Intinti Ramayanam Today Episode November 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని పల్లవి తనను ఇరికించాలని చేసిందని తెలుసుకుంటుంది. పల్లవికి గట్టి షాక్ ఇస్తుంది. ఇక ముందు నా గురించి ఏదైనా చేసేటప్పుడు ఆలోచించు. ఇప్పటికైనా నీ గురించి నిజం చెప్పాలని నాకు లేదు. ఇంట్లో వాళ్లకి ఈ వీడియో ఒకసారి చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసా ఇంట్లో వాళ్ళు నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారని అవని అంటుంది. ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే బాగుంటుందని అంటుంది. అవని ఇచ్చిన షాక్ కు పల్లవి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇక పల్లవికి ఏదైనా చేసే ముందు ఆలోచించు అంటుంది. ఒక ఆడదానిలా బిహేవ్ చెయ్యి అనగానే పల్లవి కోపంతో రగిలిపోతుంది.. అవనికి కమల్, ప్రణవి సడెన్ సర్ ప్రైజ్ ఇస్తారు. అవనికి ఆకాశానికి పొగిడేస్తూ స్వీట్స్ పెడతారు. దానికి అవని పొంగిపోతుంది. కానీ పల్లవి మాత్రం కుళ్ళుకొని చచ్చిపోతుంది. అవనికి హారతి ఇచ్చి ఇంట్లో వాళ్ళ దిష్టే నీకు తగిలిందనేసి చెప్తుంది. ఇక పల్లవి బామ్మను కూడా కమల్ స్వీట్ పెట్టమని చెప్తాడు. అందరు సంతోషంగా ఉంటారు.. ఇక చక్రధర్ తన ఫ్రెండ్ కు అవని గురించి చెబుతాడు. ఇక అతనేమో మీనాక్షి, భరత్ ను చంపేయమని సలహా ఇస్తాడు. అవని పై ఎటువంటి నిందలు లేవని అక్షయ్ సంతోషంగా తన ఫ్రెండ్ ను కలవడానికి వెళ్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే..అక్షయ్ కోసం తన ఫ్రెండు వెయిట్ చేస్తూ ఉంటాడు. ముందు ఇది తీసుకోరా నీకు ఒక నిజం చెప్పాలి అనేసి అంటాడు. కానీ అక్షయ్ నాకొద్దు అని అంటాడు. ఆ భరత్ నీ భార్య తమ్ముడు అని అంటున్నావు కదా వాళ్ళిద్దరి మధ్య నిజానికి ఎఫైర్ నడుస్తుంది అనేసి చెప్తాడు. మాట వినగానే అక్షయ్ తన ఫ్రెండ్ ని కొడతాడు. భార్య గురించి నువ్వు ఇంత తప్పుగా మాట్లాడుతావా అసలు నీకేం తెలుసు అవని గురించి అని అంటాడు. కొడతావని నేను ఊహించాను కాకపోతే ఈ ఫోటోలను చూడు ఒకసారి అనేసి అంటాడు. పక్కపక్కనే నిల్చుని ఫోటో దిగినంత మాత్రాన ఎఫైర్ అంట కడతావా అనేసి అనగానే అక్షయ్ మరోసారి తనని కొడతాడు. అక్షయ్ మనసులో అనుమానం మొదలవుతుంది. అవని ఎందుకు మోసం చేస్తుందని ఆలోచిస్తూ బాధ పడతాడు. కోపంలో ఇంకాస్త ఎక్కువగా తాగి వస్తాడు.. ఇంటికి రాగానే అవనిని నిలదీస్తాడు. భరత్ మీనాక్షి నా తమ్ముడు తల్లి అని నిజం చెబుతుంది. ఆ తర్వాత హాస్పిటల్ కు తీసుకొని వెళ్తుంది కానీ అక్కడ మీనాక్షి, భరత్ కనిపించరు. అక్షయ్ మాత్రం కొత్త నాటకం మొదలు పెట్టావా అని అడుగుతాడు.
అవని అంత చెప్పినా అక్షయ్ వినడు. అబద్దాలు మీద అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తావా? నీ బాగోతాలు బయటపడుతున్న కూడా నువ్వు నిజాన్ని ఒప్పుకోవా అనేసి అడుగుతాడు. నువ్వు చెప్పేది నిజంగానే నిజం నాకు తల్లి తమ్ముడు ఉన్నారు ఆ విషయం నాకు ఈ మధ్య తెలిసింది అనేసి మీకు వాళ్ళని చూపిస్తాను రండి అని అంటుంది. కానీ అక్షయ్ మాత్రం నమ్మడు. మీకు చూపిస్తాను రండి అని అక్షయ్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లాలని అవని అనుకుంటుంది. అయితే ఒక్క నిమిషం అని లోపలికి వెళ్లి మజ్జిగ తీసుకొని వస్తుంది. ఈ మధ్యకి తాగండి మనం వెళ్ళేది హాస్పిటల్ కి మీ మత్తు కాస్త దిగుతుంది నేను చెప్పేది కాస్త వింటారు అనేసి అంటుంది. అవని చెప్పింది నిజం అని తెలుసుకోవడానికి అక్షయ్ మజ్జిగ తాగుతాడు.
ఇద్దరూ కలిసి హాస్పిటల్ కి వెళ్తారు. అంతకన్నా ముందే చక్రధర్ హాస్పిటల్ కి వెళ్తాడు. డాక్టర్ కి డబ్బులు పంపించి హాస్పిటల్స్ సీసీ కెమెరాలు ని ఆపిస్తాడు. చక్రధర్ మనుషులు లోపలికి వెళ్లి మీనాక్షికి మత్తుమందు ఇచ్చి కిడ్నాప్ చేయాలని చూస్తారు. అప్పుడే లోపలికి వచ్చిన భరత్ ని కూడా కిడ్నాప్ చేస్తారు. చక్రధర్ మళ్ళీ డాక్టర్ కి ఫోన్ చేసి మా పని అయిపోయింది నువ్వు ఇక సీసీ కెమెరాలు ఆన్ చేసుకోవచ్చు అనేసి అంటాడు. ఇక అవని అక్షయను తీసుకొని హాస్పిటల్ లోపలికి వస్తుంది. తన తల్లి గదిలోకి వెళితే తన తల్లి కనిపించదు. తల్లి తమ్ముడు ఏమయ్యారని టెన్షన్ పడుతూ వెతుకుతుంది.. అక్కడ కనిపించకపోవడంతో టెన్షన్ పడుతూ డాక్టర్ని అడుగుతానని బయటకు వస్తుంది. డాక్టర్ చెప్పింది విని షాక్ అవుతుంది అవని షాక్ అవుతుంది. ఈ బంధువులు ఎవరు లేరండి ఈ ఊర్లో నేనే అని చెప్పగానే మిమ్మల్ని నేనెప్పుడూ ఇక్కడ చూడలేదు మీరు ఎవరు అన్నట్టుగా మాట్లాడుతాడు. అది విన్న అక్షయ్ నీ డ్రామాలు ఇంకెంతవరకు ఉంటాయి ఇకనైనా ఆపు అనేసి అంటాడు. నీ హాస్పిటల్ లోనే వదిలేసి వెళ్ళిపోతాడు. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..