E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: డబ్బుల కోసం అక్షయ్ టెన్షన్.. పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రణతికి టెన్షన్..

Intinti Ramayanam Today Episode: డబ్బుల కోసం అక్షయ్ టెన్షన్.. పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రణతికి టెన్షన్..
Advertisement

Intinti Ramayanam Today Episode May 13th : భరత్ రానని చెప్పాడా?ఎండకు చాలా దూరం వెళ్లొచ్చావు. వెళ్లి నీళ్లు తాగి పడుకో అని పల్లవి అవనీని అంటుంది. తను మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళగానే అవనిని చూసినా మీనాక్షి చక్రధర్లు భరత్ రాలేదా అని అడుగుతారు. లేదమ్మా వాడు ఏదో ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళాడట. నేను వెళ్లి తీసుకొని వస్తాను నువ్వు ఏమి కంగారు పడొద్దు అని మీనాక్షికి అవని చెప్తుంది. అయితే మీనాక్షి తన కొడుకుని చూడడానికి వీలు లేకుండా పోయిందని కన్నీళ్లు పెట్టుకుంటుంది. పల్లవి అబద్ధం చెప్పి తల్లిని బతికించాలని అనుకుంటుందేమో అని మనసులో అనుకుంటుంది.

బాధపడ్డ శ్రీకర్..

ముగ్గురు అన్నదమ్ములు కలిసి మాట్లాడుకోవాలని చాలా సంతోషంగా ఉంటారు.. శ్రీకర్ అన్నయ్య ఇంకా రాలేదేంటి అన్నయ్య నీ కమల్ అడుగుతాడు. ఫోన్ చేసినప్పుడు వస్తానని చెప్పాడు కదరా వస్తాడులే అని అక్షయ్ అంటాడు. కాసేపటి తర్వాత శ్రీకర్ రావడంతో అందరూ చాలా సంతోషంగా ఒకరినొకరు దూరమైనందుకు బాధపడుతూ ఉంటారు. శ్రీకర్ ఇన్ని రోజుల తర్వాత కలుసుకోవడంతో కమల్ ఎమోషనల్ అవుతాడు.. మనమంతా అన్నదమ్ములమై ఉండి ఇలా బయట కలుసుకోవడం ఏంటో నాకు అర్థం కావడం లేదు.. చాలా బాధగా ఉంది అన్నయ్య అని అంటాడు. అయితే శ్రీకర్ ని అక్షయ్ శ్రేయ గురించి అడిగి తెలుసుకుంటాడు. తనకు 40 రోజులు డెలివరీ డేట్ ఇచ్చారు అన్నయ్య మనమంతా దూరంగా ఉండడం నాకు చాలా బాధగా ఉందని శ్రీకర్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.. 50 లక్షల డబ్బులను కట్టడం గురించి అక్షయ శ్రీకర్ తో చెప్తాడు. ఇక శ్రీకర్ కూడా శ్రేయ ఆస్తికోసం అడిగిన విషయాన్ని గుర్తు చేస్తాడు. నువ్వేం కంగారు పడకు రా ఆస్తి గురించి ఏదో ఒకటి చేద్దాం లే అనేసి శ్రీకర్ తో అక్షయ్ అంటాడు.

డబ్బుల కోసం అక్షయ్ టెన్షన్..

Advertisement

అక్షయ్ 50 లక్షలు డబ్బులు ఇంకా కేవలం మూడు రోజుల్లో మాత్రమే కట్టాలి ఎలా కట్టాలి ఎక్కడ నుంచి కట్టాలి అనే టెన్షన్ పడిపోతూ ఉంటాడు. తనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి డబ్బులు కావాలని అడిగితే వాళ్లందరూ కూడా తనకి డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు తనని అసహ్యంగా మాట్లాడుతున్నారు అని బాధ పడిపోతూ ఉంటాడు. అక్షయ్ అప్పుడు అక్కడికి వచ్చిన అవని డబ్బుల కోసం కంగారు పడుతున్నారా? మీరేం టెన్షన్ పడకండి నాకు తెలిసిన వాళ్ళను కూడా నేను అడుగుతాను. ఎలాగోలాగా వాళ్ళిచ్చిన టైం లో కల్లా సర్దేద్దామని అంటుంది. కానీ ఆ డబ్బులు గురించి ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అవని తనలో తానే మాట్లాడుకుంటూ అక్కడి నుంచి బయటికి వస్తుంది.

పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్.. 

బావగారు నువ్వు ఏదో టెన్షన్ పడుతున్నట్లు ఉన్నారు. ఆ ఫైనాన్షియల్ కి ఇవ్వాల్సిన డబ్బులు కోసమేనా..? మీరు టెన్షన్ పడడం తప్ప ఏమి చేయలేరు అని పల్లవి వెటకారంగా మాట్లాడుతుంది. నువ్వు కూడా ఈ ఇంట్లో మనిషివే కదా. ఇంటి కోడలు అన్నాక ఇంటి బాధ్యతల్లో కూడా నీకు బాగా ఉంటుంది కదా నువ్వెందుకు ఆ డబ్బులు గురించి ఆలోచించడం లేదు అని అవని అడుగుతుంది. ఇంటికి పెద్ద కోడలు నువ్వు పెద్ద కొడుకు అక్షయ్ బావ మీరిద్దరే ప్రతి దానికి ముందుంటారు కదా ఆ సమస్య కూడా మీరే ముందుండి తీర్చాలి కదా అని పల్లవి మాట్లాడుతుంది. ఈ సమస్య రావడానికి నువ్వు మీ అమ్మ కారణమని నాకు తెలియదు అనుకుంటున్నావా అని అవని అంటుంది. కష్టాలు ఎప్పుడూ ఎవరికీ ఉండవు. ఏదో ఒక రోజు అవి పూర్తిగా పోతాయి అని అవని అంటుంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో నాకు తెలుసు అని అవని అనగానే పల్లవి చేతకాక పోయినప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి అని వెటకారంగా మాట్లాడుతుంది. ఈ సమస్య నుంచి బయటపడి నేనేంటో నిరూపించుకుంటాను అని పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.

భరత్ మాటతో ప్రణతి షాక్.. 

Advertisement

ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన భరత్ తో మాట్లాడ్డానికి ప్రణతి చాలా ప్రయత్నాలు చేస్తుంది. భరత్ నేను నీతో మాట్లాడాలి అని ఎంతగా అడుగుతున్నా సరే భరత్ మాత్రం రాజేశ్వరి అమ్మ చేసిన బిర్యాని చాలా బాగుంది అని మెచ్చుకుంటాడు. ఈ పరుపు కూడా చాలా మెత్తగా ఉంది. ఏసి వేసుకొని పడుకుంటే నిద్ర అస్సలు ఆగదు అని అంటాడు. భరత్ నేను నీతో మాట్లాడాలి అని ప్రణతి ఎంతగా అడుగుతున్నా సరే భరత్ మాత్రం ఈరోజు నేను ఆఫీసులో అసలు తీరిక లేకుండా ఉన్నాను చాలా అలసిపోయాను ఇప్పుడు నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు రేపు మాట్లాడుతాను అని భరత్ అంటాడు. పడుకున్న కాసేపటికి పవర్ పోవడంతో భరత్ లేస్తాడు. ఏసీ కూలర్ లేకుండా పడుకోవడం నావల్ల కావడం లేదు అని అనడంతో ప్రణతి చిన్నప్పుడు నుంచి నువ్వు అలానే పడుకున్నావా ఏంటి అని అడుగుతుంది. అప్పుడు ఎలా ఉన్నావు కాదు ఇప్పుడు ఎలా ఉన్నామో ఆలోచించాలి అని భరత్ అంటాడు. నేను అనుకున్న దానికంటే ఎక్కువగానే మారిపోయాడు అని ప్రణతి బాధపడుతుంది.

అక్కా చెల్లెలు కథ..

చక్రధర్ ఫైనాన్సర్ ఇచ్చిన గడువు పూర్తవుతుంది. ఎలాగైనా సరే తన కూతురు అల్లుడ్ని ఈ సమస్య నుంచి బయట పడేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.. డబ్బుల కోసం అక్షయవని చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆరాధ్య తాతయ్య నాకు నిద్ర రావడం లేదు ఏదైనా ఒక కథ చెప్పండి అని అడుగుతుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన అవని అలాగే పల్లవిలను చూసి నీకు ఒక కథ చెప్తాను. అది ఒక అక్క చెల్లెల కథ అని అవని పల్లవిల స్టోరీని ఆరాధ్యకు చెప్తాడు.. పల్లవి గురించి చెప్పడంతో తను కోపంగా ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: రొమాంటిక్ డ్యాన్స్ తో రెచ్చిపోయిన జంటలు.. సుక్కు ప్లాన్ ఫెయిల్.. బుక్కయిన వల్లి..

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×