E-Paper
Advertisement

Hyderabad News: మంచినీటితో కారు క్లీనింగ్.. జలమండలి ఎండీ సీరియస్, ఆపై భారీ జరిమానా

Hyderabad News: మంచినీటితో కారు క్లీనింగ్.. జలమండలి ఎండీ సీరియస్, ఆపై భారీ జరిమానా
Advertisement

Hyderabad News: హైదరాబాద్ వాసులపై జలమండలి ఓ కన్నేసింది. సరఫరా చేసే తాగు నీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తున్నట్లు ఈ మధ్యకాలంలో ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తికి అధికారులు జరిమానా విధించారు. బంజారాహిల్స్ ప్రాంతంలో ఈ ఘటన లో చోటుచేసుకుంది. అసలేం జరిగింది.

హైదరాబాద్‌లో మంచినీటితో కారు క్లీనింగ్

Advertisement

తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించిన ఓ వ్యక్తిపై అధికారులు కొరడా ఝలిపించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌ మహానగర మంచినీటి సరఫరా ఎండీ అశోక్‌ రెడ్డి మంగళవారం బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 12లో రహదారిపై వెళ్తున్నారు. అయితే ఓ వ్యక్తి మంచి నీటితో వాహనాన్ని కడుగుతున్నాడు.

దీన్ని గమనించారు వాటర్ బోర్డు ఎండీ. కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించవద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ వ్యక్తికి జరిమానా వేయాలని సంబంధిత మేనేజర్‌ని ఆదేశించారు. అంతేకాదు సంబంధిత వ్యక్తికి వాటర్ బోర్డు అధికారులు నోటీసు ఇచ్చారు.  ఎండీ ఆదేశాల మేరకు ఆ వ్యక్తికి పదివేల రూపాయల జరిమానా విధించారు అధికారులు.

Advertisement

వాహనదారుడికి రూ.10 వేలు జరిమానా

నగరాల్లో నీటి డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా పౌరులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. నీటిని సంరక్షించాలని, దుర్వినియోగాన్ని ఎట్టి పరిస్థితిలోనూ సహించబోము తేల్చి చెప్పింది వాటర్ బోర్డు.  జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించద్ధని ఈ సందర్భంగా ఎండీ అశోక్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో కూడా బంజరాహిల్స్‌లో ఓ వ్యక్తి తన బైక్‌ని మంచినీటితో వాహనాన్ని కడిగాడు. ఈ విషయం కూడా ఎండీ దృష్టిలో పడింది. ఆ వ్యక్తికి జరిమానా విధించిన సంగతి తెల్సిందే.

ALSO READ: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్

ఈ వ్యవహారంపై జలమండలి అధికారులు ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. తాగునీటితో కారును కడుగుతున్న ఫొటో, జరిమానా విధించిన రసీదును పోస్టు చేశారు. హైదరాబాద్ పరిధిలో ఈ తరహా ఘటనలు చాలానే జరుగుతున్నాయి. గల్లీలో అయితే మరీ దారుణం.  వాటర్ రాగానే తొలుత వాహనాలను కడుగుతున్న సందర్భాలు నిత్యంగా కనిపిస్తున్నాయి. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన సందర్భం లేదని అంటున్నారు స్థానికులు.

 

Related News

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×