Sreemukhi: టాలీవుడ్ బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శ్రీముఖి (Sreemukhi)ఒకరు. బుల్లితెరపై ఉదయభాను, సుమా కనకాల తర్వాత అదే రేంజ్ లో శ్రీముఖి వరుస కార్యక్రమాలకు యాంకర్ గా కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. స్టార్ మా లో ప్రసారమయ్యే అన్ని కార్యక్రమాలకు శ్రీముఖి యాంకర్ గా కొనసాగుతూ ఉన్నారు. ఇకపోతే తాజాగా వినాయక చవితి పండుగ సందర్భంగా స్టార్ మా నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా శ్రీముఖి బిగ్ బాస్ కార్యక్రమం గురించి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
వినాయక చవితి పండుగ సందర్భంగా నిర్వహి గణపతి బప్పా మోరియా కార్యక్రమంలో బుల్లితెర నటీనటులతో పాటు కమెడియన్స్ కూడా పాల్గొని సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే కమెడియన్ హరి (Comedian Hari ) గురించి శ్రీముఖి మాట్లాడుతూ.. ఆఫ్ట్రాల్ నీకు బిగ్ బాస్ ఛాన్స్ కూడా ఇప్పటివరకు రాలేదు అంటూ ఈమె మాట్లాడారు. ఇలా హరి పట్ల సెటైర్స్ వేస్తూ శ్రీముఖి మాట్లాడిన ఈ తీరు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. శ్రీముఖి బిగ్ బాస్ కార్యక్రమాన్ని మరి అంత చులకనగా మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
శ్రీముఖి కూడా బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈమె సీజన్ 3 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టి రన్నర్ గా బయటకు వచ్చారు. ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమానికి ముందు నిర్వహిస్తున్న అగ్నిపరీక్ష కార్యక్రమానికి కూడా శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా పెద్ద మొత్తంలో పేరు ప్రఖ్యాతలు, డబ్బు సంపాదించిన శ్రీముఖి అదే కార్యక్రమం గురించి ఆఫ్ట్రాల్ అంటూ చులకనగా మాట్లాడటం సరైనది కాదని విమర్శలు కురిపిస్తున్నారు.
బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని ఎంతోమంది కంటెస్టెంట్లు మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో శ్రీముఖి కూడా ఒకరు. తనకు ఇంత స్టార్డం తెచ్చి పెట్టిన బిగ్ బాస్ గురించి ఈమె మాట్లాడిన తీరు పట్ల నెటిజన్స్ విమర్శలు కురిపిస్తున్నారు. ఇక శ్రీముఖి కెరియర్ విషయానికి వస్తే ఒకవైపు యాంకర్ గా బుల్లితెరపై సందడి చేస్తూనే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల ఈమె సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమాలో సమంత సోదరిగా నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇలా వెండితెరపై బుల్లితెరపై సందడి చేస్తూ శ్రీముఖి ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.
Also Read: అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కు బిగ్ షాక్.. గచ్చిబౌలిలో కేసు నమోదు!