BigTV English

Kurnool Politics: జగన్‌కి బుగ్గన హ్యాండ్?

Kurnool Politics: జగన్‌కి బుగ్గన హ్యాండ్?

Kurnool Politics: వైసీపీ ప్రభుత్వంలో తిరుగులేని హవా నడిపిన ఆర్థికశాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కోటకు బీటలు వారాయి. పదేళ్ల తర్వాత కర్నూరు జిల్లా డోన్‌లో టీడీపీ జెండా ఎగిరింది. కోట్ల గెలుపుతో చంద్రబాబు వ్యూహం ఫలించి బుగ్గన ఓటమిపాలయ్యారు. అయదేళ్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన బుగ్గన ఒక్క ఓటమితో డోన్‌‌లో అడ్రస్ లేకుండా పోయారు. బుగ్గన ఎక్కడా? అని ఇనేళ్లు ఆయన వెంట తిరిగిన అనుచరులే వెతుక్కుంటున్న పరిస్థితి. అపర మేధావిలా అసెంబ్లీ లో వ్యవహరించిన ఆయన ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో తన వ్యాపార వ్యవహారాల కోసం జగన్‌కి హ్యాండ్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారంట. అయితే కూటమి పార్టీలు నో ఎంట్రీ బోర్డు పెట్టడంతో ఏం చేయాలో తోచక అజ్ఞాతంలోకి వెళ్లిపోయారన్న టాక్ నడుస్తోంది …


2019 ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2019 ఎన్నికలలో ఫ్యాన్ స్పీడుకు సైకిల్ ఢీలా పడింది. జిల్లాలోని 14 స్థానాలకు వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. గత ఎన్నికలలో పూర్తిగా చేతులెత్తేసిన వైసీపీ జిల్లాలో రెండు స్థానాలకే పరిమితమైంది. జిల్లాలోని డోన్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. గతంలో ఈ సెగ్మెంట్ లో ప్రస్తుత టీడీపీలో ఉన్న కేఈ, కోట్ల కుటుంబాలే ప్రత్యర్ధులుగా కొనసాగారు. 1978 నుంచి 2009 వరకు ఆ రెండు ఫ్యామిలీ మధ్యే ఎలక్షన్ వార్ నడుస్తూ వచ్చింది. 2014లో వైసీపీ నుంచి ఎంట్రీ ఇచ్చిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అనూహ్యంగా కేఈ కృష్ణమూర్తిపై గెలుపొందారు. రెండోసారి కూడా గెలిచిన బుగ్గన ఆర్థిక మంత్రిగా అయిదేళ్లు చక్రం తిప్పారు


బుగ్గనను చిత్తుగా ఓడించిన కోట్లు సూర్యప్రకాశ్ రెడ్డి

రాజకీయ ప్రత్యర్థులైన దిగ్గజ కుటుంబాలు కేఈ, కోట్ల కుటుంబాలు గత ఎన్నికల సమయానికి ఒకే గూటి కిందకు చేరడం, ఈ సారి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగడంతో బుగ్గనకు ఘోర పరాజయం తప్పలేదు. అదీకాక నియోజకవర్గానికి అందుబాటులో ఉండకుండా అసెంబ్లీలో పిట్టకథలు చెప్తూ గడిపేసిన బుగ్గనపై డోన్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ ఓటమి తర్వాత బుగ్గన డోన్ వాసులకు నల్లపూసై పోయారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన అక్రమాలపై కూటమి సర్కారు దృష్టి సారిస్తోందన్న ప్రచారంతో భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటున్నారు

టీడీపీ వారిని టార్గెట్ చేస్తూ బుగ్గన వేధింపులు

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను, వారి వ్యాపారాలను టార్గెట్‌ చేస్తూ బుగ్గన వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలున్నాయి. అదేవిధంగా బుగ్గనను ప్రజలు నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఎప్పుడూ రాలేదు, అమరావతి, ఢిల్లీలోనే ఎక్కువ సమయం గడుపుతూ నియోజకవర్గంలో ప్రజలకు దూరమయ్యారు. అంతేగాక సొంత పార్టీ కేడర్‌ను కూడా బుగ్గన పట్టించుకోలేదని టాక్‌. వాటికి తోడు సొంత మండలం బేతంచెర్లలోనే బుగ్గన తీవ్రస్థాయిలో అరాచకాలకు పాల్పడ్డారంట.

Also Read: ఇక పాక్‌కు చుక్కలే!! భారత్‌కు ఎస్-500 రష్యా బంపర్ ఆఫర్

జగన్ హ్యాండ్ ఇచ్చే ఆలోచనలో బుగ్గన

ప్రస్తుతం కేసుల భయం వెంటాడుతుండటంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీని వీడి జగన్‌కు హ్యాండ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారంట. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ తిరిగి అక్కడి పెద్దలతో అంతో ఇంతో పరిచయాలు పెంచుకున్న ఆయన.. బీజేపీలో చేరడానికి వారితో మంతనాలు సాగిస్తున్నారంట. అందుకే ఆయన వైసీపీ కార్యక్రమాల్లో కూడా కనిపించడం లేదని, ఎక్కువ టైమ్ ఢిల్లీలోనే గడుతున్నారని బుగ్గన అనుచరులు చెప్పుకుంటున్నారంట. బీజేపీలో చేరడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాల సంగతి తెలిసి డోన్ కూటమి నేతలు తమ అధిష్టానాలపై తీవ్ర వత్తిడి తెచ్చారంట. దాంతో బుగ్గనకు కూటమి పార్టీల్లో ఎంట్రీకి డోర్స్ క్లోజ్ అయిపోయారంటున్నారు. ఆ క్రమంలో బుగ్గన ఆచూకీ ఆయన సొంత అనుచరులకే అంతుపట్టకుండా తయారైందంట.

Related News

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Big Stories

×