Udayabhanu:బుల్లితెరపై ఒకప్పుడు తన మార్క్ యాంకరింగ్‌తో సుదీర్ఘ కాలం పాటు ఏకచక్రాధిపత్యం వహించిన ప్రముఖ యాంకర్ ఉదయభాను (Udhay bhanu) సంచలన విషయాలను బయటపెట్టారు. ఆమెకు ఈవెంట్స్ చేయడం ఇష్టం లేకే దూరంగా ఉంటోందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అసలు నిజం ఇండస్ట్రీలో కొందరు ఆమెను తొక్కేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ యాంకరింగ్ ఫీల్డ్, ఈవెంట్ మేనేజర్ల తీరుపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.
మొదట్లో బుల్లితెరపై యాంకరింగ్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు ఉదయభాను, ఝాన్సీ మాత్రమే! అయితే తనకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా ఒక గ్రూప్ తీవ్రంగా ప్రయత్నించిందని ఉదయభాను తెలిపారు. తాను ఈవెంట్స్ చేయడం కొంతమందికి అస్సలు నచ్చదని, అందుకే తనను పక్కన పెట్టేసే కుట్రలు చేశారని ఆరోపించారు. ఇక తాను ఈవెంట్లలో కనిపిస్తే కొందరి కడుపు మండుతుందని షాకింగ్ కామెంట్స్ చేశారు.
సినిమా నిర్మాతలు, దర్శకులు ఖచ్చితంగా ఉదయభానునే యాంకర్‌గా పెట్టాలని కండిషన్ పెడితేనే తప్ప ఈవెంట్ మేనేజర్లు తనకు ఫోన్ చేసేవారు కాదని ఆమె స్పష్టం చేశారు. ఇక వేదికపైకి వెళ్లాక కూడా కావాలనే సరైన వివరాలు ఇవ్వకుండా, షో సరిగ్గా చేయకుండా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలో కొందరు మేనేజర్లు కావాలనే తనను ఈవెంట్లకు దూరంగా ఉంచారని ఆమె వ్యాఖ్యానించారు.
కేవలం అవకాశాలు తొలగించడమే కాకుండా, పారితోషికం విషయంలోనూ తీవ్రంగా మోసపోయానని ఉదయభాను ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అప్పట్లో కొందరు నిర్మాతలు, ఛానల్స్ నిర్వాహకులు తనకు ఇవ్వాల్సిన లక్షల రూపాయల రెమ్యునరేషన్‌ను ఎగ్గొట్టారని తెలిపారు. ఇప్పటికీ తన దగ్గర డబ్బులు రాక చెక్ బౌన్స్ అయిన పత్రాలు చాలానే ఉన్నాయని, ఇవన్నీ భరించి సైలెంట్‌గా ఉండిపోయానని చెప్పారు.
also read:పూర్తి అబ్బాయిగా మారిన స్నిగ్ధ.. గర్ల్ ఫ్రెండ్ కూడా?
ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుని ఉదయభాను ‘ఉదయభాను ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై నిర్మాతగా మారి సరికొత్త ప్రయాణం ప్రారంభించారు. ZEE5 ఓటీటీ వేదికగా ఆమె నిర్మించిన ‘పంచనామా’ అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రస్తుతం మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ఇక భవిష్యత్తులో తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా కొత్త వారికి, ప్రతిభ ఉన్న నటీనటులకు అవకాశాలు ఇస్తానని ఆమె ప్రకటించారు.
ఇన్నాళ్లూ ఉదయభాను టీవీకి ఎందుకు దూరమయ్యారనే ప్రశ్నకు ఆమె చెప్పిన ఈ నిజాలు అందరినీ షాక్ కి గురిచేస్తున్నాయి. అయితే నటిగా, యాంకర్‌గా మెప్పించిన ఆమె ఇప్పుడు నిర్మాతగా మారి ‘పంచనామా’తో విజయం సాధించడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తన సొంత ప్రొడక్షన్‌లో మరెన్నో మంచి ప్రాజెక్టులతో ఉదయభాను మున్ముందు బిజీ కావాలని కోరుకుంటున్నారు.