Intinti Ramayanam Today Episode : నిన్నటి ఎపిసోడ్ లో పల్లవి, చక్రధర ప్లాన్ గురించి రాజేశ్వరికి నిజం తెలిసిపోతుంది.. ఇక పల్లవిని అడగటానికి తన అన్న ఇంటికి వెళ్తుంది.. నువ్వు ఇప్పుడు చేస్తుంది ఏంటో నాకు అర్థం కావడం లేదు.. నువ్వు ఇలా చేస్తావా.. పెళ్ళైన తర్వాత అత్తవారి ఇల్లే నీకు పుట్టిన ఇల్లు అంటుంది. ఇప్పుడే ఇదంతా చెబుతాను అంటుంది. అమ్మా నువ్వు చెబితే నేను చేస్తాను అంటుంది. నువ్వు కోరుకున్న ఇంటికే కోడలిగా వచ్చావు. ఇంకేం కావాలి.. ఈ ఇంట్లో వాళ్లు నీకు ఏం అన్యాయం చేశారు. వారిని ఇలా ముక్కలు చెయ్యాలని చూస్తావా అంటూ చెంప పగలగొడుతుంది. నాకు దక్కాల్సిన జీవితం నాకు దక్కలేదు. నేను కోరుకున్న జీవితం ఇది కాదు.. శ్రీకర్ బావను ప్రేమించానని నీకు తెలుసు.. తనతో పెళ్లి అని, జీవితం అని ఎన్నెన్నో కలలు కన్నాను. కానీ ఆ పిచ్చోడితో పెళ్లి కాదు.. వాడు నా మెడలో కట్టింది. తాళి కాదు ఉరి తాడు అంటుంది. పల్లవి పెద్ద రచ్చ చేస్తుంది. తల్లిని నిలదీస్తుంది. మామ్ నువ్వు నా గురించి నిజం చెప్పాలని చూస్తే నేను చచ్చినంత ఒట్టే.. తర్వాత నా శవాన్ని చూస్తావ్ అని పల్లవి సీరియస్ గా వెళ్ళిపోతుంది. పల్లవి గురించి తనకు నిజం తెలుసు అని అవని చెబుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి గురించి నాకు తెలుసు పిన్ని.. పల్లవి తన కుటుంబాన్నే ముక్కలు చెయ్యాలని చూస్తుంది. ఇంకో విషయం పల్లవి, కమల్ కు శోభనం కూడా జరగలేదని చెబుతుంది. వీరిద్దరికీ శోభనం జరిగితే ఇక తనకు ప్రేమ పుడుతుంది అని అంటుంది అవని.. మరి ఈ విషయం కమల్ కు తెలియదా.. ఇంట్లో ఎవరితోనూ అనలేదా అంటుంది. నైట్ ఏం జరిగిందో తెలియకుండా ఉండేందుకు పాలల్లో నిద్ర మాత్రలను కలిపి ఇస్తుంది. పొద్దున్న అంతా జరిగిపోయినట్లు కలర్ ఇస్తుంది అంటుంది. వీరి శోభనం ఎలాగైనా జరగాలి అంటుంది. ఇక అందరు భోజనం చేస్తుంటారు. అవని చేసిన పప్పును వినోద్ మెచ్చుకుంటాడు. అందరు అవని ని మెచ్చుకుంటారు. ఇక అవని రాస్తున్న నవల గురించి అందరికీ చెబుతాడు అక్షయ్.. అది ఖచ్చితంగా నా గురించే అంటుంది పల్లవి.
ఇక పల్లవి, కమల్ టీవీ చూస్తారు. అందులో రొమాంటిక్ సీన్ వస్తుంది. దాన్ని చూసి పల్లవిని గోకుతాడు. పల్లవి చిరాగ్గా ఉంటుంది. ఏంటి అంటే మనం కూడా అలా ముద్దులు పెట్టుకుందాం అంటాడు. దానికి కోపంతో పల్లవి కమల్ ను తోసేస్తుంది. ఏంటి నీకు ఇష్టం లేదా.. అని కమల్ అడుగుతాడు. దానికి ఒక సమయం ఉంటుంది అని వెళ్తుంది. అప్పుడే అవని కమల్ దగ్గరకు వచ్చి ఏమైంది కన్నయ్య అని అడుగుతుంది. దానికి కమల్ ఈ పల్లవి ఏంటో వదిన నాకు అర్థం కావడం లేదు అంటూ ఫీల్ అవుతాడు. తనకు నువ్వు ఏదైన కొనిచ్చావా.. ఏరోజైనా మల్లెపూలు, స్వీట్స్ తెచ్చావా అందుకే కోపంగా ఉంది.. నువ్వు వెళ్లి అవి తీసుకొచ్చి ఇవ్వు అంటుంది. అలాగే వదిన వెళ్లి తెస్తాను అని వెళ్తాడు. ఇక కమల్ ఎక్కడ అని అందరు అడుగుతారు. చిన్న పనిమీద బయటకు వెళ్లాడని అవని చెబుతుంది..
ఇక పల్లవి ఫోన్ పట్టుకొని చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే కమల్ మల్లెపూలు, స్వీట్స్ పట్టుకొని వస్తాడు. విషయం తెలుసుకున్న పల్లవి పాలు తాగుతావా అని అడుగుతుంది. వద్దు పాలు తాగితే నిద్ర వస్తుందని చెబుతాడు. మూడు రావాలంటే పాలు తాగాలి అని పాల కోసం వెళ్తుంది. అది గమనించిన అవని చక్కెర డబ్బాని దాచిపెడుతుంది. పల్లవి పాలల్లో నిద్ర మాత్రలు వేసి చక్కర కోసం చూస్తుంది. అక్కడ లేకపోవడంతో అత్తయ్య ను అడగాలని వెళ్తుంది. ఇక పల్లవి వెళ్లడంతో అవని, రాజేశ్వరిలు గ్లాస్ మారుస్తారు. ఆ పాలు కమల్ కు ఇస్తుంది. అంతే అంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో పల్లవి విషయం తెలుసుకొని శోభనం జరిగేలా చేస్తావా అని అవనిని అడుగుతుంది. అవని మీ అమ్మగారే ఇలా చేశారని చెబుతుంది. అంతా పద్దతిగానే చేశారు.. ఇక నువ్వు ఏమి చెయ్యలేవు అని చెబుతుంది. నిన్ను ఏం చేస్తానో చూడు అని అవనికి పల్లవి వార్నింగ్ ఇస్తుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..