Illu Illalu Pillalu Today Episode November 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. రామరాజు కొడుకు జైలుకు వెళ్తున్నాడనే సంతోషంలో భద్ర కుటుంబం సంతోషంతో దీపావళి సంబరాలను చేసుకుంటున్నారు. అప్పుడే రామరాజు కుటుంబం అక్కడికి వస్తుంది. వాళ్ల మొహాల్లో సంతోషం చూసి సేన ఫ్యామిలీ షాక్ అవుతారు. అమ్మాయిలను నమ్మించి మోసం చేస్తాడు అని నానా మాటలు అన్నారు కదా నా కొడుకు ఏ రోజు తప్పు చేయడు నేను అలా పెంచాను అని రామరాజు అంటాడు.. నేనెప్పుడూ పొరపాటు చేయను రా నా కొడుకులు అలాంటి వాళ్ళు కాదు ఆపదలో ఉన్న అమ్మాయిలని ఆదుకొని అన్నలాగా నిలబడతారు అది గుర్తుపెట్టుకోండి అని రామరాజు సేన వాళ్ళ కుటుంబంతో అంటాడు. మనం సంతోషం అందరికి తెలిసేలా.. అవతల వాళ్లు కుళ్ళుకొనేలా బాంబులను పేల్చాలి. ఇప్పుడు పేల్చండి రా మతాబులు. అవతలి వాళ్ళు చెవులు పగిలిపోయేలా ఆకాశం దద్దరిల్లెల పేల్చండి అని రామరాజు అంటాడు. వాళ్ళ సంతోషాన్ని చూసిన భద్ర విశ్వం నీ పక్కకు తీసుకొని వెళ్లి ఈ సంతోషాన్ని నేను చూడలేకున్నాను రా నాకు చాలా అసూయగా ఉంది అని అంటుంది. రామరాజు ఇంతగా నవ్వుతూ ఉండటం చూసి నాకు కోపం వస్తుంది ఏదో ఒకటి చేయాలి రా అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మనం ఇప్పటినుంచి ఫ్రెండ్స్ అని ప్రేమ ధీరజ్ లు అనుకుంటారు. చిన్నప్పుడు విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. చిన్నప్పటినుంచి మనం ఒకరంటే ఒకరు ద్వేషంతో పెరిగాము.. ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యాము అంటే ఏదోలా ఉంది అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తానికైతే ధీరజ్ నేను మళ్ళీ ఉడికించేలా చేస్తుంది ప్రేమ. నేను నీ మీద ప్రేమతో ఏమీ చేయలేదు నీ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉన్నా కూడా ఇదే పని చేస్తాను అని ప్రేమ అనడంతో ధీరజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత సాగర్ నర్మదను పొగడ్తల వర్షం కురిపిస్తాడు.
సాగర్ నర్మద దగ్గరకొచ్చి చేసిన పనికి నాకు చాలా ముద్దు వచ్చేస్తున్నావు అని అంటాడు.. ఎప్పుడు ఇదే పనా నీకు ఇంకా వేరే పనే లేదా అని నర్మదా ఆడుతుంది. నేను చెప్పిన పని నువ్వు చేస్తావా అని నర్మదా అడుగుతుంది నీ కోసం నేను ఏదైనా చేస్తాను చెప్పు అని అంటాడు సాగర్. బెడ్ పై పడుకున్నా నర్మదా పరిగెత్తి పరిగెత్తి నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి కాస్త కాళ్ళు నొక్కువా అని అడుగుతుంది.. అంతేనా చేసేస్తాను అని సాగర్ నర్మద కాలు పట్టుకోవడానికి వస్తాడు.. ఏంటి ఎవరైనా భర్తలు భార్యలకు కాళ్లు పట్టుకోవాలంటే యుగోని చూపిస్తారు.. నువ్వు మాత్రం ఇలా కాళ్ళు పడుతాను అంటావేంటి అంటున్నావ్ అని అంటుంది.
భార్యకు సేవలు చేయడం పెద్ద తప్పేమీ కాదు అని సాగర్ అంటాడు. శ్రీవల్లి అద్దంలో తనని తానే చూసుకుంటూ పొగుడుకుంటూ ఉంటుంది. అక్కడికొచ్చి శ్రీవల్లిని పట్టుకోగానే షాక్ అయిపోతుంది.. ఇవాళ నువ్వు నాకు చాలా కొత్తగా కనిపిస్తున్నామని చందు అనగానే నేను ఎల్లోరా శిల్పం లాగా ఎప్పుడు నీకు కొత్తగానే అనిపిస్తాను. కానీ నువ్వు మాత్రం మా అమ్మ నాన్న 10 లక్షలు ఇవ్వలేదని నన్ను దగ్గరకు రానివ్వలేదు అని అనగానే చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
Also Read : మీనాక్షికి యాక్సిడెంట్.. అవనిని అవమానించిన పల్లవి.. రాజేశ్వరికి నిజం తెలిసిపోతుందా..?
ఇక ఉదయం ఐదు గంటల అవ్వగానే ప్రేమ, ధీరజ్ని లేపుతుంది. ఏంటి ఇంత పొద్దున్నే లేపావు నీకు టైం కావాలంటే వాచ్లను ఫోన్లోనో చూసుకోవాలి అని అంటాడు.. నిన్న ఎన్ని కోతల కోసమో గుర్తుందా అందుకే ఇప్పుడు రన్నింగ్ కి వెళ్దాం పద అనేసి ధీరజ్ ని అంటుంది.. ఇద్దరు కలిసి రన్నింగ్ కోసం అని బయటకు వెళ్ళిపోతారు. శ్రీవల్లి అమూల్యకు మాయమాటలు చెప్పి బయటికి వెళ్దాం పద అని తీసుకొని వెళ్తుంది.. అమూల్యను శ్రీవల్లి గుడికి తీసుకుని వెళుతుంది.. ఏంటి వదిన ఇంత ఉదయాన్నే గుడికి తీసుకొని వచ్చావని శ్రీవల్లిని అడుగుతుంది.. నువ్వు పాస్ అవ్వాలని వచ్చాను.. నేను వెళ్లి పూజకు సామాన్లను తీసుకొని వస్తాను. ఇక్కడ వెయిట్ చేయని వెళ్తుంది. విశ్వం అమూల్యను చూసి అమూల్య దగ్గరికి వస్తాడు. అమూల్య మళ్లీ చెంప మీద కొడుతుంది. ధీరజ్ ప్రేమ ఇద్దరూ మాత్రం పోటీపడి మరి పరిగెడుతుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..