OTT Movie : ఓటీటీలో ఉత్కంఠ భరితంగా సాగిపోయే సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఉన్న కొన్ని హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇందులో వచ్చే ట్విస్ట్ లు మిమ్మల్ని పిచ్చెక్కిస్తుంటాయి. ఈ సైకలాజికల్ థ్రిల్లర్లు, క్రైమ్ మిస్టరీలు అదిరిపోయే ట్విస్ట్ లతో మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ ను ఇస్తాయి. అలాంటి ఉత్కంఠభరితమైన హాలీవుడ్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయి ? IMDb రేటింగ్ ఎంత ? ఆ సినిమాల పేరు ఏంటి ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
షట్టర్ ఐలాండ్ (Shutter Island)
2010 లో వచ్చిన ఈ మూవీకి మార్టిన్ స్కోర్సెస్ దర్శకత్వం వహించారు. ఒక మారుమూల ప్రాంతంలో ఒక రోగి అదృశ్యం అవుతాడు. అతన్ని గుర్తించే అంశం చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ క్లైమాక్స్ ఒక అద్భుతమనే చెప్పుకోవాలి. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ నెట్ ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడయో (Amazon Prime Video)లో ఈ ఇంట్రెస్టింగ్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో దీనికి 8.2 రేటింగ్ ఉంది.
గాన్ గర్ల్ (Gone Girl)
2014 లో వచ్చిన ఈ మూవీకి డేవిడ్ ఫించర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తన భార్య అదృశ్యమైనప్పుడు, భర్త అనుమానితుడిగా మారతాడు. ఉత్కంఠభరితమైన స్టోరీతో ఈమూవీ నడుస్తుంది. చివరి వరకూ సస్పెన్స్ తో టెన్షన్ పెట్టిస్తుంది. నెట్ ఫ్లిక్స్ (Netflix)లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో రేటింగ్ 8.1 ఉంది.
సెవెన్ (Se7en)
1995 వచ్చిన ఈ మూవీకి డేవిడ్ ఫించర్ దర్శకత్వం వహించారు. ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ ఈ మూవీ నడుస్తుంది. అతన్ని పట్టుకోవడానికి పోలీసులకు చుక్కలు కనబడతాయి. భయంకరమైన క్లైమాక్స్ తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. IMDbలో దీనికి 8.6 రేటింగ్ ఉంది.
ది సిక్స్త్ సెన్స్ (The Sixth Sense)
1999లో వచ్చిన ఈ మూవీకి నైట్ శ్యామలన్ దర్శకత్వం వహించారు. ఒక చిన్న బాలుడికి ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. అతనికి ఒక సైకాలజిస్ట్ సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. ఆ తరువాత స్టోరీ ఎన్నో మలుపులు తిరుగుతుంది. జియో హాట్ స్టార్ (Jio Hotstar) లో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఐఎండీబీలో దీనికి 8.2 రేటింగ్ ఉంది.
మెమెంటో (Memento)
2000లో వచ్చిన ఈ మూవీకి క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించారు. ఒక జ్ఞాపక శక్తి కోల్పోయిన వ్యక్తి , తన భార్యని హత్య చేసిన వాడి కోసం వెతికే క్రమంలో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
Read Also : పంప్‌సెట్ దొంగ తెచ్చిన తంటా… జీవిత కాలం వాయిదాలతో కోర్ట్ కేసు … మస్ట్ వాచ్ మలయాళం మూవీ గురూ