BigTV English

Intinti Ramayanam Today Episode: రాజేంద్రప్రసాద్ కు తెలిసిన నిజం.. అవని, అక్షయ్ మధ్య పెరిగిన దూరం..

Intinti Ramayanam Today Episode: రాజేంద్రప్రసాద్ కు తెలిసిన నిజం.. అవని, అక్షయ్ మధ్య పెరిగిన దూరం..

Intinti Ramayanam Today Episode April 28th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని ఎంత చెప్తున్నా వినకుండా ఆ ప్రశాంత్ మాటలను నమ్మి అందరూ అవనిని ఛీ కొట్టి వెళ్ళిపోతారు. అవని ఇలాంటి మోసం చేస్తుందని అసలు ఊహించలేదంటూ అందరూ బాధపడుతూ ఉంటారు. రాజేంద్రప్రసాద్ కు శ్రియా అవినీ అక్క ఇలా చేస్తుందని అసలు ఊహించలేదు మామయ్య అంటూ తన మనసులోని కక్షను బయట పెట్టేస్తుంది. ఇక భానుమతి కూడా అవని దరిద్రం పోయిందనుకుంటే బయటి ఉండి మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది అంటూ రాజేంద్రప్రసాద్ ని నువ్వేం బాధపడకురా ఎంతవరకు వెళుతుందో అంతవరకు వెళ్ళని మన చేతుల్లో ఏమీ లేదు కదా అనేసి అంటుంది. కూతురికి ఇంత జరిగితే మావయ్య గారు బాధపడుతున్నారు. ఆయన చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుందని శ్రీయా అంటుంది. భానుమతి కూడా అవనీని ఇంట్లోంచి పంపించిన తర్వాత ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుందని అనుకున్నాము. కానీ ఇన్ని కష్టాలు పెడుతుందని అసలు ఊహించలేదని అంటుంది. పల్లవి ప్లాన్ సక్సెస్ అయ్యింది.. అవని పల్లవి ప్లాన్ లో అడ్డంగా ఇరుక్కుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంటికి వాళ్లంతా రాజేంద్ర ప్రసాద్ కు నిజం చెప్పి బాధ పడతారు. అక్షయ్ కూడా ఆ ప్రశాంత చెప్పిన మాటలు నమ్మి అవని పై ద్వేషాన్ని పెంచుకుంటాడు. ఆ అవని ఎంత మోసం చేయాలని చూసినా కూడా ప్రణతి అవనిని గుడ్డిగా నమ్మేస్తుంది. మనం ఇప్పుడు ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో లేదు. ప్రతిరోజు పోతే తనే అర్థం చేసుకొని రియలైజ్ అవుతుంది అప్పుడు వెళ్లి తీసుకు వస్తాను నాన్న అని అక్షయ్ అంటాడు. అవని చేసింది దానికి నన్ను క్షమించండి నాన్న అని అక్షయ్ అనగానే రాజేంద్రప్రసాద్ మీరంతా ఆ ప్రశాంత్ మాటలు నమ్ముతున్నారా అని అడుగుతాడు. వాడు చూపించిన ఆధారాలు అలా ఉన్నాయి మావయ్య అవని అక్క ఇదంతా చేసిందని అక్కడ తెలిసిపోయింది అని పల్లవి అంటుంది.

ఇక రాజేంద్రప్రసాద్ వాడు చెప్పేది అబద్ధమని నేను అంటున్నానని రాజేంద్రప్రసాద్ అందరికీ షాక్ ఇస్తాడు. అవని ఎలాంటిదో నాకు తెలుసు ఇన్ని రోజులు నేను కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించానని చాలా బాధపడ్డాను. మన అమ్మాయిని మోసం చేసి వెళ్లిపోయిన వాడి మాటలు మీరు నమ్ముతున్నారు తప్ప మన ఇంట్లో ఇన్నేళ్లు ఉన్న అవని నేను ఎందుకు నమ్మట్లేదని అందరికీ క్లాస్ పీకుతాడు. అవని నిజంగానే తప్పు చేసింది నాన్న మీకు అర్థం కావట్లేదు అని అక్షయ్ కూడా అంటాడు. అసలు నిజా నిజాలు ఏంటో తెలుసుకోకుండా నేను ఒకరిపై నిందలు వేయను అని రాజేంద్రప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..


తర్వాత రోజు రాజేంద్రప్రసాద్ గుడికి వెళ్తాడు. అక్కడికి అవని ప్రణతి వస్తారు. ప్రణతిని చూసి రాజేంద్ర ప్రసాద్ ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోలేకపోతున్నాను అని బాధపడతాడు. ఆ ప్రశాంత్ చెప్పింది అబద్ధం నానా వదినకు నా ఫోన్లో ఫోటో చూపించి అడ్రస్ ఇచ్చేంతవరకు వాడి గురించి తెలియదు. వాడు నన్నే కాదు ఇంతకుముందు చాలా మందిని మోసం చేశాడు. వదిన ఏ తప్పు చేయలేదు నాన్న అని ప్రణతి అంటుంది. అవని కూడా గుడిలో దేవుడి దగ్గర నేను అబద్ధం చెప్పను మామయ్య గారు వాడు ఎలాంటి వాడో వాడి గురించి తెలుసుకున్న తర్వాతే మీరు నమ్మండి అని అంటుంది. అందరూ కలిసి ప్రశాంత్ ఉన్న ఇంటి దగ్గరికి వెళ్తారు అప్పటికే అక్కడ ఇంటి ఓనరు ఒక అమ్మాయి పైన అరుస్తాడు. అతని గురించి నిజం తెలుసుకున్న రాజేంద్రప్రసాద్ ఏం చేయాలో అర్థం కావట్లేదని బాధపడుతూ వెళ్ళిపోతాడు.

అవని రెడీ అయ్యి స్కూల్ కి వెళ్తుంది. అప్పటికే పల్లవి ఆరాధ్యకు అన్నం తినిపించడానికి వచ్చి ఉంటుంది. ఆరాధ్య పల్లవి అన్నం పెడుతుంటే నాకు వద్దు నేను తినను అని అంటుంది. ఆరాధ్య పై పల్లవి సీరియస్ అవుతుంది. అక్కడికి వచ్చిన ఆవని నా కూతురికి అన్నం తినిపించే హక్కు నీకు ఎవరు ఇచ్చారు నువ్వు పెడితే నా కూతురు అన్నం తింటుందా అని ఆరాధ్య ను దగ్గరికి తీసుకుంటుంది. నా కూతురికి నువ్వు అన్నం తినిపించేరా అధికారం నీకు ఎవరు ఇచ్చారు అని పల్లవిని అవని అడగ్గానే అప్పుడు అక్కడికి వచ్చి అక్షయ్ అవని పై సీరియస్ అవుతాడు.

ఆరాధ్య బాధ్యతలని పిన్నిగా పల్లవి చూసుకుంటుంది నేనే అధికారాన్ని ఇచ్చాను నీలాంటి మోసగేత్తులు ఇలా నా కూతురు జీవితంతో ఆడుకుంటే అస్సలు సహించను అని అవనికి వార్నింగ్ ఇస్తాడు.. ఎవరిని చెప్పినా మీరు గుడ్డిగా నమ్మేస్తారు. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని అవని అంటుంది. పల్లవి ఇక ముందు ముందు నీకు వరుస షాక్ లు తగులుతాయని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇప్పుడు ఎపిసోడ్ లో అక్షయ్ అవనికి షాకిస్తూ స్కూల్ ని మార్పిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×