BigTV English

Tirupati: తిరుపతిలో ఈ పోస్టయినా టీడీపీకి దక్కుతుందా..?

Tirupati: తిరుపతిలో ఈ పోస్టయినా టీడీపీకి దక్కుతుందా..?

Tirupati: రాష్ట్రంలో ఉన్న అన్ని అర్బన్ డెవలప్ మెంట్ అథారటీలకు చైర్మన్ లను ప్రకటించారు. అయితే తిరుపతి విషయంలో మాత్రం ఇంతవరకు సీఎం చంద్రబాబునాయుడు సీరియస్‌గా నిర్ణయం తీసుకోలేదు.. తుడా పదవి ప్రతిష్టాత్మకమే కాదు. టీటీడీలో సైతం తుడా చైర్మన్ ఎక్స్ అఫిషియో మెంబర్ కావడంతో దీనికి మరింత ప్రాధాన్యత పెరిగింది. దాంతో అశావహుల సంఖ్య పెరిగింది. చివరకు ఎమ్మెల్యేలు సైతం తొడా పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారంట. ఓ వైపు మిత్ర పక్షాలు, మరో వైపు పార్టీ నాయకులతో అశావహుల లిస్టు చాంతాడంత అవ్వడంతో ముఖ్యమంత్రికి తలనొప్పిగా మారి దాన్ని పెండింగ్లో పెట్టారంటున్నారు.


తుడా పరిధిలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు

రాష్టంలో కీలక అర్బన్ అథారటీలలో తిరుపతి ఒకటి.. అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నగరం తిరుపతిలో తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యకలాపాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. తుడా పరిధిలో తిరుపతి, చిత్తూరు పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. తుడా పరిధిలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్పుడు జోరుగానే ఉంటుంది. తుడా చైర్మన్‌కి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలలో సభ్యత్వం ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే తుడా చైర్మన్ పదవి ఎమ్మెల్యే కంటే పవర్ పుల్ అంటారు.


తుడా చైర్మన్ పదవిని పెండింగ్లో పెట్టిన చంద్రబాబు

వైసీపీ హయాంలో తుడా చైర్మన్ గా పనిచేసిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, అయన కూమారుడు మోహిత్ రెడ్డిలు తుడాను సొంత ఆస్తిలా వాడుకున్నారన్న ఆరోపణలున్నాయి. తుడా నిధులతో తమ సొంత సిబ్బందిని సైతం నియమించుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు సైతం తుడా నిధులనే వినియోగించుకున్నారనే విమర్శలున్నాయి. సత్యవేడు, నగరి, జీడి నెల్లూరు, చంద్రగిరి, కాళహస్తి నియోజకవర్గాలు తుడా పరిధిలోకి వస్తాయి. అంతా కమర్షియల్ ఏరియానే.. ఓ వైపు వేగంగా జరిగే పారిశ్రామికరణతో రియల్ రంగం కూడా అక్కడ పుంజుకుంది. అందుకే తుడా చైర్మన్ పదవి అంటే అంత క్రేజ్.

ఇటీవల రాష్టంలోని కీలక అర్బన్ అధారటీలకు సీఎం అధ్యక్షులను ప్రకటించారు. అయితే తిరుపతిని మాత్రం పెండింగ్ లో పెట్టారు. తుడా చైర్మన్ పదవిని అశించిన తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్‌కు యాదవ్ కార్పోరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అదే విధంగా చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు సిఅర్ రాజన్‌కు వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ పదవి అప్పగించారు .. వారిద్దరినీ తుడా చైర్మన్ రేసులో నుంచి తప్పించినా.. ఇంకా ఆశావహుల లస్టు మాత్రం పెద్దగానే కనిపిస్తుంది.

తుడా చైర్మన్ పదవి రేసులో 25 మంది కూటమి నేతలు

టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, క్షత్రియ సామాజిక వర్గం నుంచి శ్రీధర్ వర్మ , టీడీపీ నాయకులు జేబీ శ్రీనివాస్, మబ్బు దేవ నారాయణ రెడ్డి, డాక్టర్ కోడూరి బాల సుబ్రమణ్యం, చంద్రగిరి నుంచి డాలర్ దివాకర్ రెడ్డి , శ్రీకాళహస్తి నుంచి ఎస్సీవీ నాయుడు, సత్యవేడు నేత సతీష్ నాయుడు తుడా పదవి ఆశిస్తున్నారు . ఇక జనసేన నుంచి డాక్టర్ హరి ప్రసాద్, తిరుపతి నియోజకవర్గ ఇన్ చార్జ్ కిరణ్ రాయల్, శ్రీకాళహస్తి నేత వినూత రేసులో ఉన్నారు. బీజేపీ నుంచి కూడా సామంచి శ్రీనివాస్, కోలా అనంద్ తుడా పదవిపై కన్నేశారంట.

Also Read: రాత్రయితే ఆత్మలతో మాటలు.. పగలు సుద్దపూస ట్వీట్ లు.. జగన్ పై లోకేష్ ఫైర్

తుడా చైర్మన్‌కు క్యాబినెట్ హోదా సైతం ఉండటంతో చంద్రిగిరి ఎమ్మెల్యేపులివర్తి నాని, నగరి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు గాలి భాను ప్రకాష్, బొజ్జల సుధీర్ సైతం తమకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారంట. మొత్తం మీద మూడు మిత్రపక్షాల నుంచి పాతిక మంది పైగా తుడా పదవి అశిస్తున్నట్లు తెలుస్తుంది. వారికి తోడు రిలయన్స్ లోకాద్రి నాయుడు సైతం తన భార్యకు ఆ పదవి ఇవ్వాలని అడిగినట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద ముఖ్యమంత్రి తప్ప మంత్రి లేని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తుడా పోస్టు ఇప్పుడు అత్యంత కీలకమైన పదవిగా మారింది.

తిరుపతి ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను పొత్తుల్లో వదులుకున్న టీడీపీ

తిరుపతి ఎమ్మెల్యే జనసేనకి, ఎంపీ బీజేపీకి గత ఎన్నికల్లో కేటాయించారు. అయితే ఎంపీ స్థానంలో బీజేపీ పరాజయం పాలైంది. తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ క్రమంలో టీడీపీకి తిరుపతిలో చట్టసభల ప్రతినిధి లేకుండా పోయారు. టీడీపీ క్యాడర్ ను పట్టించుకునే వారు కరువయ్యారనే వాదన వినిపిస్తుంది. దానికి తోడు వైసీపీలోని ఓ బ్యాచ్ మొత్తం జనసేన పంచకు చేరిపోయి తమ హవా కొనసాగిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తిరుపతి నియోజకవర్గంలో కేడర్‌ను కాపాడుకోవాలంటే తుడా పదవి టీడీపీకే దక్కాలని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.

ఇప్పటికే రోడ్డున పడ్డ తమకు కనీసం తుడా ద్వారా అయిన కనీస ఉతం దొరుకుతుందన్నది తెలుగు తమ్ముళ్ల వాదనగా ఉంది. గతంలో తుడా చైర్మన్ గా పనిచేసిన నరసింహా యాదవ్ తనకు యాదవ కార్పోరేషన్ వద్దని తుడా ఇమ్మని అడుగుతున్నారంట. అయితే మార్పు జరగదని టిడిపి వర్గాలు అంటున్నాయి. తుడా చైర్మన్ పదవి తమకు ఇవ్వాలని డాక్టర్ హారి ప్రసాద్, కిరణ్ రాయల్‌‌లు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌పై ఒత్తిడి పెంచుతున్నారంట.

చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులు ఎన్నికల ముందు జనసేనలో చేరి తిరుపతి టికెట్ దక్కించుకుని గెలిచారు. పవన్‌పై వత్తిడి పెంచుతున్న వైసీపీ నేతలకు ఇప్పుడు అదే ఆయుధంగా మారిందంట. వైసీపీ నుంచి వ్యక్తి ఎమ్మెల్యే కావడం వల్ల ముందు నుంచి పార్టీలో కొనసాగిన తమకు ఇబ్బందిగా ఉందని.. ఇలాంటి స్థితిలో తుడా చైర్మన్ జనసేనకు కేటాయించాలని వారు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇలా రకరకాల ప్రచారాల మధ్య ఇంతకీ తుడా పదవి టీడీపీకి దక్కుతుందా, జనసేన ఎగరేసుకుపోతుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది.

తుడా చైర్మన్ అయినా టీడీపీకి దక్కుతుందా?

జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ తమ పార్టీకి కావాలని గట్టిగా పట్టుబట్టని పక్షంలో టీడీపీ వారికే దక్కే అవకాశం కనిపిస్తుంది. అయితే రెండు పార్టీల అధినేతల నుంచి సూచనప్రాయంగా కూడా ఎలాంటి సంకేతాలూ అందకపోతుండటంతో దానిపై ప్రత్యేకించి తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల టీడీపీ, జనసేన వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధినేత నిర్ణయం ఎలా ఉన్నా ఇక్కడి నేతలు శిరసావహించే పరిస్థితి ఉంది. అయితే ఆ నిర్ణయమే తిరుపతిలో టీడీపీ భవిష్యత్తును నిర్ణయిస్తుందంటున్నారు విశ్లేషకులు. తుడా పదవి కూడా దక్కకపోతే తిరుపతి టీడీపీ అనాధలా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి తిరుపతి ఎమ్మెల్యే, ఎంపీ పదవులను వదులుకున్న టీడీపీ అధినేత తుడాపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

 

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×