E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: రాజేంద్రను తోసేసిన పల్లవి..పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్..రాజేంద్ర పరిస్థితి ఎలా ఉందంటే..?

Intinti Ramayanam Today Episode: రాజేంద్రను తోసేసిన పల్లవి..పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్..రాజేంద్ర పరిస్థితి ఎలా ఉందంటే..?
Advertisement

Intinti Ramayanam Today Episode February 1st : నిన్నటి ఎపిసోడ్ లో.. కోటిలింగం తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ దొరికిందని చాలా సంతోషంగా ఉంటాడు. అయితే అక్కడ ఆ అమ్మాయి తన ఆస్తిని చూసి అతనితో మాట్లాడింది అన్న విషయాన్ని తెలుసుకోలేక పోతాడు.. ఎంత చెప్తున్నా సరే కోటిలింగం మాత్రం ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు.. ఇక అమ్మాయి కూడా తనకు ఎంత ఆస్తి ఉంది అని అడుగుతుంది. నాకు ఆస్తి చాలానే ఉంది అని కోటిలింగం చెప్పగానే వీడు తింగరోడు అనుకున్నాను కానీ ఇంత ఆస్తిపరుడా అని అమ్మాయి అనుకుంటుంది. మొత్తానికి కోటిలింగంకు అమ్మాయి దొరికేసింది. ఆ తర్వాత తనకు అమ్మాయి దొరికిందని చాలా సంతోషంగా ఉంటే..

భానుమతి వచ్చి ఆ అమ్మాయి నిన్ను చూసి ఇష్టపడలేదు రా నీ డబ్బులు చూసి ఇష్టపడుతుందని నిజం చెప్తుంది. భానుమతి ఎంత చెప్తున్నా సరే కోటిలింగం మాత్రం అస్సలు వినడు. తాను నాకోసమే పుట్టింది తనని నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని అంటాడు.. నీ కర్మ రా నీ చావు నువ్వు చావు అని భానుమతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి రాజేంద్రప్రసాద్ తో మాట్లాడాలని అనుకుంటుంది. ఎలాగైనా సరే మామయ్యని ఈరోజు కన్వీన్ చేసి మా నాన్న గురించి అసలు నిజం బయట పెట్టకుండా చేయాలి అని అనుకుంటుంది.. రాజేంద్ర కు ఒక లెటర్ రాసి పంపిస్తుంది. అది చూసిన అతను షాక్ అవుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. పల్లవి గురించి అన్ని నిజాలు తెలుసుకున్న రాజేంద్రప్రసాద్ ఆ మాటని పల్లవితో చెప్పి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తాడు.. ఏంటి ఇలా జరిగింది నా గురించి మాయక్ అంత తెలిసిపోయింది ఇప్పుడు నేనేం చేయాలి అని పల్లవి కంగారు పడిపోతూ ఉంటుంది.. ఇంటి పరువు పోతుంది నీ సొంత చెల్లెలు ప్రాణాలతో ఉండదు అని ఎంత చెప్తున్నా సరే రాజేంద్ర మాత్రం వినడు. నువ్వు చచ్చిపోతానని బెదిరిస్తున్నావు కదా చచ్చిపో నేను మాత్రం ఈ విషయాన్ని కమల్ తో చెప్తాను అని అంటారు.. అయితే పల్లవి రాజేంద్రని ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అవుతుంది.. ఇక పల్లవి రాజేంద్ర నా మాట వినడు అని అనుకుంటుంది.. నువ్వు ఎలాంటి దానివో నువ్వు చేస్తున్న మోసాలు ఏంటో కచ్చితంగా నేను కమల్ తో చెప్తాను అని రాజేంద్ర అంటాడు. పల్లవి మాత్రం ఈ ఫంక్షన్ ఎలాగైనా ఆగిపోవాలి రాజేంద్రని చంపేయాలని అనుకుంటుంది.

రాజేంద్ర కమల్ ని పిలిచి పల్లవి గురించి అసలు విషయాన్ని చెప్పాలని అనుకుంటాడు.. ఈ క్రమంలో పల్లవి ఎలాగైనా సరే ఈ విషయాన్ని చెప్పకుండా ఆపాలని అనుకుంటుంది.. పైన చివరి వరకు నిలబడుకున్న రాజేంద్రను తోసేస్తుంది.. ఎవరో పడిపోయారు అని అందరూ అక్కడికి వెళ్లి చూడగా రాజేంద్ర కింద పడి ఉంటాడు.. ఒక్కసారిగా అందరూ ఆ స్థితిలో రాజేంద్రని చూసి షాక్ అవుతారు.. అసలు ఇకనుంచి మావయ్య గారు ఎలా పడిపోయారు అని అవని కంగారు పడిపోతూ ఉంటుంది.. ఇక వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు..

Advertisement

అలా పడిపోయిన రాజేంద్రుడు చూసి ఇంట్లోని వాళ్ళందరూ కంగారు పడిపోతూ దేవున్ని ప్రార్థిస్తూ ఉంటారు.. అయితే అప్పుడు వచ్చిన డాక్టర్ అతని పరిస్థితి క్రిటికల్ గా ఉంది ఏమి చెప్పలేము అని అంటారు.. ఆ మాట వినగానే పల్లవి నేను తప్పించుకున్నాను అని సంతోష్ పడిపోతూ ఉంటుంది.. మావయ్య కి ఇలా జరగడానికి కారణం అవనీనేని పల్లవి అంటుంది. మావయ్య తో అవని ఏదో గొడవ పడుతున్నాడు నేను చూశాను అని అంటుంది పల్లవి.. ఏం మాట్లాడుతున్నావ్ పల్లవి కొంచమైనా బుద్ధి ఉంటే మాట్లాడుతున్నావా అని అంటుంది అవని..

Also Read :ఇంట్లో చిచ్చు పెట్టిన ప్రభావతి.. శృతి, మీనా మధ్య గొడవ నిజమేనా..? ఇదేం ట్విస్ట్ సామి..

అప్పుడు నువ్వు మావయ్యతో మాట్లాడావా ఏం మాట్లాడావు అసలు అని పార్వతి అంటుంది.. నేను మాట్లాడింది వేరు గొడవ పడలేదు ఏది అనలేదు అని అవని ఎంత చెప్తున్నా సరే పల్లవి మాత్రం అందరిని నమ్మించే ప్రయత్నం చేస్తుంది.. ఆ తర్వాత పోలీసులు ఎంట్రీ ఇస్తారు. రాజేంద్రప్రసాద్ పైనుంచి కింద ఎలా పడిపోయారు అని అడుగుతారు. పార్టీలో అందరూ ఉండగా పైకి ఆయన ఒక్కడే ఎందుకు వెళ్ళాడు అని అడుగుతారు.. పల్లవి ఎక్కడ తాను దొరికిపోతుందో అని మామయ్య ఒక్కడే పైకి వెళ్ళాడు. ఏదో కంగారుపడుతూ కనిపించాడు అని అంటుంది. పోలీసులకు పల్లవి పై అనుమానం వస్తుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

Big Stories

Advertisement
×