Ninnu kori serial today Episode: హాస్పిటల్‌కు వెళ్లిన చంద్ర కంగారు పడుతూ.. మీకేం కాలేదు కదా దెబ్బలు తగల్లేదు అంటుంటే.. ఏం కాలేదండి.. మీరెందుకు కంగారుపడుతున్నారు అంటాడు విరాట్. మదన్ కూడా మీరు కంగారు పడకండి చంద్ర గారు.. అంటాడు. విరాట్ లేచి అద్దం దగ్గరకు వెళ్లి తనను తాను చూసుకుంటాడు. రౌడీ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ నా పేరు విరాట్ కాదు సామ్రాట్ అని చెప్తాడు. ఆ మాటలకు చంద్ర, మదన్ షాక్ అవుతారు. వాళ్లు నన్ను సామ్రాట్ అని పిలిచారు చంద్ర.. వాళ్లు నన్ను బతకనివ్వము అని మాట్లాడారు. అంటూ విరాట్ చెప్తుంటే.
చంద్ర, మదన్ ఆశ్చర్యంగా వింటుంటారు. విరాట్ ఇరిటేట్‌గా చంద్ర నేను సామ్రాట్టునా..? వాళ్లు నన్ను చంపడానికి వచ్చారంటే నా వెనక కథ వేరే ఉంటుంది. ఏమై ఉంటుంది అది నాకు తెలియాలి అంటూ తల పట్టుకుంటాడు విరాట్. డాక్టర్ వచ్చి మీరు ఎక్కువగా ఆలోచించొద్దు అంటూ ఇంజక్షన్ ఇవ్వగానే.. విరాట్ మత్తుగా నిద్రపోతాడు. డాక్టర్ కు రౌడీల విషయం చెప్తారు మదన్, చంద్ర. అయితే విరాట్ అక్కడే ఉండటం సేఫ్ కాదని వెంటనే సేఫ్టీ ప్లేస్‌కు చేంజ్ చేయండి అని చెప్తాడు డాక్టర్. ఇప్పుడేం చేద్దాం అంటూ చంద్ర ఆలోచిస్తుంది.
ఒక వ్యక్తి సామ్రాట్ వాళ్ల అమ్మకు ఫోన్ చేసి సామ్రాట్ బతికే ఉన్నాడని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని చెప్తాడు. ఎక్కడున్నాడని ఆవిడ అడిగితే.. అమ్మ హాస్పిటల్ లో ఉన్నాడని చెప్తాడు. వెంటనే ఆవిడ హాస్పిటల్‌కు వెళ్తుంది. అక్కడ విరాట్‌ను చూసి ఆవిడ షాక్ అవుతుంది. డాక్టర్ వచ్చి ఆయన సామ్రాట్ కాదు విరాట్ అని చెప్తుంది. ఆవిడ కోపంగా విరాట్ ఏంటి..? వాడు సామ్రాట్ నా పెద్ద కొడుకు అంటూ నా కొడుకును ఇక్కడ అనాథలా పడేశారు.. నా కొడుకు ను నేను తీసుకెళ్తాను అంటూ చెప్తుంటే.. డాక్టర్ అతను గతం మర్చిపోయాడని తలకు పెద్ద గాయం అవ్వడం వల్ల అతను గతం మర్చిపోయాడు అని చెప్పగానే..
అంటే సామ్రాట్‌కు ఈ అమ్మ గుర్తు లేదా..? అంటూ ఎమోషనల్ అవుతుంది. బాబు కళ్లు తెరిచేలోపు ఇంట్లో ఉండాలి. అంటూ విరాట్‌ను తీసుకుని వెళ్లబోతుంటే.. డాక్టర్ అడ్డుపడతాడు. అయినా వినకుండా డాక్టర్‌కు వార్నింగ్ ఇచ్చి విరాట్ అలియాస్ సామ్రాట్‌ను తీసుకుని వెళ్తుంది. సామ్రాట్‌ను బయటకు కారు దగ్గరకు తీసుకెళ్లి కారులో కూర్చోబెడుతుంటే.. మదన్ చూస్తాడు. వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి కారును ఆపబోతే కారు వెళ్లిపోతుంది. విరాట్ మీద రాత్రి అటాక్ చేసిన వాళ్లేమో ఇప్పుడు చంపడానికి తీసుకెళ్తున్నారేమో వెంటనే విరాట్ గారిని కాపాడాలి అంటూ బైక్ మీద ఫాలో అవుతాడు.
హాస్పిటల్లో విరాట్ కనిపించకపోవడంతో చంద్ర టెన్షన్ పడుతుంది. డాక్టర్ దగ్గరకు వెళ్లి విరాట్ ఎక్కడ అని ప్రశ్నిస్తుంది. డాక్టర్ జరిగిన విషయం మొత్తం చంద్రకు చెప్తాడు. చంద్ర ఏడుస్తుంది. ఆయన నా భర్తండి నా భర్తను తీసుకెళ్లే హక్కు వాళ్లకు ఎవరు ఇచ్చారు..? మీరు ఎలా వాళ్లను తీసుకెళ్లనిచ్చారు.. నా భర్త నాకు కావాలి అంతే.. లేదంటే ఈ హాస్పిటల్ అంతా ధ్వంసం చేస్తాను అంటూ తిడుతుంటే.. ఆగండి చంద్ర గారు బయటకు వెళ్లి ఏం చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి మనం ఫేస్ లాక్ చేసిన విషయం సీక్రెట్‌గా ఉండాల్సిన విషయం.
సర్జరీకి ముందే నేను ఈ విషయం మీకు చెప్పాను. పూర్తి బాధ్యత మీరే తీసుకుంటాము అన్నారు.. మీరు కూడా మౌనంగా ఉండండి అంటాడు డాక్టర్. నేను మౌనంగా ఉండలేను డాక్టర్ ఆయన కోసం ఎంత దూరం అయినా వెళ్తాను.. ఎంత దాకా అయినా వెళ్తాను అనగానే.. ఆవిడ చాలా పలుకుబడి కలిగిన వ్యక్తిలా ఉన్నారు. నన్ను అడిగితే నీ భర్త వేరో ఎక్కడో ఒక చోట సేఫ్‌గా ఉన్నాడనుకో అంటూ సలహా ఇచ్చి వెళ్లిపోతాడు. చంద్ర, మదన్‌కు కాల్ చేస్తుంది. స్విచ్చాప్ వస్తుంది. చంద్ర ఏడుస్తుంది. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.