OTT Movie : ఇప్పుడు థియేటర్లలో కంటే ఓటీటీలోనే సినిమాలను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మూవీ లవర్స్. భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న ఏ సినిమా వచ్చినా వదలకుండా చూస్తున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా ఓటీటీలోనే ఎన్నో జానర్ల సినిమాలు అందుబాటులో ఉంటున్నాయి. అందులో ప్రకృతి విపత్తుల ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. వీటిలో ఉండే విధ్వంసం అంతా కాదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ప్రకృతి విపత్తు కారణంగా మనుషులు చనిపోతారు. చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. ఆ తర్వాత స్టోరీ విచిత్రంగా టర్న్ తీసుకుంటుంది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఇయర్ 10’ (Year 10). 2024 లో వచ్చిన ఈ సినిమాకి బెంజమిన్ గూడజర్ దర్శకత్వం వహించారు. 2024 ఆగస్టు 24న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ చూశాక ఒకవేళ ఏదైనా భారీ డిజాస్టర్ వచ్చి, భూమి మీద కొంత మంది మనుషులు మాత్రమే మిగిలితే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందా? అన్పిస్తుంది. అంతేకాదు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చూస్తే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం.
స్టోరీలోకి వెళితే
భూమి మీద ప్రకృతి విపత్తు సంభవించి మనుషులు చాలా మంది చనిపోతారు. లక్కీగా అక్కడక్కడ మాత్రమేఅతి కొద్దిమంది ప్రాణాలతో బతికి బయట పడతారు. ఇది జరిగిన కొంత కాలం తరువాత భూమి మీద పరిస్థితి చాలా వింతగా మారిపోతుంది. సాధారణంగా ఇలా బతికి బయట పడితే ఒకర్ని ఒకరు కొట్టుకు చస్తారు. కానీ ఈ సినిమాలో మాత్రం మనుషులు ఒకరిని ఒకరు చంపుకుని తినడం మొదలు పెడతారు. ఈ నేపథ్యంలోనే హీరో తన తండ్రిని హత్య చేసి, స్నేహితురాలిని బతికించే ఔషధాన్ని దొంగిలించిన నరమాంస భక్షకులను ఎదుర్కోవడానికి వెళతాడు.
ఈ క్రమంలో అతను పెద్ధ తోడేళ్ల గుంపును ఎదుర్కుంటాడు. అతను ఈ తోడేళ్లతో తీవ్రంగా తలపడి, వాటి నుంచి తప్పించుకుంటాడు. మరోవైపు అడవిలో ఉన్న వింత మనుషులతో పోరాడాల్సి వస్తుంది. వాళ్ళతో కూడా ఫైట్ చేసి, మెడిసన్ తో తన స్నేహితురాలిని కాపాడటానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతను ఎన్నో అటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సినిమా ఒక డిస్టోపియన్ ప్రపంచంలో జరిగే ఉత్కంఠభరితమైన కథనం. ఇందులో మానవత్వం, ధైర్యం, సర్వైవల్ అనే అంశాలు ప్రధానంగా ఉంటాయి.
Read Also : అమ్మాయిల పిచ్చితో దిక్కుమాలిన పని… ఈ మలయాళ సైకో థ్రిల్లర్ క్లైమాక్స్ కు ఫ్యూజులు అవుట్ భయ్యా