BigTV English

Thug life Twitter Review: థగ్ లైఫ్ ట్విట్టర్ రివ్యూ.. సినిమాను నిలబెట్టింది వీళ్లేనా?

Thug life Twitter Review: థగ్ లైఫ్ ట్విట్టర్ రివ్యూ.. సినిమాను నిలబెట్టింది వీళ్లేనా?

Thug life Twitter Review: ప్రముఖ స్టార్ సీనియర్ హీరో కమలహాసన్(Kamal haasan), దర్శకుడు మణిరత్నం (Maniratnam)కాంబినేషన్లో ఎట్టకేలకు ఈరోజు విడుదలైన చిత్రం ‘థగ్ లైఫ్’. దాదాపు 38 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పైగా కోలీవుడ్ స్టార్ హీరో శింబు(Simbu), కోలీవుడ్ స్టార్ తలైవి త్రిష(Trisha Krishnan) తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ నేడు విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమా ఈరోజు తెల్లవారుజామునే ప్రీమియర్ షో లు పెద్ద ఎత్తున పడగా.. ఈ సినిమా చూసిన అభిమానులు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. మరి ఇన్ని రోజులు కోర్టు, వివాదాలు అంటూ వార్తల్లో నిలిచిన ఈ సినిమా అటు ఆడియన్స్ ను ఏ విధంగా మెప్పించింది,? ‘నాయగన్’ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అయ్యిందా? అనే విషయం ఇప్పుడు చూద్దాం.


థగ్ లైఫ్ ట్విట్టర్ రివ్యూ..

కమలహాసన్, మణిరత్నం కాంబోలో వచ్చిన ‘నాయగన్’ చిత్రం కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీళ్ళిద్దరి కాంబో సెట్ అవ్వడం ఒక ఊహించని పరిణామం అని చెప్పాలి. అటు కమల్, మణిరత్నం కలసి చేసిన ఈ థగ్ లైఫ్ లో ఎన్నో విశేషాలు జోడించారు. ఇందులో పోషించిన క్యారెక్టర్లు మాత్రమే కాదు మరెన్నో విషయాలను జోడించారు. పైగా ఏ.ఆర్ రెహమాన్ (AR Rahman) బీజీఎమ్, పాటలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి. ఇక ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది ఈ సినిమా. అటు ట్విట్టర్లో ఆల్రెడీ ఈ సినిమా హంగామా మొదలయ్యింది. మరి ఈ మూవీ టాక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.


ఇప్పటికే పలుచోట్ల ప్రీమియర్ షోలు పడగా.. ఫస్ట్ ఆఫ్ రివ్యూ చెప్పేశారు. కొందరేమో రొటీన్ కథ అని తీసిపారేస్తుంటే.. మరికొంతమంది కమలహాసన్ పెర్ఫార్మెన్స్ , శింబు యాక్టింగ్, రెహమాన్ బిజిఎం అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ కి వీళ్లే ప్రాణం పోశారు అని కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమందేమో ఫస్ట్ ఆఫ్ అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. అంతా ఊహకు అందేలాగే సినిమా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ వేరే లెవెల్ లో ఉండాల్సి వస్తుంది అని చెబుతున్నారు.

ఇక మరొక ట్విట్టర్ యూజర్ అయితే శింబు ప్రతి ఫ్రేమ్లో కూడా చాలా అద్భుతంగా నటించాడు. ఇతడు యాక్ట్ చేయలేదు ఆ పాత్రలో 100% ఒదిగిపోయారు. ఇక ఇంటర్వెల్ సీన్ అయితే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి అంటూ తెలిపారు.

ఇంకొక ట్విట్టర్ యూజర్ అయితే కమలహాసన్ నటనను ఆకాశానికి ఎత్తేశారు. కమలహాసన్ మళ్లీ పాత రోజులను గుర్తు చేశారు. నాయగన్ నాటి లుక్స్ లో కమలహాసన్ మళ్లీ అందరినీ ఆశ్చర్య పరుస్తారు అంటూ తెలిపారు. ఇక మొదటి భాగం సూపర్ గా ఉంది. అటు బిజిఎం, మ్యూజిక్, స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా వచ్చాయి అంటూ తెలిపారు

మరికొంతమంది థగ్ లైఫ్ సినిమా కథ చాలా పాతది . చాలా ఓల్డ్ స్క్రీన్ ప్లే. ఊహకు అందేలాగే సినిమా సాగుతుంది. ఎక్కడ కూడా ఎంగేజింగ్ గా అనిపించదు. రెహమాన్ బిజిఎం సినిమాకి సంబంధం లేకుండా ఉంది. పవర్ కోసం థగ్స్ మధ్య జరిగే చాలా ఓల్డ్ కథ ఇది అని చెబుతున్నారు.

కర్ణాటక ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ పై పడనుందా?

ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఒకరకంగా చాలామంది చెబుతున్నది చూస్తుంటే థగ్ లైఫ్ సినిమా ఫస్ట్ ఆఫ్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదనే వార్తలు కూడా వ్యక్తమవుతున్…

Related News

Mayasabha Review : మయసభ రివ్యూ 

Sir Madam Review : ‘సర్ మేడమ్’ మూవీ రివ్యూ… విడాకుల దాకా వెళ్లిన వింత గొడవ

Kingdom Movie Review : కింగ్డమ్ మూవీ రివ్యూ : ప్రయోగం సక్సెసా ?

Kingdom Twitter Review : ‘కింగ్డమ్’ ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ హిట్ కొట్టినట్లేనా.. ?

Kingdom Review: కింగ్డమ్ ఫస్ట్ రివ్యూ.. ఆశ్చర్యపరుస్తున్న ఉమైర్ సంధు ట్వీట్!

Mandala Murders series review : ‘మండల మర్డర్స్’ సిరీస్ రివ్యూ… కన్ఫ్యూజింగ్ మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×