Intinti Ramayanam Today Episode May 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. బిక్షగాడు వస్తేనే ఇంటికి భోజనం పెడతారు అలాంటిది నేను రాగానే నన్ను భోజనానికి కూడా పట్టించుకోకుండా మీ పార్టీకి మీరు తింటున్నారు అట్లే వెళ్లిపోయారు కూడా.. నేను మీకు ఎవరికి అక్కర్లేదని నాకు అర్థం అయిపోయిందని అంటాడు. నాకు మాది తప్పయింది మీ మమ్మల్ని క్షమించండి అని పార్వతి రాజేంద్ర ప్రసాద్ ని అడుగుతుంది. అక్షయ్ ఇంట్లో లేడు అక్షయ్ ద్వారా కూడా క్షమాపణ చెప్పిస్తాను మీరు దయచేసి వెనక్కి రండి మీ నిర్ణయాన్ని మార్చుకోండి అని అడుగుతుంది. కానీ రాజేంద్రప్రసాద్ ఇదే మాటని నేను అవని విషయంలో అంటే మీరు ఒప్పుకుంటారా అని అడుగుతాడు. అవని నేను క్షమించి ఇంటికి తీసుకురండి అంటే మీరు క్షమించి ఇంటికి తీసుకొస్తారా..? అవని విషయంలో మీరు చేసేది తప్పు అంటే మీరు నమ్ముతారా ఇప్పటికైనా మీరు అవనిని ఇంటికి తీసుకొస్తారా అప్పుడైతే తప్ప నేను ఇంట్లో ఉండను అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. కానీ పార్వతి నా ప్రాణానైనా మీకు ఇస్తాను గాని అవనిని ఇంటికి తీసుకురాను అని చెప్పేస్తుంది దాంతో రాజేంద్రప్రసాద్ నేను కూడా ఇక్కడ మీ అందరితో ఉండలేనని వెళ్లిపోతాడు. దయాకర్ ఇంటికి చేరుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాజేంద్రప్రసాద్ అవని దగ్గరికి వెళ్లడంతో అక్షయ్ కోపంతో అవనికి నోటీసులు పంపిస్తాడు. కూతుర్ని తనకు దూరం చేస్తుందంటూ ఆరోపిస్తూ కోర్టు నోటీసులు పంపిస్తాడు. ఆ నోటీసులు చూసి అవన్నీ షాక్ అవుతుంది. కోర్టులోనే ఏదైతే అది తేల్చుకుందాం అని రాజేంద్రప్రసాద్ ధైర్యం చెబుతాడు. తర్వాత రోజు ఉదయం రాజేంద్రప్రసాద్ తో పాటు అవని దయాకర్ ఫ్యామిలీ కూడా కోర్టుకు బయలుదేరుతుంది. అటు అక్షయ్ పార్వతీ వాళ్ళతో పాటు ఇంట్లోనే వాళ్ళందరూ కోర్టు కొస్తారు. నీ గొడవలన్నీ ఎందుకండీ మన కుటుంబం పరువు పోతుంది అందరం కలిసి ఉందాం అండి అంటూ అవని కాళ్ళ వెళ్ళబడి బ్రతిమలాడుతుంది. పార్వతి మాత్రం అస్సలు కనికరించదు.
కోర్టు బయట రెండు ఫ్యామిలీలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేస్తారు. అవని పార్వతి కాళ్ళ మీద పడి అత్తయ్య నన్ను క్షమించండి. ఎన్నో తప్పులు జరుగుతూ ఉంటాయి కానీ నేను చేసిన చిన్న తప్పుని క్షమించండి అత్తయ్య అని పార్వతిని అడుగుతుంది. అప్పుడు చంపాలి అనుకున్నాం ఇప్పుడేమో కాళ్ళ మీద పడి నా ఇంట్లోకి మళ్లీ అడుగు పెట్టాలని ఆలోచిస్తున్నావా అని పార్వతి అంటుంది. ఎంతగా బ్రతిమలాడిన కూడా పార్వతి ఏదైతే అది అయింది కోర్టులోనే తేల్చుకుందామని లోపలికి వెళ్ళిపోతారు.. లాయరు జడ్జ్ గారు వచ్చారు మీరందరు కూర్చోవాలి లోపలికెళ్ళి అని చెప్పగానే అందరూ లోపలికి వెళ్ళిపోతారు.
ఒక బోన్లో అవని, ఆరాధ్య ఉంటారు. మరో బోన్ లో అక్షయ్ నిలబడతాడు.. ఫ్యామిలీ గొడవలు కోర్టుకి వెళ్లడం అంటే ఎంత దారుణంగా ఉంటాయో అని జడ్జిగారు వివరిస్తారు. అటు లాయరు అవని తన కూతుర్ని తనకి దక్కనివ్వకుండా బలవంతంగా ఎవరికీ తెలియకుండా, తన కూతుర్ని తన దగ్గరికి తెచ్చుకుంది అని ఆరోపిస్తూ నా క్లైంట్ కోర్టులో కేసు వేశాడని వివరిస్తాడు. తండ్రి దగ్గర ఉన్న కూతుర్ని బలవంతంగా తీసుకెళ్తే అది ఎంత కేసు అవుతుందో మీకు కూడా తెలుసు అని లాయరు తన వాదనని వినిపిస్తాడు.
అయితే అవని తరపున వాదించడానికి ఒక్క లాయర్ కూడా ఉండరు. కోర్టు జడ్జ్ మీ తరఫున వాదించడానికి లాయర్ ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడే శ్రీకర్ అక్కడికి నేనున్నాను అంటూ వచ్చేస్తాడు. శ్రీకర్ని చూసి అందరూ షాక్ అవుతారు. అని శ్రీకర్ నువ్వేంటి ఇలా ఈ కేసు తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఎంత చెప్పినా కూడా కోర్టులోని లాయర్ ని పేరు పెట్టి పిలవడం బంధుత్వంతో పిలవడం తప్పు అనేసి అవనితో అంటాడు. జడ్జ్ కూడా లాయర్ గా నువ్వు ముందుకు రావడం సంతోషంగా ఉంది నీ నిజాయితీని నేను మెచ్చుకుంటున్నాను ప్రొసీడ్ అని చెప్పేసి అంటాడు.
ఇద్దరు లాయర్ తమ వాదనని వినిపిస్తారు. శ్రీకర్ మాత్రం తల్లి గురించి తల్లి బంధం గురించి గొప్పగా చెప్తాడు.. తల్లి ఎప్పుడూ బిడ్డని శత్రువులుగా చూడదు.. జన్మనిచ్చిన మొదటిసారి బిడ్డ తన తల్లిని చూసి తన తల్లి తనకు రక్షణ అని భావిస్తుంది. అలాంటి తల్లి దగ్గర నుంచి బిడ్డల్ని వేరు చేయడం తప్పు అని అందరికీ వివరిస్తాడు. పసితనంలో తల్లి దగ్గరే బిడ్డలు ఉండాలి అంటూ శ్రీకర్ తల్లి బంధం గురించి ఎంతో గొప్పగా వివరిస్తారు.. శ్రీకర్ మాటలకి జడ్జ్ సైతం కరిగిపోతాడు. తన వాదనలు విన్న జడ్జ్ అవని అక్షయలకు ఎలాంటి తీర్పునిస్తాడో అని కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎపిసోడ్ ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో అవనిని అక్షయ్ దారుణంగా అవమానిస్తాడు. ఒక అనాధవి అంటూ గుండెలు పగిలేలా ఏడ్చేలా బాధ పెడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..