Allu Arjun:ఇప్పట్లో సిక్స్ ప్యాక్ అంటే సహజమైపోయింది కానీ అప్పట్లో సిక్స్ ప్యాక్ కి ఉండే క్రేజ్ వేరు అని చెప్పాలి. చాలామంది హీరోలు ఈ సిక్స్ ప్యాక్ లు ట్రై చేసినా వారి వల్ల కాలేదు. ఇక తెలుగుకి ముఖ్యంగా ఆ సిక్స్ ప్యాక్ ట్రెండ్ ను తీసుకొచ్చింది. ఆ ఘనత మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కే సాధ్యం అని చెప్పవచ్చు. ‘దేశముదురు’ సినిమాలో బన్నీ సిక్స్ ప్యాక్ తో కనిపించి,అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచారు. అమ్మాయిలైతే అల్లు అర్జున్ (Allu Arjun) ఆరు పలకల దేహానికి ఫిదా అయిపోయారు. ముఖ్యంగా తమకు కాబోయే భర్తకు కూడా ఇలాగే ఉండాలి అని ఎన్నో కలలు కూడా కన్నారు.. అలా అమ్మాయిలలో బన్నీ పాపులారిటీ సొంతం చేసుకోవడం జరిగింది. ఈ సినిమా తర్వాత ఎంతోమంది తెలుగు హీరోలు కూడా ఇదే ట్రెండ్ ను ఫాలో అవ్వడం జరిగింది.
ఆమె చేసిన అవమానం.. అదే ట్రెండ్ గా మార్చేశా..
అయితే బన్నీ ఇలా ఆరు పలకల దేహాన్ని ట్రై చేయడం వెనుక అసలు విషయాన్ని ఇన్నాళ్లకు బయట పెట్టారు బన్నీ. ఇటీవల జరిగిన ‘వేవ్స్ సదస్సు -2025’ లో బన్నీ ఈ ట్రెండ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు పంచుకున్నారు. బన్నీ మాట్లాడుతూ.. “20 సంవత్సరాల క్రితం దక్షిణాది పరిశ్రమలో ఏ ఒక్క నటుడు చేయని సాహసం నేను చేసి చూపించాను. మన వల్ల కాదు అన్న పనిని చేసి చూపిస్తేనే కదా అసలైన కిక్.అయితే ఆ సిక్స్ ప్యాక్ ట్రై చేయడానికి ఒక హీరోయినే కారణం. తను నాతో ఒక సినిమా కూడా చేసింది. సౌత్ లో ఎవరూ సిక్స్ ప్యాక్ చేయలేరు అని కామెంట్ చేయడంతో అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను. ముఖ్యంగా ఆమె మాట్లాడిన మాటలు నచ్చక ఎలాగైనా సరే దీనిని ఛాలెంజిగా తీసుకోవాలనుకున్నాను. అదే తడువు కొన్ని రోజుల్లోనే సిక్స్ ప్యాక్ చేసి దక్షిణాది హీరోలంటే ఏంటో చూపించాను” అంటూ బన్నీ చెప్పుకొచ్చారు. అయితే ఆ హీరోయిన్ ఎవరు అన్న విషయంపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.
అల్లు అర్జున్ సినిమాలు..
అల్లు అర్జున్ సినిమాల విషయానికే వస్తే.. తన మేనమామ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్ఫూర్తితో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. దేశముదురు చిత్రంలో తొలిసారి సిక్స్ ప్యాక్ బాడీతో అందరినీ ఆకట్టుకున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హన్సిక హీరోయిన్గా నటించింది. చక్రి సంగీతం అందించిన ఈ సినిమా 2007 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బన్నీ ఆ తర్వాత పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. అంతేకాదు ఈ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మొట్టమొదటి నేషనల్ అవార్డు అందుకున్న హీరోగా కూడా రికార్డు సృష్టించారు. ఇక ఇప్పుడు పుష్ప2 తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఈయన, ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో హాలీవుడ్ రేంజ్ లో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో ఆస్కార్ రావడం ఖాయమని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.