుండా ఆయనకు గతం గుర్తు రావాలి దేవుడా అని మనసులోనే అనుకుంటుంది. మరోవైపు రుద్రాణి, రాహుల్‌ గట్టిగా ఆలోచిస్తూ కావ్య ఎక్కడికి వెళ్లింది తెలుసుకోవాలని ఆలోచిస్తుంటారు. ఇంతలో స్వప్న వచ్చి పాపను రుద్రాణి చేతిలో పెడుతుంది. మీరు పాపకు తలంటు స్నానం చేయించండి.. ఏవండి మీరు బట్టలు వేయండి అని చెప్తుంది. దీంతో రాహుల్‌ మరి నువ్వేం చేస్తావు అంటాడు. నాకంటూ పర్సనల్‌ లైఫ్‌ ఉండదా..? అప్పుడప్నుడు మీరు నాన్నమ్మ అయ్యారని గుర్తు చేసుకోండి అత్తయ్యా అంటూ స్వప్న వెళ్లిపోతుంది. పాప ఏడుస్తుంది. ఏయ్‌ ఏడుపు ఆపవే.. నేనే నలుగురిని ఏడిపిస్తాను.. నువ్వు నన్ను ఏడిపిస్తున్నావా..? అంటుంది. ఇంతలో రాహుల్‌ మమ్మీ కావ్య ఎక్కడికి వెళ్లిందో తెలుసుకునే ప్లాన్‌ దొరికింది అని చెప్తాడు. ఎలా అని రుద్రాణి అడగ్గానే.. ఇదిగో స్వప్న ఫోన్‌ కొట్టేశాను. అందులో ఇద్దరి కామన్‌ ఫ్రెండ్‌ నెంబర్‌ ఉంటుంది కదా వాళ్లకు ఫోన్‌ చేస్తే తెలిసిపోతుంది అని చెప్తాడు.

Advertisement

రిసార్ట్స్‌ దగ్గర కళ్యాణ్‌, అప్పు వాళ్ల ఫ్రెండ్స్‌కు రాజ్‌ గురించి నిజం చెప్తాడు. అందరూ షాక్‌ అవుతారు. అక్కడికి వచ్చిన శృతి మాత్రం  హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో మిగతా ఫ్రెండ్స్‌ వచ్చి రాజ్‌ గురించి మాట్లాడుకుంటూ మందు తాగుతూ కామెడీ చేస్తారు. వాళ్లను చూసిన అప్పు అనుమానంగా కూచి వీళ్లను నమ్మి బావగారిని  వీళ్ల చేతుల్లో పెడితే సేఫే అంటావా..? అని అడుగుతుంది. దీంతో ఫ్రెండ్స్‌ కదా అలాగే ఉంటారు. చచ్చేంత ప్రేమిస్తారు. చంపేంత పని చేస్తారు. ప్రాణాల మీదకు వస్తే మాత్రం అందరికంటే ముందుంటారు అని కళ్యాణ్‌ చెప్తాడు. దీంతో అప్పు బాధగా మందు అంటున్నారు.. స్మోక్‌ అంటున్నారు. బావగారికి ఏ ప్రమాదం రాకుండా గతం గుర్తుకు రావడం ముఖ్యం  అంటుంది. ఇంతలో శ్వేత వస్తుంది. అప్పుకు శ్వేతను పరిచయం చేస్తాడు కళ్యాణ్‌.  ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×