Intinti Ramayanam Today Episode june 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఆఫీస్ అవ్వగానే అక్షయ్ తన కారు గురించి డ్రైవర్ తో అడుగుతాడు. కారు సర్వీసింగ్ కి ఇచ్చాం సార్ కాస్త లేట్ అవుతుంది అని అతను చెప్పగానే మరో డ్రైవర్ని అక్షయ్ పిలుస్తాడు. ఈ కార్ ని అవని మేడం కోసం వాడమని రాజేంద్రప్రసాద్ సార్ చెప్పారండి అని అక్షయ్కి చెప్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అవని నీకు అభ్యంతరం లేదు అంటే మనం ఇద్దరం ఒకే కారులో వెళ్దాం. నన్ను డ్రాప్ చేసి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అంటుంది. నీతో పాటు కార్లో రావాల్సిన అవసరం నాకు లేదు అని అక్షయ్ అంటాడు. నన్ను మీరు మీ కొలీగ్ అనుకుంటే నాతో పాటు కార్లో రండి. మీ భార్య అనుకుంటే మాత్రం మీరు రావద్దు అని అవని అంటుంది. నేను నిన్ను కొలిగ్గానే ఫీలవుతున్నాను అని అక్షయ్ వెళ్లి కార్ లో కూర్చుంటాడు. అవని అక్షయ్ ఇద్దరు కలిసి ఒకే కారులో ఆరాధ్య దగ్గరికి వెళ్తారు.. వాళ్ళిద్దర్నీ చూసినా ఆరాధ్య మీరు ఇద్దరు కలిసిపోయారా? అని అడుగుతుంది. కానీ అక్షయ్ మాత్రం మనం వేరే వాళ్ళతో కలిసి ప్రయాణం చేసినంత మాత్రాన కలిసిపోయినట్లు కాదమ్మా నేను నిన్ను చూడడానికి వచ్చాను అని అంటాడు. రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ కు సెటైర్ వేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సుదర్శన్ కంపెనీ నుంచి ఇద్దరు వ్యక్తులు వస్తారు. అవని రాజేంద్రప్రసాద్ కి ఫోన్ చేసి ఆ కంపెనీ గురించి వివరాలను అడిగి తెలుసుకుంటుంది. ఈ డీల్ గురించి నేను చూస్తాను.. సైన్ చేస్తాను నువ్వు ఇంటికి తీసుకురా అనేసి రాజేంద్రప్రసాద్ అంటాడు.. దానికి అవని సరే మామయ్య నీ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకుంటుంది. అవని ఇంటికి వెళ్తుంటే మధ్యలో మెడికల్ షాప్ దగ్గర మందులు తీసుకోవాలని ఆగుతుంది. పల్లవి అవనిని ఇరికించేందుకు మాస్టర్ ప్లాన్ చేస్తుంది. ఆ ఫైల్స్ ని మార్చేందుకు అవనిని ఫాలో అవుతుంది. అవని కారు దిగడం చూసి పల్లవి తన ప్లాన్ ని వర్కౌట్ చేస్తుంది. ఆ డ్రైవర్ దగ్గరికి ఒక మనిషిని రమ్మని చెప్పి అడ్రస్ అడిగినట్లు అడిగి ఆ ఫైల్ ని మార్చేస్తుంది..
ఇక ఫైల్ మార్చిన విషయాన్ని చక్రధర్ తో చెప్పాలని కలవాలని ఫోన్ చేసి చెప్తుంది.. చక్రధర్ రాగానే నీకు సూపర్ గుడ్ న్యూస్ చెప్తాను డాడీ అనేసి అంటుంది. ఏంటమ్మా గుడ్ న్యూస్ అని చక్రధర అడగ్గానే.. నువ్వు ఇచ్చిన ఫైల్ ని నేను అవని ఫైల్ లో పెట్టేసాను ఇక దానిమీద రాజేంద్రప్రసాద్ సంతకం పెట్టడం ఒక్కటే మిగిలింది అని పల్లవి అంటుంది. ఒకవేళ రాజేంద్రప్రసాద్ చూసుకోకుండా సంతకం పెడితే మాత్రం.. వాళ్ళ ఆస్తులని ఆ కంపెనీకే చెందుతాయి. ఇంట్లో వాళ్ళందరూ రోడ్డున పడతారు అని చక్రధర్ అంటాడు.. అవని మీద ఆల్రెడీ ఆస్తి కొట్టేయాలని అపోహ ఉంది కదా.. ఇప్పుడు ఇది కూడా తెలిస్తే ఇకమీదట అవనిని ఎవరు నమ్మరు అని చక్రధర్ అంటాడు..
పల్లవి రాజేంద్రప్రసాద్ ఆ ఫైల్ మీద సంతకం పెట్టాడో లేదో అవనీని ఫాలో అయ్యి నేను తెలుసుకుంటాను డాడీ అని అంటుంది. ఇక అవని ఇంటికి వెళ్ళగానే రాజేంద్రప్రసాద్ కి ఆ ఫైల్ ఇస్తుంది. ఆ తర్వాత ఆరాధ్యతో ముచ్చట పెడుతుంది. ఆరాధ్య రాజేంద్రప్రసాద్ బొమ్మ వేశానని చెప్పి చెప్తుంది మాటల మధ్యలో సంతకాలు కూడా పెట్టేస్తాడు. పల్లవి కిటికీలోంచి చూడటం అవినీ గమనిస్తుంది. పల్లవి ఎందుకు వచ్చింది. ఈ ఫైల్ కి పల్లవికి ఏం సంబంధం ఉంది అని అవని ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఫైల్ తీసుకొని అందులో ఏమైనా ఉందా అని వెతుకుతుంది..
అక్కడ ఫైల్లో సుదర్శన్ కంపెనీకి మొత్తం రైతు ఇస్తున్నట్టు ఉండటం చూసి అవన్నీ షాక్ అవుతుంది. వెంటనే ఇదంతా పల్లవి పని అని గమనించి పల్లవిని వెతుక్కుంటూ బయటికి వెళుతుంది. పల్లవి వెళ్ళిపోతుంటే అడ్డుగా వచ్చి అవని ఈ విషయాన్ని ఎలాగైనా అక్షయ్ దగ్గర తేల్చుకోవాలని పల్లవిని అక్షయ దగ్గరకి తీసుకెళ్తుంది. పల్లవి ప్లాన్ ఇదంతా అని అక్షయ్కి చెప్పగానే అక్షయ్ ఎందుకు ఇదంతా చేసావని పల్లవి పై సీరియస్ అవుతాడు. నేను చెప్తే మీరు నమ్మరు కదా పల్లవిది ఎంత క్రిమినల్ బ్రెయిన్ డ్రైవర్ చెప్తాడు అని డ్రైవర్ ని పిలుస్తుంది. డ్రైవర్ చెప్పగానే అక్షయ్ అది నిజమే అని నమ్ముతాడు. ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..